TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9808 వార్తలు

రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం
తెలంగాణ

రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం

నవతెలంగాణ-ఆర్మూర్: ఇటీవల రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు జిల్లా గౌడ సంఘం,జిల్లా గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులుగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు దేగం యాదగౌడ్,ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు రామ గౌడ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు లింగా గౌడ్ హాజరైనారు. ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మండలాల వారిగా గౌడన్నలను ఏకం చేస్తూ, బలోపేతం దిశగా […] The post రాష్ట్ర గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షుడికి ఘ‌న‌ సన్మానం appeared first on Navatelangana.

Adminమే 22, 2026 - శుక్రవారం👁 0
ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం
తెలంగాణ

ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక @99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయి సమావేశం నిర్వహించగా, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు […] The post ప్రజా సంక్షేమ పథకాలను మరింత వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.

పల్సి లో మొక్కజొన్న పంట దగ్ధం
ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడుగా మనసాని సాయి శంకర్
తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడుగా మనసాని సాయి శంకర్

నవతెలంగాణ – తిమ్మాజీపేటఆర్యవైశ్య సంఘం తిమ్మాజిపేట మండల అధ్యక్షుడుగా మనసాని సాయి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీని తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దాచేపల్లి నిశ్వంత్ కుమార్ ఉపాధ్యక్షులుగా దాచేపల్లి రామ్మోహన్, కొండూరు పాండు రంగయ్య, కోశాధికారిగా పాపిశెట్టి చంద్రమౌళి ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు మనసాని సాయి శంకర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. […] The post ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడుగా మనసాని సాయి శంకర్ appeared first on Navatelangana.

అత్యంత వేడి న‌గ‌రాలు భార‌త్‌లోనే
తెలంగాణ

అత్యంత వేడి న‌గ‌రాలు భార‌త్‌లోనే

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల జాబితాలో 50 నగరాలు భారత్ లోనే ఉన్నట్లు నివేదిక తెలిపింది. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఈ 50 నగరాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైనట్లు వాయు నాణ్యత, వాతావరణ సూచిక (ఎక్యూఐ) తెలిపింది. దేశంలోని ఉత్తర, మధ్య మరియు తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు విజృంభించడంతో.. మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోయినట్లు నివేదిక తెలిపింది. ఒడిశాలోని బలాంగిర్ 45డిగ్రీల ఉష్ణోగ్రతతో అత్యంత వేడి ప్రాంతంగా […] The post అత్యంత వేడి న‌గ‌రాలు భార‌త్‌లోనే appeared first on Navatelangana.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
వడదెబ్బతో హమాలి మృతి.. ఆర్థిక సాయం అందజేత
తెలంగాణ

వడదెబ్బతో హమాలి మృతి.. ఆర్థిక సాయం అందజేత

నవతెలంగాణ-తుంగతుర్తివడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పనిచేస్తున్న చర్లపల్లి సోమయ్య(69) వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం,తుంగతుర్తి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు,తహసిల్దార్ దయానందం,స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ లు మృతుడి పార్థివదేహానికి నివాళులు అర్పించి,దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేల సొసైటీ తరఫున […] The post వడదెబ్బతో హమాలి మృతి.. ఆర్థిక సాయం అందజేత appeared first on Navatelangana.

జనగామ జిల్లాలో విషాదం.. ఆలయ కోనేరులో అర్చక తండ్రీకొడుకుల మృతదేహాలు!
ప్రతిఏటా ఓకే విధమైన పనులు
తెలంగాణ

ప్రతిఏటా ఓకే విధమైన పనులు

ఈజీఎస్ పనుల ఎంపికలో అధికారుల నిర్లక్ష్యంనీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యంనవతెలంగాణ – మల్హర్ రావుఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో ప్రతిఏటా ఒకే విధమైన పనులు చేపడుతున్నారు తప్పా.. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదు.ఉపాధిహామీ చేపట్టే పనులపై అధికారుల కనీసం అవగాహన కల్పించడం లేదు.దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రెండు,మూడు రకాల పనులు చేపడుతూ.. కాలం వెళ్లదీస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని మండల రైతులు వాపోతున్నారు. 266 పనులు చేసే అవకాశం..జాతీయ ఉపాధిహామీ పథకంలో నిర్దేశించిన […] The post ప్రతిఏటా ఓకే విధమైన పనులు appeared first on Navatelangana.

కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం
తెలంగాణ

కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం

కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ ఆరోపణనవతెలంగాణ – మల్హర్ రావుమండలం కొండంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ సతికి బదులుగా పతి పెత్తనం చేస్తూ దళితులను భయాందోళనకు గురి చేస్తున్నట్లుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పారదర్శకంగా జరగలేదన్నారు. ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసిన జాబితాను సర్పంచ్ భర్త అర్హులైనవారిని తొలగించి ఆయనకు అనుకూలంగా ఉన్నవారి […] The post కొండంపేటలో సతికి బదులు పతి పెత్తనం appeared first on Navatelangana.

‘వాయు అస్త్ర-1’ ప్రయోగం విజయవంతం
తెలంగాణ

‘వాయు అస్త్ర-1’ ప్రయోగం విజయవంతం

స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. తాజాగా సాంకేతిక రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. పుణేకు చెందిన నిబే సంస్థ అభివృద్ధి చేసిన ‘వాయు అస్త్ర-1’ లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా సాంకేతిక పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షలను భారత సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో నిర్వహించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ తయారీ, ఖచ్చితమైన దాడి సామర్థ్యాల అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.భారత సైన్యం 100 కిలోమీటర్ల పరిధిలో గల లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థ కోసం జారీ చేసిన ఆర్‌ఎఫ్‌పీకి స్పందనగా ఈ ప్రదర్శన నిర్వహించారు. పరీక్షల సమయంలో ‘వాయు అస్త్ర-1’ 10 కిలోల వార్‌హెడ్‌తో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఒక్క ప్రయత్నంలోనే విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ వ్యవస్థ ఒక మీటర్ కంటే తక్కువ సీఈపీ (సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్) ఖచ్చితత్వాన్ని సాధించిందని సంస్థ వెల్లడించింది. దీంతో అత్యంత ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉన్నట్లు నిరూపితమైంది. అలాగే

సీఎం విజయ్‌ చేతికి కోహ్లీ సైన్ చేసిన స్పెషల్ బ్యాట్... నెట్టింట పిక్స్ వైరల్ !
హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం
తెలంగాణ

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యం

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం లభ్యమైంది.ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి స్వాధీనం చేసుకున్నారు..యువతి వయస్సు 20 నుండి 25 మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు.యువతి వివరాలు తెలియలేదని, నగరం పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా మృతురాలి వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని లేక్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు.వివరాల కోసం 8712661598 ని సంప్రదించగలరని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రులను వేధించిన వ్యక్తికి జైలు శిక్ష
తెలంగాణ

తల్లిదండ్రులను వేధించిన వ్యక్తికి జైలు శిక్ష

వృద్ధులైన తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిన వ్యక్తికి 60 రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జి. శ్రీనివాస్ అనే వ్యక్తి తన వృద్ధ తల్లిదండ్రులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 70B సిపి యాక్ట్ (సిపి యాక్ట్), 115(2) బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని కోర్టులో సమర్పించడంతో వాటిని పరిశీలించిన నాంపల్లిలోని గౌరవ ఐదవ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడికి రెండు నెలల జైలు శిక్ష(60 రోజులు), రూ.50 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై జె. శ్రీకాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. తల్లిదండ్రులను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, సీనియర్ సిటిజన్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఫోటో ఫీచర్: ఉప్పల్ స్టేడియంలో ఫ్యాన్స్ సందడి
ఎసిబి వలలో   విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్
తెలంగాణ

ఎసిబి వలలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్

మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) ముద్దం రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన దాదాపు రూ.3.13 లక్షల విలువైన 11 వర్క్ బిల్లులను క్లియర్ చేసి, మెదక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజినీర్ (DE) కార్యాలయానికి ఫార్వార్డ్ చేయడం కోసం ఏడీఈ రమణారెడ్డి సదరు బాధితుడి నుండి రూ.25,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్‌తో నర్సాపూర్ విద్యుత్ కార్యాలయంలో నిఘా పెట్టారు.కార్యాలయంలో బాధితుడి నుండి ఏడీఈ రమణారెడ్డి రూ.25,000 నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

యాంకర్ విష్ణుప్రియపై సోషల్ మీడియాలో వేధింపులు.
తెలంగాణ

యాంకర్ విష్ణుప్రియపై సోషల్ మీడియాలో వేధింపులు.

సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వివరాలను విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

IPL 2026: ఉప్పల్‎లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్.. ఆర్సీబీలో కీలక మార్పు
ట్విషా శర్మ డెత్ మిస్టరీ కేసులో కీలక మలుపు
తెలంగాణ

ట్విషా శర్మ డెత్ మిస్టరీ కేసులో కీలక మలుపు

ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం ట్విషా కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. భోపాల్‌లోని తన అత్తింట్లో ట్విషా మృతి చెందిన ఘటనను కుటుంబ సభ్యులు మొదటి నుంచే అనుమానాస్పదంగా పేర్కొంటున్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తు అవసరమని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే దిగువ కోర్టు రెండో పోస్టుమార్టం అభ్యర్థనను తిరస్కరించడంతో ట్విషా కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు రెండో పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.ఈ పోస్టుమార్టాన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల బృందం నిర్వహించనుంది. అయితే పరీక్ష భోపాల్‌లోనే జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఎయిమ్స్ ఢిల్లీ వైద్యులను ప్రత్యేక విమానంలో భోపాల్‌కు తీసుకురానున్నారు. ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది.ఇదే సమయంలో ట్విషా భర్త సమర్థ్ సింగ్ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న

కొండగట్టు అంజన్న హుండీ లెక్కింపు.. పెద్ద జయంతికి ఎంత ఆదాయం వచ్చిందంటే..
విద్యా కమిషన్‌ చైర్మన్‌ పదవికి ఆకునూరి మురళి రాజీనామా
IPL 2026: ధోనీ పేరుతో మోసం చేశారు.. చెన్నై మేనేజ్మెంట్‎పై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఫైర్
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలోని 12 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు ప్రస్తుతం ఉన్న బలం కంటే ఒక సీటు తగ్గే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి మూడు సీట్లు పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైర్ అవుతున్న సభ్యుల్లో మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్, జార్జ్ కురియన్ కూడా ఉన్నారు. జూన్ 21 నుంచి జూలై 19 మధ్య పదవీకాలం ముగియనున్న సభ్యుల స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లనున్న 26 స్థానాల్లో ఎన్‌డీఏకు 18 సీట్లు, కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఉన్నాయి. ఒక స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా వద్ద ఉండగా, మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ ఖాతాలో ఉన్నాయి. అయితే తాజా రాజకీయ గణాంకాల ప్రకారం ఎన్‌డీఏకు 17 సీట్లు మాత్రమే దక్కే అవకాశముండగా, కాంగ్రెస్‌కు ఐదు సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జేఎంఎంకు రెండు స్థానాలు, టీవీకేకు ఒక స్థానం దక్కే అవకాశముందని సమాచారం. ప్రస

ఐపిఎల్‌లో హైదరాబాద్‌లో చివరి మ్యాచ్.. ఇష్టారీతిన బ్లాక్ దందా
తెలంగాణ

ఐపిఎల్‌లో హైదరాబాద్‌లో చివరి మ్యాచ్.. ఇష్టారీతిన బ్లాక్ దందా

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ దాదాపు ముగింపుకు వచ్చింది. ఆదివారంతో లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఇక శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇలా అదునుగా చేసుకొని కొందరు ఇష్టారీతిన బ్లాక్ దందా నడుపుతున్నారు. సాధారణ ధరల కంటే ఎన్నో రేట్లు ఎక్కువ ధరకి ఐపిఎల్ టికెట్లను విక్రయిస్తున్నారు. రూ.1,500 టికెట్‌ను రూ.8వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టేడియంలో విఐపి బాక్సు టికెట్లు రూ.లక్షలు చెప్తున్నట్లు సమాచారం. స్టేడియం పరిసరాల్లో తిరుగుతూ యువకులు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. దీంతో సిపి సుమతి ఆదేశాలతో పోలీసులు బ్లాక్ టికెట్ల విక్రయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురి నుంచి 5 డిజిటల్ టికెట్లను ఎస్‌వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నలుగురు యువకులను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఇక రాత్రి 7.30 గంటలకు ఆర్‌సిబి, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.