9801 వార్తలు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక ఫైట్ జరగనుంది. ఏకనా స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు చాలా కీలకం. ఇందులో గనక ఓడిపోతే, పంజాబ్ ఇంటి దారి పట్టాల్సిందే. 13 పాయింట్లు సాధించిన పంజాబ్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. అయితే ఇవాళ లక్నో పైన […] The post నేడు పంజాబ్, లక్నో మధ్య కీలక ఫైట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం నెలకొంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నతరుణంలో ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైయ్యాయి. శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఫర్నీచర్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫర్నీచర్స్, ప్లైవుడ్ కారణంగా.. షాపులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పెను ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. The post ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సందర్శిస్తున్నారు. ఈ మేరకు స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం పెద్దగుట్ట టెంపుల్‌సిటీలో వేద విజ్ఞాన వ్యాప్తి కోసం ఏర్పాటు చేయనున్న శ్రీలక్ష్మీనరసింహ వేదపాఠశాలకు సీఎం భూమిపూజ చేయనున్నారు. యాదగిరిగుట్టపై భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరో నాలుగు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. The post నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో అగ్నిగుండంలా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిప్పుల వర్షం కురుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిన్న రాష్ట్రంలోనే […] The post తెలంగాణలో భానుడి భగభగ..34 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వాహనదారులపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. లీటర్ పెట్రోల్‌పై 94 పైసలు, లీటర్ డీజిల్‌పై 96 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఈ మధ్యకాలంలో ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. The post మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలన్న సన్‌రైజర్స్ ఆశ నెరవేరలేదు. సమీకరణాల కారణంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ […] The post సన్‌రైజర్స్ ఘనవిజయం.. appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివ ర్గ సమావేశం నేడు (శనివారం) సచివాలయం లో మధ్యాహ్నాం 3 గంటలకు జరుగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై మంత్రివ ర్గం కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోనుం ది. ముఖ్యంగా జూన్ 02వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపై కేబినెట్ చర్చించనున్నట్టు గా తెలిసింది. దీంతోపాటు భూముల విలువ పెంపు, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం, రెం డోవిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరుగనున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో భూము ల విలువల పెంపు దాదాపు ఖరారు కాగా, ప్రాంతాల వారీగా ఎంత పెంచాలన్న దానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించారు. అయితే గరిష్ఠంగా వంద శాతం మించి విలువలను పెంచకుండా సీలింగ్ పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే కనిష్టంగా 5 శాతం నుంచి 100 శాతం వరకు భూముల విలువలను పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి కొత్త విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ

న్యూఢిల్లీ : విద్యా, ఆర్థిక సాధికారతలతో సామాజిక స్థాయి పెరుగుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యా నించింది. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లోని పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఇంకా కొనసాగుతుండడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రశ్నించింది. తల్లిదండ్రు లిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లైనందున పిటిషనర్‌ను రిజర్వేషన్ నుంచి మినహాయించడాన్ని సమర్ధిస్తూ కర్నా టక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ విచారణ […] The post విద్యా, ఆర్థిక సాధికారతలతో సామాజిక స్థాయి మెరుగు : సుప్రీంకోర్టు appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : దేశీయ పోటీల్లో పాల్గొనడానికి రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించిన నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ఈ నిర్ణయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ ఐ)ని తీవ్రవంగా మందలించింది. రానున్న ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఫోగాట్ పాల్గొనడాన్ని ఖరారు చేయడానికి, అలాగే ఆమె ఫిట్‌నెస్‌ను మూల్యాంకనం చేసేందుకు తక్షణమే ఒక నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలో మాతృత్వాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రసూతి సెలవుల […] The post డబ్ల్యూ ఎఫ్ఐపై ఢిల్లీ హైకోర్టు మండిపాటు appeared first on Navatelangana.

18 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికఉష్ణోగ్రతలు ఒకటెండ్రు డిగ్రీలు పెరిగే అవకాశంపలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి : వాతావరణ శాఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండు తున్నది. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా […] The post 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు appeared first on Navatelangana.

ప్రపంచ కేంద్రంగాఎదుగుతోన్న తీరుదానిని వాషింగ్టన్ ఆపలేదని బీజింగ్ నమ్మకంఇకపై అమెరికా ‘అడ్డుకోలేని మహాశక్తి’ కాదని విశ్వాసం : ప్రముఖ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్ బీజింగ్ : ప్రపంచంలో చైనా ఎదుగుతున్న తీరు అమెరికాను మించి ఉంటుందని కీలక నివేదికను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్ చెప్తున్నారు. భవిష్యత్‌లో చైనా కేంద్రంగానే ప్రపంచ రాజకీయ గమనం ఉంటుందని అంటున్నా రు. అమెరికా ఇక తమ ఎదుగుదలను అడ్డు కోలేదనీ, భవిష్యత్ ప్రపంచ వ్యవస్థ క్రమంగా చైనా […] The post చైనాకు తిరుగుండదు appeared first on Navatelangana.

నిరాశ్రయులైన 10 లక్షల మంది మహిళలు, బాలికలుఐక్యరాజ్యసమితి మహిళల వాదనా నివేదిక వెల్లడి గాజా : రఫా, ఇజ్రాయిల్ దురాక్రమణతో పాలస్తీనా పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ఇండ్లు, పాఠశాలలు, నిర్దేశిత ఆశ్రయాలతో సహా దాదాపు 90 శాతం పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. నీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం వంటి నిత్యావసర సేవలను ఇజ్రాయిల్ కఠినతరం చేసింది. అయినా ప్రాణాలతో బయటపడిన వారు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. అంతేకాక పదేపదే నిరాశ్రయులుగా మారడంతో పాటు వ్యాధుల ముప్పును […] The post గాజా యుద్ధంతో అసమాన నష్టం appeared first on Navatelangana.

జవహర్ నగర్ డంప్ యార్డు సందర్శనమరోసారి సమావేశం.. సీఎంకు సమగ్ర నివేదికనిబందనలను తుంగలో తొక్కిన రాంకీ : ఎంపీ ఈటల నవతెలంగాన-సిటీబ్యూరోజవహర్ నగర్ డంప్ యార్డ్ పై గురువారం నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు డంప్‌యార్డ్‌ను సందర్శించారు. అనంతరం హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రామ్‌కీ సంస్థ […] The post ‘రాంకీ’పై ప్రజాప్రతినిధుల ఆగ్రహం appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజురోజుకు రికార్డ్ పతనాన్ని చూస్తోన్న వేళ నిటి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా రూపాయిని గాలికి వదిలేయండంటూ పరోక్షంగా అత్యంత బాధ్యత రహిత్య వ్యాఖ్యలు చేశారు. డాలర్‌తో రూపాయి విలువ 100కు తగ్గాల్సిందేనన్నారు. చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా రూపాయి విలువ పడేల్సిందేనని ఆర్బిఐ పలు సూచనలు చేయడం ఆర్థిక నిపుణులను ఆగ్రహానికి గురి చేస్తోంది. డాలర్‌కు రూ.100 అనేది కేవలం మానసిక భావనే […] The post రూపాయి 100కు పడాల్సిందే..! appeared first on Navatelangana.

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడు భాషల బోధన (త్రిభాషా సూత్రం)ను తప్పనిసరి చేస్తూ తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తరఫున దాఖలైన ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ […] The post త్రిభాషా సూత్రంపై సుప్రీంలో పిటిషన్ appeared first on Navatelangana.

భాగ్యనగరంలో పట్టా లెక్కనున్న మరో 123 కిలోమీటర్ల మెట్రోరూ. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ప్రాజెక్టుఫేజ్-3 కింద 39 కిలోమీటర్ల ‘ఫ్యూచర్ సిటీ కారిడార్త్వరలోనే కేంద్రానికి సవరించిన డీపీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో కదిలిన ప్రాజెక్టు ఫైల్ నవతెలంగాణ-సిటీబ్యూరోకొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రో రెండో దశ పట్టాలెక్కుతోంది.. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో మెట్రో రెండో […] The post హైదరాబాద్ మెట్రో రెండో దశకు అడుగులు appeared first on Navatelangana.

దానివల్ల స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయిపెట్టుబడి, ముడిసరుకు, మానవ వనరులు, మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలికర్నాటక స్మాల్ స్కేల్ ఇండస్ర్టీస్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోదేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి పెడితే ఎక్కడికక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి చెప్పారు. భారతదేశంలో 98 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయన్నారు. అందువల్ల కేంద్రంలో సూక్ష్మ […] The post సూక్ష్మ పరిశ్రమలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.

ఆయన పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్పర్సా సత్యనారాయణ ఉద్యమ స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్య పోరాటాలను బలోపేతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో పర్సా 11వ వర్థంతి సభను రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సా చిత్ర పట్టానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ […] The post కార్మికోద్యమ ఆదర్శ నాయకుడు ‘పర్సా’ appeared first on Navatelangana.

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అడవిలో బీడీ ఆకులు సేకరించేందుకు అడవికి వెళ్లిన మహిళలపై శుక్రవారం ఉదయం పులి దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గుంజేవాహి గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్-1836 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే పులి దాడి చేసిందా, లేక ఒకటికంటే ఎక్కువ పులులు ఉన్నాయా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు పేర్కొన్నారు. 10 నుంచి 13 మంది మహిళలు కలిసి బీడీల తయారీలో ఉపయోగించే తెండు (బీడీ) ఆకులు సేకరించేందుకు అడవికి వెళ్లారు. ఈ సమయంలో పులి మాటు వేసి దాడి చేయడంతో కవాడాబాయి మోహుర్లే (45), అనితాబాయి మోహుర్లే (40), సునీతా మోహుర్లే (38), సంగీతా చౌదరి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా గుంజేవాహి గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు.పులి కదలికలను గమనించేందుకు అటవీశాఖ 30 కెమెరా ట్రాప్‌లు, మూడు లైవ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఫీల్డ్ సిబ్బంది, ప్రత్యేక బృందాలతో గస్తీని మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బృందాలు ఘటనాస్థ


‘‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం’’ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అదే చిత్రం ఇప్పుడు తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. రాష్ర్టాన్ని ఒకప్పుడు “రైతు రాజ్యం”గా ప్రచారం చేశారు. రైతు సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల హామీలతో వ్యవసాయం బలపడిందని పాలకవర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో గ్రామీణ వాస్తవం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దుక్కిదున్నిన రైతు చివరకు అప్పు తీర్చలేక, పండించిన పంట అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి […] The post భరోసా లేని బతుకు appeared first on Navatelangana.

మిత్రులారా… హైదరాబాద్‌కు రావడం అంటే నాకు ఎప్పుడూ సంతోషమే. భారతీయ భావనను హైదరాబాద్ నగరం అర్థం చేసుకున్నంత సమగ్రంగా మరో నగరం అర్థం చేసుకోలేదనుకుంటాను. హైదరాబాద్ నగరం ఎన్నడూ సంకుచితమైన అడ్డుగోడలు కట్టుకోలేదు. ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారతదేశానికి, ఉర్దూకి, తెలుగుకి, బిర్యానీకి, సాంకేతిక పరిజ్ఞానానికి ఆలవాలమైన హైదరాబాద్ నగరం మరోవైపు పాతకాలపు రాజసానికి, ఆధునిక విశ్వపు ఆశాజ్యోతులకు ప్రతినిధ్యం వహిస్తోంది. భారత కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రతిభావంతమైన పార్లమెంటరీ నాయకుడు, సమగ్ర భారతీయుల […] The post నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు appeared first on Navatelangana.

నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ మరో కీలక నిందితురాలిని అరెస్ట్ చేసింది. పుణేకు చెందిన లెక్చరర్ మనీషా సంజయ్ హవల్దార్‌ను ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్ని కొందరు అభ్యర్థులకు లీక్ చేసిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పుణేలోని సేఠ్ హీరాలాల్ సరాఫ్ ప్రశాలాలో పనిచేస్తున్న హవల్దార్‌ను ప్రశ్నాపత్రం లీక్‌కు ప్రధాన ‘సోర్స్’గా సీబీఐ గుర్తించింది. సీబీఐ ప్రకటన ప్రకారం, హవల్దార్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ ప్రక్రియలో నిపుణురాలిగా నియమించింది. దీంతో ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి ప్రాప్యత లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె కొంతమంది ప్రశ్నలను సహనిందితురాలు మనీషా మంధారేకు పంపినట్లు సీబీఐ ఆరోపించింది. మంధారే పుణేకు చెందిన బోటనీ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమెను ఇప్పటికే మే 16న అరెస్ట్ చేశారు. హవల్దార్ లీక్ చేసిన ప్రశ్నలు నీట్ యూజీ-2026 ఫిజిక్స్ ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం