నవతెలంగాణ – హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర‌ అగ్ని ప్రమాదం నెలకొంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న‌త‌రుణంలో ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైయ్యాయి. శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఫర్నీచర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫర్నీచర్స్, ప్లైవుడ్ కారణంగా.. షాపులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పెను ప్ర‌మాదంలో భారీగా ఆస్తి నష్టం జ‌రిగింది. ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The post ఢిల్లీలో ఘోర‌ అగ్ని ప్రమాదం.. appeared first on Navatelangana.