
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అ భ్యర్థి మీనాక్షి నటరాజన్‌నామినేషన్ తిరస్కరణపై కాంగ్రె స్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ను ఆశ్రయించింది. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఉత్తర్వు అత్యంత దారుణమైనది, చట్టవిరుద్ధమైనది అని పేర్కొంటూ దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రధాన నేతలు కే సీ వేణుగోపాల్, జైరామ్ రమేష్, అభిషేక్ మను సింఘ్వీ, వివేక్ తంఖా, రణ్‌దీప్ సింగ్, భూపేష్ భగేల్, దీపా దాస్‌మున్షీలతో కూడిన ప్రతినిధి బృందం, మీనాక్షి నటరాజన్ తో కలిసి ఎన్నికల కమిషన్ అధికారులను కలిసింది. ఈసీ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మీనా క్షి నటరాజన్, ఇది ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే చ ర్య. అయినప్పటికీ రాజ్యాంగబద్ధ సంస్థలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ఈ పోరాటం చేస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ న్యాయ విభాగం అధిపతి అభిషేక్ మ ను సింఘ్వీ మాట్లాడుతూ, రిటర్నింగ్ అధికారి నిర్ణయం పూర్తిగా వక్రీకృతమైనదని విమర్శించారు.
ఈసీకి మేము స్పష్టంగా వివరించాం. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఉ త్తర్వు 2+2=7 అన్నంత అసంబద్ధంగా ఉంది అని వ్యా ఖ్యానించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33A ప్రకారం, రెండు సంవత్సరాలకు మించిన శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు, అలాగే కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసిన కేసుల వివరాలనే అభ్యర్థులు అఫిడవిట్‌లో వెల్లడించాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైనట్లు చెబుతున్న ఫిర్యాదుపై కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ (పరిశీలన) కూడా తీసుకోలేదని సింఘ్వీ తెలిపారు. ఆమెకు వ చ్చిన నోటీసు కేవలం కోర్టు ఎందుకు కాగ్నిజెన్స్ తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరిన నోటీసు మాత్రమే. కాగ్నిజెన్స్ తీసుకోకముందు చట్టపరంగా ఎలాంటి క్రిమినల్ కేసు ఉనికిలో ఉండదు. అలాంటప్పుడు ఆమె ఏ సమాచారాన్ని దాచిపెట్టిందని చెబుతున్నారు? అని ప్ర శ్నించారు. రిటర్నింగ్ అధికారి తప్పుడు కారణాలతో నా మినేషన్ తిరస్కరిస్తే ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం జోక్యం చేసుకునే పూర్తి అధికారం ఉందని సింఘ్వీ పేర్కొన్నారు.హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో గతంలో కూడా ఈసీ ఇలాంటి అధికారాలను వినియోగించింది.
ఇక్కడ కూడా వెంటనే జోక్యం చే సుకోవాలి అని కోరారు. జూన్ 18న జరగనున్న మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల కోసం పోటీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా సంచల నం సృష్టించింది. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ జారీ చేసిన ఉత్తర్వులో, నామినేషన్‌తో పాటు సమర్పించిన ఫారం-26 అఫిడవిట్‌లో ఒక కోర్టు ఫిర్యాదు వివరాలను పేర్కొనలేదని, అందువల్ల అఫిడవిట్ అసంపూర్ణం గా ఉందన్నారు. బీజేపీ అభ్యర్థి మ హేశ్‌కేవత్, తెలంగాణ లో నమోదైన ఒక కేసు వివరాలను మీనాక్షి తన అఫిడవిట్‌లో వెల్లడించలేదని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశా రు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవ లం ప్రజాస్వామ్య హత్య మాత్రమే కాదు. ఇది ‘వోట్ చోరీ’ కాదు, నేరుగా ‘సీటు చోరీ’ అని కాంగ్రెస్ ఆరోపించింది.













