9754 వార్తలు

రాలేరా అంటే రాలేరురావడానికి మొదటి గడప ఆనకట్ట దాటాలిదాటడానికి ఇంటి పెద్ద మాటలేకున్నాఒంటికన్ను అనుమతైనా కావాలిఎప్పుడూ కనబడని సిసి కెమెరాలాంటిఆడపులి ఆజ్ఞను చివరిదాకాకొంగు పరిచి ఎదురు చూడాలినమ్మకంతో నడచి వచ్చినదైనాపొమ్మని ఎపుడైనా అంటే గింటేచీకటికి ముందేవాడిపోకుండా రమ్మని చూపులతో చెప్తాడనిమేకప్పులు పై కప్పులుకట్లు బొట్లు సిద్దమైపో…. అనే ఏకాక్షరం కోసంవలను ఆశతో చూసే వేటగానిలా చూస్తేవద్దు అనే గేటు దూలం పడితల రెండు ముక్కలైనట్లుఇప్పుడే వస్తా మా ఫ్రెండ్ ఇంటికిపిలువంగనే వస్తా పక్కింటికిమీటింగుకు మార్కెటకు ఎక్కడికెళ్లినాఎన్ని ఎదురు […] The post రాలేరా appeared first on Navatelangana.

నెలకు రూ.26 వేలుగా సవరించాలి: కార్మిక సంఘాల డిమాండ్నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించిన కనీస వేతనాల్లో ఎలాంటి శాస్త్రీయత లేదని సీఐటియూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ కార్మక యూనియన్ల సమావేశం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వేతనాలు తగ్గాయని గుర్తు చేశారు. కార్మికుల వేతనాలను మూడు జోన్ల […] The post సీఎం ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్ర్తీయత లేదు appeared first on Navatelangana.

కొత్త చెప్పుల్లాకొత్త చుట్టాలతో…పెద్ద పెద్ద అంగలతోపొడవైన మాటలతోవాళ్ల ఇళ్ల చుట్టూరోజూ హుషారే.కాళ్ళసలు కాలవనిమెత్తగా, ఎత్తుగా ఉంటాననేవడివడి నడకను చూసినులక మంచంలోతాత బోసినవ్వు హెచ్చరిక”కొత్త చెప్పులు కరుస్తాయి జాగ్రత్తగా”ఎందుకైనా మంచిదిపాత చెప్పుల జతనుదాచి ఉంచుకొమ్మని……శ్రీ సాహితి, 9704437247 The post ఎందుకైనా మంచిది appeared first on Navatelangana.

ఓపీకి దూరంగా సీనియర్ ప్రొఫెసర్లు..ప్రయివేటు ప్రాక్టీస్ కే అధిక ప్రాధాన్యత!భారమంతా అసిస్టెంట్, పీజీల పైనేసరైన వైద్యం అందక రోగుల అవస్థలువైద్యం వికటించి వైద్య విద్యార్థి మృతి‘గాంధీ’లో గాడి తప్పుతున్న వైద్యం, వైద్యవిద్య నవతెలంగాణ-సిటీబ్యూరో‘గాంధీ’లో వైద్యం గాడి తప్పుతోంది. పేషెంట్ విభాగాల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. వారంతా ప్రయివేటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో రోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మేజర్ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఓపీ భారమంతా […] The post గాంధీలో కనిపించని హెచ్ఓడీలు appeared first on Navatelangana.

8 రోజుల్లో మూడోసారితాజాగా 90పైసలు పెంపు న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరిగాయి. ఎనిమిది రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి పెరగడం. దేశవ్యాప్తంగా, అన్ని వేరియంట్లలోనూ తాజాగా లీటరుకు సగటున 90పైసలు పెరిగింది. అంతేగాకుండా, ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంప్రెస్డ్ నేచరుల్ గ్యాస్ (సీఎన్జీ) ధర ఇదే కాల వ్యవధిలో మూడోసారి కిలోకు రూపాయి చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి లీటరు […] The post మళ్లీ పెట్రో మంట appeared first on Navatelangana.

తండ్రీ కొడుకుల అనుబంధం ఈనాటిది కాదు. తండ్రుల వల్ల కొడుకులకు తలనొప్పులూ, తలవంపులూ రావడం అరుదేమో కాని కొడుకుల వల్ల తండ్రులకు అవి మాత్రం అరుదుకాదు, సామాన్యం, సాధారణం కూడా. దీన్నే సన్‌స్ట్రోక్ అనాలి.తండ్రి మామూలు తండ్రి కాదు. మూడు లోకాల్నీ ఏలగలిగిన శక్తి వున్నవాడు. అందువల్లే తన ఏలుబడి కింద వున్న వాళ్లందరూ తననే దేవుడు అనాలని శాసించాడు. ఆయన మాటకు తిరుగులేదని జనం ఫాలో అయ్యేవారు. కానీ కొడుకు తండ్రికి తలనొప్పి అయ్యాడు. తండ్రిని […] The post సన్ స్ట్రోక్ appeared first on Navatelangana.

పొంచి ఉన్న సవాళ్లు : ఆర్బీఐ హెచ్చరికపశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా భారత వృద్ధిపైనా ప్రభావం చూపనుందని ఆర్బీఐ పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా తలెత్తుతున్న సరఫరా వైపు ఒత్తిళ్లు దేశ జిడిపిని ఒడిదుడుకులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆర్బీఐ తన తాజా స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదికలో హెచ్చరించింది. హార్మూజ్ జలసంధి మార్గాలలో తలెత్తుతున్న అడ్డంకులు, […] The post భారత వృద్ధిపై నీలినీడలు! appeared first on Navatelangana.

ఆమెకు నాట్యం అంటే కేవలం నత్యం కాదు. అది ఆమె శరీరం మాట్లాడే భాష. నేను ఎప్పుడూ గమనించేవాడిని.. ఆమె సాధారణంగా నడుస్తున్నప్పుడు కూడా అందులో ఒక లయ ఉండేది. మాట్లాడేటప్పుడు కళ్లలో భావాలు ముందుగా కదిలేవి. కొందరు మనుషులు జీవితాన్ని ఆలోచిస్తారు. ఆమె మాత్రం అనుభవించేది. నేను ఉద్యమాల మనిషిని. ఆమె రంగస్థలం మనిషి. నేను సభల్లో కోపాన్ని మాట్లాడతాను. ఆమె వెలుగుల మధ్య నిలబడి మౌనాన్ని నర్తిస్తుంది. బహుశా అందుకేనేమో.. ఆమె ప్రపంచంలోకి అడుగుపెట్టిన […] The post ఆమె నన్ను ప్రేక్షకుల్లో వెతికిన సాయంత్రం appeared first on Navatelangana.

హైదరాబాద్ రూపురేఖలు మార్చే మెగా ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారంపర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలుఅమలులో కీలక సవాళ్లు నవతెలంగాణ- సిటీ బ్యూరోహైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపునిచ్చిన మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తొలి దశలో రూ.7500 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ స్థాయి పర్యాటక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మూసీ […] The post మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు appeared first on Navatelangana.

ఇల్లు కట్టి చూడు…పెండ్లి చేసి చూడు..అని గతంలో అనేవారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు.. లేదా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకోవచ్చు. కానీ నేడు అమ్మాయిల పెండ్లి చేయాలంటే.. లక్షలు కాదు కోట్లు కావాల్సిందే. దశాబ్దకాలం కిందట వరకూ అమ్మాయి గుణ గణాలు చూసి నచ్చితే ఎంతోకొంత ఇచ్చి పెండ్లిండ్లు చేసేవారు. ఇప్పుడు సమాజంలోని జన స్వభావం మారింది. మాకు ఇంత కట్నం కావాల్సిందేనని కొందరు అంటుంటే.. మరి కొందరు మా అబ్బాయి ఐఐటీ, ఐఏఎస్, ఎంబీఏ, […] The post అమ్మకానికి వరుడు appeared first on Navatelangana.

బరిలో నొవాక్ జకోవిచ్ సైతంనేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఈ ఏడాది ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ సమరానికి రంగం సిద్ధమైంది. ఆస్ర్టేలియన్ ఓపెన్, వింబుల్డన్‌లో మెరిసిన కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) గాయంతో పారిస్‌కు ఫైట్‌కు దూరం అయ్యాడు. ఏటీపీ మాస్టర్స్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న జానిక్ సినర్ (ఇటలీ) పురుషుల సింగిల్స్‌పై కన్నేయగా.. రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సైతం నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కొకొ గాఫ్ (అమెరికా), […] The post సినర్‌కు ఎదురుందా? appeared first on Navatelangana.

అవి ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టిస్తాయిప్రభుత్వానికి రబ్బరు స్టాంప్‌లుగా అనుమతి సంస్థలు : మాజీ సివిల్ సర్వెంట్లుభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు 71 మంది లేఖనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇటీవల పర్యావరణ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయ వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని మాజీ సివిల్ సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 71 మంది మాజీ సివిల్ సర్వెంట్లు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. పర్యావరణానికి […] The post సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం appeared first on Navatelangana.

నిఖిల్ సిద్ధార్థ త్వరలో ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. భారతీయ సినిమా రంగంలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ ఎపిక్ వెనుక ఉన్న వర్క్ ని చిత్ర బృందం ఇప్పుడు సినీ ప్రేమికులకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. తాజాగా విడుదలైన వీడియోలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ పనుల విస్తృత స్థాయిని […] The post ‘స్వయంభు`27వేలకి పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ appeared first on Navatelangana.


నవతెలంగాణ-ఆలేరు టౌనరాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా, శుక్రవారం రాత్రి అఖిలపక్ష కమిటీ సభ్యులను ముందస్తుగా ఆలేరు పోలీసులు అఖిల పక్ష కమిటీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, శనివారం ఉదయం 10 గంటలకు వదిలివేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, మంత్రుల పర్యటన సందర్భంగా ఈ ముందస్తు అరెస్టులు దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిర్ల ఐలయ్య,ఎ […] The post సీఎం రాకతో ముందస్తు అరెస్టులు appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆలేరు టౌనుఆలేరు పట్టణ శివారులో పార్థసారథి వ్యవసాయ క్షత్రంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పశువుల కోట్టము, 200 నాటు కోళ్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో పాటు వ్యవసాయ సామగ్రి, పశుగ్రాసం, అగ్నికి ఆహుతయ్యాయి. అంతే కాదు కరెంటు మోటార్లు దగ్ధమయ్యాయి. మామిడి తోటకు చెందిన చెట్లు, పంటలు కాలిపోయాయి. అదేవిధంగా ప్రమాదంలో డ్రిప్ పైప్‌లైన్ పూర్తిగా దగ్ధమైంది. కరెంటు వైర్లు, పశుగ్రాసంగా నిల్వ ఉంచిన పచ్చి సోప్ప కూడా మంటల్లో కాలిపోయింది. అయితే […] The post వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో .. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదే విధంగా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. భారత […] The post ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం appeared first on Navatelangana.

Telangana: ఆయన నుంచి సేకరించిన కీలక అవయవాలను ఐదుగురు ప్రాణాపాయంలో ఉన్న రోగులకు అమర్చి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు వైద్యులు. మరణంలోనూ మహాదాతగా నిలిచిన సత్యనారాయణకు ఆసుపత్రి వైద్య సిబ్బంది, హార్ట్ టచింగ్ విజువల్స్‌తో ఘనంగా వీడ్కోలు పలికారు. సత్యనారాయణ..

నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్‌ను భయభ్రాంతులకు గురిచేస్తూ, బెదిరించడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి, తమ విధానాలను మార్చుకోవాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేసింది. “నువ్వు బీజేపీలో చేరు, డబ్బులు వస్తాయి, లేకపోతే నిన్ను అమెరికాలోనే ఖతం చేస్తాం. భారతదేశంలో ఉన్న నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని కూడా వదలకుండా […] The post కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభిజిత్‌కు బెదిరింపులు appeared first on Navatelangana.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతనవతెలంగాణ-మిడ్జిల్ చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రంగారెడ్డి గూడా మాజీ సర్పంచ్ శశికళ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని షారోను మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్ చదువు పూర్తి అయిన 16 మంది విద్యార్థులకు ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా […] The post చదువుతోనే సమాజంలో మార్పు appeared first on Navatelangana.

30 కేసులు… 25 ఏళ్లు… 22 సార్లు జైలుకు…దొంగతనాల్లో ఆరితేరిన యువకుడిపై రౌడీషీట్..పొద్దంతా జల్సాలు..రాత్రి దొంగతనాలు..సెల్‌ఫోన్ వాడకుండా దొంగతనాలు..నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లఅతను బక్క పల్చని యువకుడు… చూస్తే అయ్యో పాపం అంటారు..కానీ అతను చేసేవి మాత్రం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. 25 ఏళ్ల యువకుడు ఇప్పటికి 22 సార్లు జైలుకు వెళ్లాడు. అతనిపై 30 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు రవి (25) అనే వ్యక్తి తాలం వేసినా ఇండ్లు […] The post 22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ appeared first on Navatelangana.

నవతెలంగాణ-కట్టంగూర్బాలల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు శనివారం అంబటివాగులో బాలల చట్టాలపై, ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ.. బాల్యవివాహాలతో బాలికలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దత్తత, మిషన్ వాత్సల్య పథకం, బాల్యవివాహాల ప్రభావం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ఎకుల సుజాత సైదులు, […] The post బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-అచ్చంపేటమండలంలోని బుడ్డ తాండలో శనివారం సాయంత్రం పిడుగు పడి రెండు కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షం సమయంలో వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో మోత్య అనే రైతు కు చెందిన కడెద్దులు అక్కడికక్కడే మృత్యువాత చెందాయి. వ్యవసాయం కోసం ఇటీవలే రూ.1.10 లక్షల వ్యయంతో రెండు పశువులను కొనుగోలు చేసినట్లు రైతు తెలిపాడు. అప్పు చేసి పశువులను కొనుగోలు చేశానని, అనుకోకుండా పిడుగు పడి అవి మృతి చెందడంతో […] The post పిడుగుపాటుకు కాడెద్దులు మృత్యువాత appeared first on Navatelangana.