TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9801 వార్తలు

లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
తెలంగాణ

లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మునగపాక మండలం అరబుపాలెం, మూలపేట గ్రామానికి చెందిన బంధువుల కారులో భద్రాచలం వెళ్లారు. తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జ్యోతి(31), కూర్మారావు(42)గా గుర్తించారు. రెండు గ్రామాలలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Adminమే 23, 2026 - శనివారం👁 0
పంజాబ్‌కు చావోరేవో
తెలంగాణ

పంజాబ్‌కు చావోరేవో

నేడు లక్నోతో కీలక పోరు లక్నో: ఐపిఎల్‌లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు చాలా కీలకంగా మారింది. ఆరంభంలో వరుస విజయాలతో ఈ సీజన్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాటపట్టింది. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇక నాకౌట్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో ఓడితే ఇంటిదారి పట్టక తప్పదు. అంతేగాక చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి పాలు కావాలి. కోల్‌కతా కూడా తన చివరి మ్యాచ్‌లో గెలవకూడదు. అప్పుడే పంజాబ్‌కు ప్లేఆఫ్ ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ బలంగానే ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలం కావడం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. ఆరంభంలో జట్టును ముందుండి నడిపించిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా కెప్టెన్‌గా కూడ పూర్తిగా తేలిపోతున్నాడు. దీని ప్రభావం జట్టుపై బాగానే పడుతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా శ్రేయస్ తన బాధ్యతను సక్రమంగా

ట్రంప్ సర్కార్ నుంచి మరో వికెట్ ఔట్.. US ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా
పెట్రోల్, డీజిల్ పెరిగింది.. బంగారం ధర తగ్గింది.. వెండి అలాగే ఉంది..!
యువత డిజిటల్ ఉద్యమ సునామీ
తెలంగాణ

యువత డిజిటల్ ఉద్యమ సునామీ

దేశ రాజకీయ ముఖచిత్రంలో ఊహించని సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్ వేదికగా యువత బొద్దింకల జనతా పార్టీ (కాక్రోచ్ జనతా పార్టీ), జాతీయ పరాన్నజీవుల కూటమి (నేషనల్ పారసైటిక్ ఫ్రంట్) పేర్లతో సృష్టించిన రెండు కొత్త శక్తులు సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థాగత అవినీతికి నిరసనగా భారతీయ జెన్‌జెడ్ సోషల్ మీడియా వినియోగదారులు సృష్టించిన వ్యంగ్య ఆన్‌లైన్ రాజకీయ ఉద్యమాలివి. ఇవి కేవలం మీమ్స్‌కే పరిమితం కాకుండా యువత ఆక్రోశాన్ని ప్రతిబింబించే సామూహిక డిజిటల్ నిరసనగా రూపాంతరం చెందాయి. ఈ రెండింటికీ ఎన్నికల సంఘం గుర్తింపు లేకపోయినా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు చెమటలు పుట్టిస్తున్నాయి. ఇందులో బొద్దింకల జనతా పార్టీ అసాధారణ డిజిటల్ ఉద్యమం వెనుక ఉజ్వలమైన ఆత్మగౌరవ పోరాటం ప్రజ్వలిస్తోంది. ఇదే నెల (2026 మే)లో ఒక కోర్టు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు తీవ్ర మనస్తాపం కలిగించాయి. నిరుద్యోగ యువత వ్యవస్థపై దాడిచేసే బొద్దింకలని, సమాజాన్ని పట్టిపీడించే పరాన్నజీవులని, సోమరుల

మాజీ సర్పంచ్ దారుణ హత్య
ఔను, వాళ్లిద్దరూ బోనెక్కాలి!
తెలంగాణ

ఔను, వాళ్లిద్దరూ బోనెక్కాలి!

2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న రాహుల్ గాంధీకి ఇప్పటికీ పరిణతి గాని, సంయమనం గాని లేకపోవటం దయనీయమైనది. ఆ వంశ వారసత్వానికే అవమానకరం. దేశ ప్రయోజనాలు అమెరికన్ వ్యూహాలకు, ధనిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా మారటం మన్నది కాంగ్రెస్ హయాంలోనే మొదలై ఇపుడు కూడా కొనసాగుతున్నదని రాహుల్‌కు తెలియదా? ఆయన అదానీ, అంబానీలను ప్రస్తావించారు. ఇందులో అదానీ పేరు మోడీ కాలానికి సంబం ధించినది. కాని మొదటి నుంచి టాటా, బిర్లాలు అనే మాట, తర్వాత అంబానీ మాట, కాంగ్రెస్ ఆర్థిక విధానాలకు పర్యాయ పదాలుగా మారటం ఆయన దృష్టికి రాలేదా? 1990 ల నుంచి తామే ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, సృష్టించిన విప రీతమైన సామాజిక తారతమ్యాల గురించి తను వినలేదా? ఇవి అన్నీ ఒక స్థాయిలో అమెరికా శిబిరపు పెట్టుబడిదారీ ప్రయోజనాలతో ఎట్లా ముడిబడిపోయాయో, ఈ విషయంలో తమకు, బిజెపికి మధ్య ఏమాత్రం తేడా ఎట్లా లేదో చూసే అధ్యయనాలను ఆయన చూడలేదా?కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈ నెల 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలపై చేసిన ఘాటైన విమర్శలనూ, అందుకు జవాబుగా బిజెపి అధ్యక్షుడు నితిన్ నబీ కాంగ్రెస్ నాయకునిపై చేసిన ఎదురు దాడినీ గమనించినపుడు, ఆ

లింగ నిర్ధారణపై సమాచారం ఇస్తే రూ.50 వేల బహుమతి
మెదక్ జిల్లాలో రూ.96 కోట్లతో మెప్మా యాక్షన్ ప్లాన్
హోండురాస్‌‌‌‌‌‌‌‌లో గ్యాంగ్ వార్.. 25 మంది మృతి
ప్రభుత్వ స్కూల్ టాపర్లకు విమాన ప్రయాణం ..మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి
ట్రంప్ నిర్ణయంపై ‘నాటో’లో గందరగోళం
నారసింహుడి సేవలో కంచి కామకోటి పీఠాధిపతి
కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీకి పాక్‌‌‌‌‌‌‌‌తో లింకులు.. బీజేపీ సంచలన ఆరోపణలు..!
హెచ్‌పివి టీకా మహిళలకు రక్ష
తెలంగాణ

హెచ్‌పివి టీకా మహిళలకు రక్ష

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటివి గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌కు కారణమవుతూ మహిళలను వేధిస్తోంది. గర్భాశయం కింది భాగంలో కణాల అసాధారణ పెరుగుదలను హెచ్‌పివి (హ్యూమన్ పాపిల్లోమా వైరస్)గా పిలుస్తారు. ఈ వైరస్‌వల్ల కలిగే ముఖద్వార క్యాన్సర్‌ను అరికట్టడానికి బాల్యదశలోనే వ్యాక్సినేషన్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ క్యాన్సర్‌కు కారణమవుతోంది. ముఖద్వార క్యాన్సర్‌లో రెండు వందలకు పైగా రకాలున్నాయి. కొన్ని జననాంగంపై మొటిమలకు కారణమైతే, మరికొన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఈ క్యాన్సర్ నివారణకు 9 14 ఏళ్ల బాలికలకుహెచ్‌పివి వ్యాక్సినేషన్ అత్యవసరంగా మారింది. ఈ క్యాన్సర్ తలెత్తినప్పుడు యోనిద్వారా రక్తాస్రావం (పీరియడ్స్ మధ్యలో లేదా సంభోగం తర్వాత) జరుగుతుంది. ప్రస్తుతం 90 95 % కేసులు హెచ్‌పివి ఇన్పెక్షన్ ద్వారా వస్తున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో దాదాపు నాలుగోవంతు మన దేశంలోనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా సుమారు 1.28 లక్షల మంది మ

యాదగిరిగుట్టలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
సంతానవృద్ధితో సంపద సృష్టి?
తెలంగాణ

సంతానవృద్ధితో సంపద సృష్టి?

భారం మోసేది మనం కాకపోతే ఒడ్డున కూర్చుని ఎన్ని సుద్దులైన చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా అలాగే ఉంది. మూడో బిడ్డని కంటే 30 వేలు, నాలుగో బిడ్డని కంటే 40 వేలు ఇస్తారట. మరి ఒక్కసారి ఇచ్చే డబ్బులతో పాతికేళ్లు ఎలా పోషించాలి? అవసరమైతే తర్వాత కూడా పోషించాల్సి వస్తుందేమో. 30, 40 వేలతో ఎవరైనా ఎంతకాలం పోషించగలుగుతారు? ఇది ఏ రకమైన తర్కానికి అందడం లేదు. భారతదేశంలోని అరుదైన ఆర్థికవేత్తలలో తాను ఒకడినని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటాడు, చెప్పించుకుంటాడు. అసలు మోడీ, మన్మోహన్ ప్రభుత్వాలే కాక ప్రపంచంలోని చాలా దేశాలు తన ఆర్థిక సలహాలు విధానాలు పాటిస్తాయని సగర్వంగా ప్రకటిస్తాడు. ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా సమస్యతో బాధపడుతుంటే మన ఆర్థికవేత్త ఆంధ్ర ప్రజలు ముగ్గురిని నలుగురిని కనమని సలహాలిస్తున్నాడు. అందుకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాడు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకున్న సందర్భంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావడం దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు కొత్తగా కలుస్తున్నాయన్న బాధ ఆయనలో ఎక్కువగా ఉంది. సహజంగానే ఉత్తరాది రాష్ట్రా

తెలంగాణలో నిప్పుల వాన.... వడదెబ్బ@ 34 మంది మృతి
తెలంగాణ

తెలంగాణలో నిప్పుల వాన.... వడదెబ్బ@ 34 మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రతతో పాటు వడ గాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 34 మంది చనిపోయారు. ఖమ్మం(7), భద్రాద్రి కొత్తగూడెం(5), ఆదిలాబాద్(3), జయశంకర్ భూపాలపల్లి(3), జగిత్యాల(2), వరంగల్(2), మహబూబాబాద్(2), నల్లగొండ(2), పెద్దపల్లి(2), సంగారెడ్డి(1), నిజామాబాద్(1), హనుమకొండ(1), సూర్యాపేట(1), కరీంనగర్(1) మృతి చెందారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏకం గా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మా ర్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గు రిచేస్తోంది. ఇక్కడి ప్రజలు మండుతున్న ఎండలతో తీవ్ర అవస్థలు ప డుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ జన సం చారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. రా బోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకా శం ఉందన్న హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భానుడి ఉగ్ర రూపంతో పలుచోట్ల గత పదేళ్ల మే నెల రికార్డులు బద్దలు అయ్యా యి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్ల మే నెల లో అత్యధిక ఉష్ణో గ్రత రికార్డు 2019 మే 24, 29, 30 తేదీల్లో 46.3 డిగ్రీలుండగా బుధవారం దానిని అ

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్ణాటకలోని కలబురగి జిల్లా లాడ్లాపూర్ సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న ఒక క్రూజర్ వాహనం, ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ధాటికి క్రూజర్ ముందుభాగం పూర్తిగా ధ్వంసం అయింది. మృతులను క్యాష్వార్‌, హుస్సేన్‌ షా, మహబూబ్‌ అలీ, రసూల్‌ బీ, ఫాతిమా అలీలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. The post ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి appeared first on Navatelangana.

భానుడి భగభగ... వడదెబ్బ @ 21 మంది మృతి
తెలంగాణ

భానుడి భగభగ... వడదెబ్బ @ 21 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వడదెబ్బతో ఒక్క రోజే ఎపిలో 21 మంది చనిపోయారు. ఒక్క విజయవాడలో పది మంది దుర్మరణం చెందారంటే ఏ విధంగా ఎండ మండిపోతోంది అర్థమవుతుంది. మృతులలో ఇద్దరు ఫౌరులు కాగా మిగిలిన ఎనిమిది మంది యాచకులుగా గుర్తించారు. ఆంధ్రాలో ఎండలు పగలు శగలు చిమ్ముతున్నాయి. ఎండల పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజుల నుంచి ఎండలు మరింత తీవ్రరూపం దాల్చాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాటు ఏకంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ! ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన ప్రతాపాన్ని తీవ్రస్థాయిలో చూపిస్తోంది. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తుండగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిడుగురాళ్లలో బుధవారం 47.6 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత, గురువారం మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఇక ఇతర ప

అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ రాజీనామా
ఆధార్ ఉచిత అప్డేట్‌ గడువు పొడిగింపు
తెలంగాణ

ఆధార్ ఉచిత అప్డేట్‌ గడువు పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరే శుభవార్త. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు UIDAI మరో ఏడాది పాటు అవకాశం కల్పించింది. జూన్ 14, 2027 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఆధార్ హోల్డర్లు తమ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఫ్రీగా అప్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం myAadhaar పోర్టల్‌లో ఆధార్ నంబర్, OTPతో లాగిన్ అయి అప్డేట్ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయాలి. రుజువు కోసం అవసరమైన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. ఆధార్ సెంటర్లలో మాత్రం ఛార్జీలు వసూలు […] The post ఆధార్ ఉచిత అప్డేట్‌ గడువు పొడిగింపు appeared first on Navatelangana.

సూర్యాపేటలో మాజీ సర్పంచ్ ను మూడు ముక్కలుగా నరికారు
తెలంగాణ

సూర్యాపేటలో మాజీ సర్పంచ్ ను మూడు ముక్కలుగా నరికారు

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ నాయకుడిని నరికి చంపారు. ఎర్కారం గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును గుర్తు తెలియని వ్యక్తులు మూడు ముక్కలుగా నరికి చంపారు. అనంతరం శరీర భాగాలను ఎస్ఆర్ ఎస్ పి కాలువలో పడేశారు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధు హత్యతో ఎర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గ్రామానికి భారీగా చేరుకొని పికెటింగ్ నిర్వహించారు. గతంలో ఎర్కారం సర్పంచ్ ను హత్య చేసిన విషయం తెలిసిందే.

విశాఖలో భారీ వర్షం.... కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు