అమరావతి: ఆంధప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. 104 ఏరియాలోని బాపూజీ నగర్ లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. కొబ్బరి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. పిడుగుపడడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. పిడుగుపడిన ప్రదేశంలో మనుషులు ఏవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈదురు గాలులు వీయడంతో పాటు ఆకాల వర్షం రావడంతో మామిడి తోటలోని కాయలు నేలరాలాయి.