9800 వార్తలు




నవతెలంగాణ – హైదరాబాద్ : లద్దాఖ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం లేహ్ పరిసర పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం అనంతరం వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనకు గల కారణాలపై ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. The post లద్దాఖ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్..తృటిలో ప్రాణాపాయం appeared first on Navatelangana.

నవతెలంగాణ- నాచారం: నాచారం సర్కిల్ మల్లాపూర్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఉప్పల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 233 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద మరియు మధ్యతరగతి […] The post లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి appeared first on Navatelangana.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు అఖిల్.. తన కెరీర్‌లో సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. 2023లో ‘ఏజెంట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్.. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్ పల్లెటూరి కుర్రాడిలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చి అప్‌డేట్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ‘మనోడు వస్తున్నాడు’.. నేను తప్పిపోయి రాలేదు.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా’ అంటూ అఖిల్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. తన గ్లామర్‌తో, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. మొత్తానికి దర్శకుడు మురళీకిశోర్.. సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చూసిన అభిమానులు అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడంటూ’ నాగార్జున ఈ టీజర్‌ని


నవతెలంగాణ-గీసుకొండ : గీసుకొండ మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్తర్ పాషా తండ్రి యాకుబ్ ఇటీవల మృతిచెందగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాకుబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా […] The post కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.


హైదరాబాద్: న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపేసిన సంఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శనివారం ఉదయం న్యాయవాది కాజా మోహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారు డోర్ ఓపెన్ చేసి ఎక్కుతున్నాడు. అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. అతడు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు మోహినుద్దీన్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.



అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతోనే రాజకీయాలు నేరమయంగా మారాయని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఫ్యాక్షనిజం మొదలైందే మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచివాడినని జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని, వైసిపి అసత్య ప్రచారం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఫ్యాక్షన్ గ్రూప్ లను రాజారెడ్డి పెంచి పోషించారని, వైసిపి హయాంలో అన్ని రంగాలపై గొడ్డలి వేటు వేశారని పయ్యావుల మండిపడ్డారు. వైసిపి ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని, నేరాలు చేయడమే వైసిపి నైజమని ధ్వజమెత్తారు. వైఎస్ హత్య విషయంలో రిలయన్స్ పై ఆరోపణలు చేశారని, రిలయన్స్ సంస్థలపై దాడులు చేశారని వివేకాను చంపింది..తమ వాళ్లేనని సునీతారెడ్డి చెబుతున్నారని తెలియజేశారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి ఒక వింత వాదన చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

– టెంపుల్ సిటీ లో వేద పాఠశాలకు శంకుస్థాపన– అనంతరం నరసింహున్ని దర్శించుకున్న సీఎంనవతెలంగాణ – యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంరేవంత్ రెడ్డికి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా టెంపుల్ సిటీలో 43 కోట్ల వ్యయంతో […] The post యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి..అభివృద్ధి పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.




హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేదు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే ఉన్నది కాసేపే అయినా.. కోహ్లీ, ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘భారీ షాట్లు కొట్టు’ అంటూ హెడ్ కోహ్లీని రెచ్చగొట్టాడు. దీనికి కోహ్లీ ధీటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘నువ్వు ఆఫ్ స్పిన్ వేయడానికి వస్తే అదే చేస్తా. అయినా, నువ్వు ఎప్పుడూ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తావు కదా’’ అంటూ హీట్ పెంచాడు. అయితే ఈసారి మ్యాచ్‌లో హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్ కాకపోవడం గమనార్హం. ఆఖర్లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన హెడ్ రజత్ పాటిదర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తన ఇన్‌స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. ‘అవతలి వ్యక్తి ఊహించడం కూడా అసాధ్యం అన్న రీతిలో మన ప్రదర్శన ఉండాలి’ అని అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. అయితే అప్పటితో ఈ వివాదం ముగియలేదు. నిజానికి కోహ్లీ మ్యాచ్

నవతెలంగాణ – హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణం జరిగింది. న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం న్యాయవాది మొహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయల్దేరుతున్న క్రమంలో.. వెనుక నుంచి వచ్చి మరో కారుతో ఢీకొట్టారు. దీంతో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ […] The post హైదరాబాద్ లో దారుణం.. న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు appeared first on Navatelangana.

చెన్నై: పదేళ్ల బాలిక మృతదేహం చెరువులో కనిపించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సూలూరు ప్రాంతంలో జరిగింది. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భారతీపురం గ్రామంలో పదేళ్ల బాలిక తన తల్లిదండ్రులకు కలిసి ఉంటుంది. గురువారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వెతికారు. ఎక్కడా బాలిక ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక నివాసం స్థలం నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో గల కన్నంపాలయం చెరువులో బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఇఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ అనే యువకుడు చాక్లెట్లు కొనిస్తానని బాలికను బైక్ పై తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం బాలికను చంపేసి మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పక్కనే ఉండే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకొని వెంటనే శిక్షించాలని

నవతెలంగాణ – హైదరాబాద్ : చైనాలోని లియుషెన్యూ బొగ్గుగనిలో పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, తర్వాత మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో 9 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనపై అధ్యక్షుడు జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసేవలు అందించాలని, తక్షణమే ఈ ఘటపై దర్యాప్తు […] The post బొగ్గు గనిలో పేలుడు.. 82 మంది మృతి appeared first on Navatelangana.

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘సమవర్తి‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. ‘సమవర్తి‘ సినిమాను రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ‘సమవర్తి‘ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ చుట్టూ గొడ్డళ్లు, కత్తులతో కొందరు దూసుకురాగా, ఆయన ఎలాంటి భయం లేకుండా హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ ఇంటెన్స్ లుక్స్ లో కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మునగపాక మండలం అరబుపాలెం, మూలపేట గ్రామానికి చెందిన బంధువుల కారులో భద్రాచలం వెళ్లారు. తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జ్యోతి(31), కూర్మారావు(42)గా గుర్తించారు. రెండు గ్రామాలలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.