TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9805 వార్తలు

భరోసా లేని బతుకు
తెలంగాణ

భరోసా లేని బతుకు

‘‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం’’ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అదే చిత్రం ఇప్పుడు తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. రాష్ర్టాన్ని ఒకప్పుడు “రైతు రాజ్యం”గా ప్రచారం చేశారు. రైతు సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల హామీలతో వ్యవసాయం బలపడిందని పాలకవర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ, క్ష‍ేత్రస్థాయిలో గ్రామీణ వాస్తవం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. దుక్కిదున్నిన రైతు చివరకు అప్పు తీర్చలేక, పండించిన పంట అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి […] The post భరోసా లేని బతుకు appeared first on Navatelangana.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు
తెలంగాణ

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు

మిత్రులారా… హైదరాబాద్‌కు రావడం అంటే నాకు ఎప్పుడూ సంతోషమే. భారతీయ భావనను హైదరాబాద్ నగరం అర్థం చేసుకున్నంత సమగ్రంగా మరో నగరం అర్థం చేసుకోలేదనుకుంటాను. హైదరాబాద్ నగరం ఎన్నడూ సంకుచితమైన అడ్డుగోడలు కట్టుకోలేదు. ఉత్తర భారత దేశానికి, దక్షిణ భారతదేశానికి, ఉర్దూకి, తెలుగుకి, బిర్యానీకి, సాంకేతిక పరిజ్ఞానానికి ఆలవాలమైన హైదరాబాద్ నగరం మరోవైపు పాతకాలపు రాజసానికి, ఆధునిక విశ్వపు ఆశాజ్యోతులకు ప్రతినిధ్యం వహిస్తోంది. భారత కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రతిభావంతమైన పార్లమెంటరీ నాయకుడు, సమగ్ర భారతీయుల […] The post నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ- సమాఖ్య భారత భవిష్యత్తు appeared first on Navatelangana.

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో అరెస్ట్
తెలంగాణ

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మరో అరెస్ట్

నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ మరో కీలక నిందితురాలిని అరెస్ట్ చేసింది. పుణేకు చెందిన లెక్చరర్ మనీషా సంజయ్ హవల్దార్‌ను ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్ని కొందరు అభ్యర్థులకు లీక్ చేసిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పుణేలోని సేఠ్ హీరాలాల్ సరాఫ్ ప్రశాలాలో పనిచేస్తున్న హవల్దార్‌ను ప్రశ్నాపత్రం లీక్‌కు ప్రధాన ‘సోర్స్’గా సీబీఐ గుర్తించింది. సీబీఐ ప్రకటన ప్రకారం, హవల్దార్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ ప్రక్రియలో నిపుణురాలిగా నియమించింది. దీంతో ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి ప్రాప్యత లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె కొంతమంది ప్రశ్నలను సహనిందితురాలు మనీషా మంధారేకు పంపినట్లు సీబీఐ ఆరోపించింది. మంధారే పుణేకు చెందిన బోటనీ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమెను ఇప్పటికే మే 16న అరెస్ట్ చేశారు. హవల్దార్ లీక్ చేసిన ప్రశ్నలు నీట్ యూజీ-2026 ఫిజిక్స్ ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం

బొద్దింకల గర్జన -‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ!
సైన్స్ ఫిక్షన్ డ్రామాతో ‘తక్షక`
నిజం, అధికారం మధ్య సంఘర్షణ
స్పెషల్ మాస్ సాంగ్ ‘హల్లల్ల ల్లో’
తెలంగాణ

స్పెషల్ మాస్ సాంగ్ ‘హల్లల్ల ల్లో’

రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శుక్రవారం చిత్ర బృందం మూడవ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ ప్రోమోను విడుదల చేసింది. ఈ […] The post స్పెషల్ మాస్ సాంగ్ ‘హల్లల్ల ల్లో’ appeared first on Navatelangana.

సత్యదేవ్నట విశ్వరూపం
తెలంగాణ

సత్యదేవ్నట విశ్వరూపం

ప్రతి నటుడికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ తాజాగా రాబోయే సినిమాల్లో సైతం భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ఆయా పాత్రలతో ఆయన నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరోమారు చూడబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. ‘రావు బహదూర్ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో వెర్సటైల్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. ఈ చిత్రాన్ని మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. వెంకటేష్ […] The post సత్యదేవ్నట విశ్వరూపం appeared first on Navatelangana.

మరోమారు మంచి మనసు చాటుకున్న చదలవాడ
దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిన నిమ్స్
తెలంగాణ

దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసిన నిమ్స్

హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి చికిత్సలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో దక్షిణ భారత దేశంలో నిమ్స్ నంబర్‌వన్‌గా నిలిచింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తి చేసింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో గుజరాత్‌లోని ఐకేడీఆర్సీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో లూథియానా క్రిస్టియన్ కాలేజీలో ఉంది. నిమ్స్ ఆసుపత్రి మూడో స్థానంలో నిలిచింది. 2,000 మందిలో 1,900 మంది (95 శాతం మంది) రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. 2023 జనవరి నుంచి గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో 500 కిడ్నీ మార్పిడిలు చేసి నిమ్స్ ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. నిమ్స్ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుతమైన పనితీరుతోనే రికార్డును సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందలు నిమ్స్

అమ్మాయి ఆలోచించగలదు…
ఊచకోత కోసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు..
తెలంగాణ

ఊచకోత కోసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు..

ఐపిఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న కీలకమైన 67వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ( 56: 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు) హాఫ్ సెంచరీతో జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.హెన్రిచ్ క్లాసెన్ తనదైన శైలిలో రెచ్చిపోయి 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. చివర్లో 29 పరుగులతో నితీశ్ కుమార్ రెడ్డి నాటౌట్ గా నిలిచాడు.

వేసవిలో పాలు పాడవకుండా..
IPL 2026: ఉప్పల్‎లో కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీష్‌రావు
తెలంగాణ

బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీష్‌రావు

బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్‌రావు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పర్యావరణశాఖ ఫార్మాసిటీకే అనుమతిచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని గుర్తు చేశారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. 75 శాతం ఫార్మాసిటీ.. 25 శాతం మిగతావి ఉండాలని చూశామని, ఈ ప్రభుత్వం 75 శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా ఉండేలా చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని రీస్టోర్ చేస్తామని ప్రకటించారు. ఇది తన మాట కాదు అని, పార్లమెంట్ చట్టం అని పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రారంభించామని తెలిపారు. మన దగ్గర నుంచి ఒక్క

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
తెలంగాణ

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం ఉదయం మానేరు నదిలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందారు. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్ (18), చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17) మానేరు నదిలో ఈతకోసం వెళ్లి ప్రమాద వశాత్తు నీటమునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుల కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

తల్లిదండ్రులిద్దరూ ఐఎఎస్‌లు.. పిల్లలకు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగమా?: సుప్రీంకోర్టు
తెలంగాణ

తల్లిదండ్రులిద్దరూ ఐఎఎస్‌లు.. పిల్లలకు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగమా?: సుప్రీంకోర్టు

తల్లిదండ్రులిద్దరూ ఐఎఎస్‌లు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషసన్లు కల్పించడం అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు రిజర్వేషన్ల కల్పన మంచి పద్ధతి కాదని అభ్యంతరం తెలిపింది. ఎదిగిన స్థాయిల్లోని వారు బిసి వర్గాల ప్రయోజనాలను కూడా పొందుతామంటే కుదరదని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారు క్రిమిలియేర్ పరిధిలోకి రావడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఉన్నత స్థాయికి చేరుకున్న వారి కుటుంబాలు రిజర్వేషన్లు పొందకూడదనే నిబందనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే వీటిని సవాలు చేయడం భావ్యమా? అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. రిజర్వేషన్ల కల్పనకు వర్తించేది కేవలం వారి ఆర్థిక వెనుకుబాటుతనమే , అయితే సామాజికంగా ముందుకు వెళ్లలేదనే వాదన ఇందులో జొప్పించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు సహజంగానే వారి పిల్లల స్థాయి కూడా పెరుగుతుంది. రిజర్వేషన్లను టోకుగా అమలు చేయడం కాకుండా నిర్థిష్టంగా పరిశీలించి అమలు చేయాల్సి ఉ

మద్నూర్ మండల సమాఖ్య ప్రతినిధులకు శిక్షణ
బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు…కాంగ్రెస్ నేతల ధ్వజం
తెలంగాణ

బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు…కాంగ్రెస్ నేతల ధ్వజం

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ నేత పబ్బు రాజు గౌడ్‌లపై సోషల్ మీడియాలో నిరాధార,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే […] The post బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు…కాంగ్రెస్ నేతల ధ్వజం appeared first on Navatelangana.

RGV: ఆ స్టార్ అంటే నాకు అసహ్యం.. నన్ను వెన్నుపోటు పొడిచారు: రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్!
రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం
తెలంగాణ

రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం

నవతెలంగాణ-ఆర్మూర్: ఇటీవల రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు జిల్లా గౌడ సంఘం,జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు దేగం యాదగౌడ్,ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు రామ గౌడ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు లింగా గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మండలాల వారిగా గౌడన్నలను ఏకం చేస్తూ, బలోపేతం దిశగా […] The post రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం appeared first on Navatelangana.

ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం
తెలంగాణ

ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక @99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించగా, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు […] The post ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.

పల్సి లో మొక్కజొన్న పంట దగ్ధం