
1671 వార్తలు

8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కనీస వేతనాన్ని రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలని NC-JCM కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833కు పెంచాలని డిమాండ్ చేసింది. దీనివల్ల 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. వార్షిక ఇంక్రిమెంట్, గ్రాట్యుటీ డిమాండ్లు కూడా ఉన్నాయి.

Nandyal murder case: పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరోసారి దర్యాప్తు చేపట్టారు. పోలీసు దర్యాప్తులో కూడా హత్య అని తేలింది. భర్త వెంకటాచంద్రుడు కొడుకు వెంకటరమణ కూడా హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచారు.

మండిపోతున్న ఎండల వల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసించడం సహజం. ఈ సమయంలో శరీరానికి కేవలం నీరు మాత్రమే కాదు.. సరైన పోషణ కూడా అవసరం. వేసవిలో మనకు సులభంగా, తక్కువ ధరలో లభించే బొప్పాయి పండు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో ఉండే నీటి శాతం, విటమిన్లు, ఖనిజాలు వేసవి తాపం నుండి మనల్ని రక్షించడమే కాకుండా శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తాయి.

అడ్వకేట్ సుబ్బారావు పేరు ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ గాయని మంగ్లీపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలై… పరస్పర ఆరోపణలు, పోలీసు దర్యాప్తుతో మరింత మలుపులు తిరుగుతోంది. నిజం ఏంటి అన్నది తేలాల్సి ఉన్నా, ఈ కేసు మాత్రం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది.

ఎండా కాలంలో ఎక్కువగా దొరికే ఈ అడవి పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఇక ధరలో అయితే మటన్ తో పోటీ పడుతున్నాయి. వీటిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

ఢిల్లీకి చెందిన ఆరవ్ వత్స్ CBSE పదో తరగతిలో 96.6% మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లింఫోబ్లాస్టిక్ లింఫోమా అనే తీవ్ర క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడుతూనే, చదువును విస్మరించలేదు. ఆన్లైన్ తరగతులు, క్రమశిక్షణతో కూడిన అధ్యయనం, సంగీతం అతని విజయానికి దోహదపడ్డాయి. ఆరవ్ సంకల్పం, ధైర్యం ఎందరికో స్ఫూర్తిదాయకం.

IPL 2026 Flop Players: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్నప్పటికీ, కొందరు స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం ఫ్రాంచైజీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా భారీ ధర పలికిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు దారుణంగా విఫలమవ్వడంతో వారిపై కోట్లు కుమ్మరించిన జట్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. దాదాపు 60 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన జట్లకు ఆశించిన ఫలితం దక్కకపోవడం గమనార్హం.

పల్లెటూర్లలో తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించాలనుకునే యువతకు దేశీ కోళ్ల పెంపకం గొప్ప అవకాశం. తక్కువ పెట్టుబితో ఈ వ్యాపారం ప్రారంభించి, అధిక ఆదాయం పొందవచ్చు. తక్కువ ఖర్చు, స్థానికంగా డిమాండ్ ఉన్న దేశీ కోళ్లు, గుడ్ల విక్రయం ద్వారా గ్రామీణ యువత ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.

కరువు కాటుకు గురైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. శ్రీ సత్యసాయి జిల్లా కొర్రెవు గ్రామంలో రైతు మాలింగప్ప పొలంలో బోరు వేస్తుండగా కేవలం 470 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వచ్చి 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడాయి. ఎండిన నేలల్లో ఇలాంటి జలసిరి కనిపించడం స్థానిక రైతుల్లో కొత్త ఆశలను నింపింది.

విలక్షణ నటుడు సూర్య , దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలయికలో మరో పవర్ఫుల్ సోషల్ డ్రామా సిద్ధమవుతోంది. 'జై భీమ్' వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరూ మళ్లీ చేతులు కలుపుతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. జ్ఞానవేల్ చెప్పిన సామాజిక అన్యాయాలపై గళమెత్తే బలమైన కథకు సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం 'కరుప్పు' (వీరభద్రుడు) షూటింగ్లో బిజీగా ఉన్న సూర్య, తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఈ క్రేజీ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

Planets conjunction in Pisces 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కంటే స్థిరాస్తి పెట్టుబడిపై ఆసక్తి పెరుగుతోంది. దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వం కోసం రియల్ ఎస్టేట్ సురక్షితమైనదిగా మారింది. అయితే, పండుగ ఆఫర్లకు కాకుండా, పత్రాల పరిశీలన (RERA, టైటిల్), సరైన ప్రదేశం ఎంపిక, బిల్డర్ విశ్వసనీయత వంటి అంశాలపై పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏసీ కొనే ముందు కూలింగ్ కెపాసిటీ, ISEER స్టార్ రేటింగ్ తప్పనిసరిగా తనిఖీ చేయాలి. కంప్రెషర్, PCB వారంటీ, ఆఫ్టర్‌సేల్స్ సేవలు, కన్వర్టబుల్, ఇన్వర్టర్ వంటి ఫీచర్లను పరిగణనలోకి తీసుకోవాలి. మీ అవసరాలకు తగిన ఏసీని ఎంచుకోవడానికి ఈ మార్గదర్శకాలు సహాయపడతాయి.

10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఒక చిన్న సినిమా ఇప్పుడు రూ. 200 కోట్ల రూపాయల మార్కును దాటింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనం సృష్టిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసుకుందామా.

Polam pachadi recipe in telugu: ఎండలో పొలం పనులు చేస్తూ బాగా అలిసిపోతుంటారు. అలాంటి సమయంలో ఈ పచ్చడి ఇమ్యూనిటీని పెంచుతుంది. స్టవ్ అవసరం లేదు నూనెతో పని లేదు. దీనిని చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో కొద్దిగా కలుపుకొని తింటే వావ్ టేస్ట్ అదిరిందని అనాల్సిందే.

బ్రహ్మకమలం మొక్కలో అద్భుతమైన పుష్పాలు పొందడానికి కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు ఉన్నాయి. సరైన మట్టి, పాక్షిక సూర్యరశ్మి, బలమైన ఆధారం, మరియు ఇంట్లో తయారుచేసిన లిక్విడ్ ఎరువు (ఆవు పేడ, అరటి తొక్కలు, పసుపు) వాడకం మొక్క ఎదుగుదలకు, పుష్కలమైన పూలకు కీలకం. ఈ పద్ధతులు మీ మొక్కను ఆరోగ్యంగా, బుషీగా మారుస్తాయి.

అక్షయ తృతీయకు ముందు ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. దేశీయ డిమాండ్ తగ్గడం, డాలర్ బలం పెరగడం ఈ పతనానికి ప్రధాన కారణం. గ్లోబల్ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ధరలు తగ్గడం కొనుగోలుదారుల కు ఊరటనిచ్చింది.

హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ప్రపంచ చమురు ధరలు భారీగా తగ్గాయి. ఇది భారతదేశానికి పెద్ద ఆర్థిక ఊరటనిచ్చింది, ఎందుకంటే దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి బిల్లు తగ్గడంతో కరెంట్ అకౌంట్ లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుంది.

Today Horoscope (April 18, 2026): శనివారానికి సంబంధించిన రాశిఫలాల్లో చాలా రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేషం, మిథునం, తుల, కుంభ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, సామాజిక రంగాల్లో పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల అనుకూలత, ఆదాయ వృద్ధి, శుభవార్తలు వంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి.

Gujarat Titans vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడ అందించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, రెండు వరుస ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుత సమాజంలో ఏది తిన్నా, ఏది తాగినా కల్తీ భయం వెన్నాడుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన పోషక భాండాగారం పాలు. సంపూర్ణ ఆహారంగా భావించే పాలను సైతం కొందరు స్వార్థపరులు ధనదాహంతో విషతుల్యంగా మారుస్తున్నారు. పాల దిగుబడి పెంచడానికి, ఎక్కువ సేపు నిల్వ ఉండటానికి డిటర్జెంట్ పౌడర్, యూరియా, స్టార్చ్ వంటి భయంకరమైన రసాయనాలను కలుపుతున్నారు.

అతిగా వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునే అద్భుత ఫార్ములా '30-30-30'. ఉదయం నిద్రలేచిన అరగంటలో ప్రోటీన్ తీసుకోవడం, ఆపై 30 నిమిషాల వ్యాయామంతో జీవక్రియను వేగవంతం చేసే ఈ సింపుల్ టెక్నిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సులభమైన ఫార్ములాతో బరువును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం..

Cameron Green Six Tata Sierra Car Dent: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు కమెరాన్ గ్రీన్ అద్భుతమైన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏకంగా బంతితో స్టేడియంలో ఉన్న కారు సొట్టబడేలా ఒక భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఇలా కారును తాకితే ఐపీఎల్ యాజమాన్యం తీసుకునే చర్యలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.