8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కనీస వేతనాన్ని రూ. 18,000 నుండి ఏకంగా రూ. 69,000కు పెంచాలని NC-JCM కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833కు పెంచాలని డిమాండ్ చేసింది. దీనివల్ల 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్‌లకు లబ్ధి చేకూరుతుంది. వార్షిక ఇంక్రిమెంట్, గ్రాట్యుటీ డిమాండ్లు కూడా ఉన్నాయి.