
మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) ముద్దం రమణారెడ్డి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన దాదాపు రూ.3.13 లక్షల విలువైన 11 వర్క్ బిల్లులను క్లియర్ చేసి, మెదక్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజినీర్ (DE) కార్యాలయానికి ఫార్వార్డ్ చేయడం కోసం ఏడీఈ రమణారెడ్డి సదరు బాధితుడి నుండి రూ.25,000 లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఎసిబి డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్లాన్‌తో నర్సాపూర్ విద్యుత్ కార్యాలయంలో నిఘా పెట్టారు.కార్యాలయంలో బాధితుడి నుండి ఏడీఈ రమణారెడ్డి రూ.25,000 నగదును లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.












