
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతోనే రాజకీయాలు నేరమయంగా మారాయని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఫ్యాక్షనిజం మొదలైందే మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచివాడినని జగన్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని, వైసిపి అసత్య ప్రచారం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఫ్యాక్షన్ గ్రూప్ లను రాజారెడ్డి పెంచి పోషించారని, వైసిపి హయాంలో అన్ని రంగాలపై గొడ్డలి వేటు వేశారని పయ్యావుల మండిపడ్డారు. వైసిపి ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని, నేరాలు చేయడమే వైసిపి నైజమని ధ్వజమెత్తారు. వైఎస్ హత్య విషయంలో రిలయన్స్ పై ఆరోపణలు చేశారని, రిలయన్స్ సంస్థలపై దాడులు చేశారని వివేకాను చంపింది..తమ వాళ్లేనని సునీతారెడ్డి చెబుతున్నారని తెలియజేశారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి ఒక వింత వాదన చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.













