
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ నాయకుడిని నరికి చంపారు. ఎర్కారం గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును గుర్తు తెలియని వ్యక్తులు మూడు ముక్కలుగా నరికి చంపారు. అనంతరం శరీర భాగాలను ఎస్ఆర్ ఎస్ పి కాలువలో పడేశారు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మధు హత్యతో ఎర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గ్రామానికి భారీగా చేరుకొని పికెటింగ్ నిర్వహించారు. గతంలో ఎర్కారం సర్పంచ్ ను హత్య చేసిన విషయం తెలిసిందే.












