
1671 వార్తలు

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్ల రాజు మామిడి పండు. ఆ రుచికి, సువాసనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే మామిడి పండ్లను ఆస్వాదించే క్రమంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలామంది మామిడి పండు తిన్న వెంటనే దాహంగా అనిపించి నీళ్లు తాగుతుంటారు. ఇది చూడటానికి సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, శరీరంలోని జీర్ణవ్యవస్థను ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం రుచి కోసం పండును ఆస్వాదించడమే కాదు, దానిని ఎలా తినాలో కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తంగా 528 ఓట్లు పోలవగా.. అనుకూలంగా 298, ప్రతికూలంగా 230 మంది ఓటేశారు. ఈ బిల్లు నెగ్గాలంటే టు థర్డ్ మెజార్టీగా 352 ఓట్లు రావాల్సి ఉండగా.. 298 మాత్రమే రావడంతో.. బిల్లు వీగిపోయినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

Ajinkya Rahane Receives Boycott Threat From Netizens After IPL Duck: ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానేకు కష్టాలు ఎదురవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ కావడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో 'బ్యాగులు సర్దుకో' అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పరాజయాల బాటలో ఉన్న జట్టును నడిపించడంలో ఆయన విఫలమవుతున్నాడని క్రీడాభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Cylinder Gas Level Hacks: ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవచ్చు. దీంతో వంట మధ్యలో గ్యాస్ అయిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. గ్యాస్ తక్కువగా ఉందని తెలిసిన వెంటనే ముందుగానే కొత్త సిలిండర్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది..

ప్రైవేట్ పాఠశాలలలో అధిక ఫీజులు, అదనపు ఛార్జీలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. రామంతాపూర్‌లోని Hyderabad పబ్లిక్ స్కూల్, హెచ్‌పీఎస్ పాఠశాలల ముందు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. గత నాలుగేళ్లలో ఫీజులు..

Ajinkya Rahane: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే 'గోల్డెన్ డక్'గా వెనుతిరిగి తన కెరీర్లో ఎన్నడూ కోరుకోని ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మాజీ దిగ్గజం గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న అవాంఛిత రికార్డుల జాబితాలో రహానే ఇప్పుడు చేరాడు.

కూలర్ నుంచి వచ్చే చెడు వాసనను నిర్లక్ష్యం చేస్తే… అది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సింపుల్ మెయింటెనెన్స్‌తో ఫ్రెష్ గాలి ఎలా పొందాలో మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం. ఇవి ఫాలో అయితే ఫ్రెయిర్ ఎయిర్ మీ సొంతం ..

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు.

వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఇంట్లో సులభంగా చింతపండు లాలిపాప్స్ తయారు చేయండి. బయటి చాక్లెట్లు, ఫుడ్ తినకుండా, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ లాలిపాప్స్‌తో వారిని సంతోషపెట్టండి. చింతపండు, బెల్లం వంటి సహజ పదార్థాలతో చేసే ఈ తీపి, పుల్లని లాలిపాప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చుతాయి. తయారీ విధానం చాలా సులభం.

ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలోని కీలక సూత్రాలను ఈ వ్యాసం వివరిస్తుంది. డబ్బు సంపాదించడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది తెలివితేటలకంటే మన ప్రవర్తనపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందని ఇది తెలియజేస్తుంది. సాధారణ వాచ్మెన్ రోనాల్డ్ రీడ్ 8 మిలియన్ డాలర్ల సంపదను ఎలా కూడబెట్టాడో ఈ పుస్తకం వివరిస్తుంది. ఆర్థిక విజయం అనేది కేవలం సంఖ్యల గురించినది కాదని, అది ఒక సాఫ్ట్ స్కిల్ అని స్పష్టం చేస్తుంది.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై జరిగిన కీలక చర్చలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. మహిళా సాధికారత, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలను ప్రాతిపదికగా చేసుకుని ఆయన కీలక ప్రసంగం చేశారు.

Train Lower Berth: చాలా మంది రైల్వే టికెట్స్ బుక్ చేసుకునే ముందు లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. కానీ చాలా మందికి అది లభించదు. కానీ టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఈ ఒక్క చిన్న పని చేసినట్లయితే లోయర్ బెర్త్ తప్పకుండా లభిస్తుంది. ఇందులో ఏ మాత్రం డౌటే లేదు..

ఇంజినీరింగ్ పూర్తికాగానే కేవలం 19 ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడు. ఆపై కొన్ని సినిమాల్లో విలన్ గానూ మెప్పించాడు.

శ్రీహరి మరణానంతరం ఆయన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, తిరిగి రాని కోటి రూపాయలకు పైగా అప్పులు, ఆకస్మికంగా జరిగిన ఆయన వివాహం గురించి ఈ కథనం వివరిస్తుంది. డిస్కో శాంతి శ్రీహరిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వారి వైవాహిక జీవితంలోని విలువలు, త్యాగాల వెనుకటి నిజాలను వెల్లడిస్తుంది.

Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరు అత్యంత పేలవంగా తయారైంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు పరాజయాలను మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జట్టులో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

నవగ్రహల్లో శని గ్రహం చాలా శక్తివంతమైనది. శని కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని గ్రహాల మాదిరిగానే శని గ్రహం నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేస్తుంది. అయితే శని ఏప్రిల్ 17న నక్షత్ర సంచారం చేయడం వలన నాలుగు రాశులవారికి ఏప్రిల్ 18 నుంచి చాలా సమస్యలు ఎదర్కొనే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Akshaya Tritiya Offers: మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక క్షణాన్ని మరింత చిరస్మరణీయం చేయడానికి ఈ జ్యువెలర్స్ ప్రత్యేకంగా రూపొందించిన గోల్డ్, డైమండ్, సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లను ప్రదర్శిస్తోంది. మన సంప్రదాయానికి ఆధునిక సొబగులను అద్ది తీర్చిదిద్దిన ఈ ఆభరణాలు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తాయి.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అత్యంత కష్టమైన పని సీలింగ్ ఫ్యాన్లను క్లీన్ చేయడం. ముఖ్యంగా వేసవి కాలంలో ఫ్యాన్లు నిరంతరం తిరగడం వల్ల వాటి రెక్కలపై దుమ్ము త్వరగా పేరుకుపోతుంది. ఈ దుమ్మును అలాగే వదిలేస్తే, ఫ్యాన్ వేసిన ప్రతిసారీ గాలి ద్వారా ఆ ధూళి గది అంతా వ్యాపించి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఏ నిచ్చెన వాడకుండా నీట్‌గా సీలింగ్ ఫ్యాన్ ఎలా శుభ్రం చేయొచ్చో తెలుసుకుందాం.

మీరు రెండు రోజుల పాటు ఊరికి వెళ్తున్నారా? అయితే ఫ్రిజ్‌ను ఆన్‌లో ఉంచాలా వద్దా అనే గందరగోళం వద్దు. ఈ చిన్న చిట్కాతో మీ ఆహారాన్ని భద్రంగా ఉంచుకోవడమే కాకుండా విద్యుత్ బిల్లును కూడా ఆదా చేయవచ్చు. అసలు నిపుణులు ఏం చెబుతున్నారో, ప్రయాణానికి ముందు ఫ్రిజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. బావా మరదళ్ల ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

రైతులకు షాకింగ్ న్యూస్: సూపర్ ఎల్‌నినో ఈసారి రుతుపవనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. పదేళ్ల కిందటి కరువు పరిస్థితులు, అకాల వర్షాలు పునరావృతం కావచ్చు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. ఎల్ నినో అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, దాని ప్రభావం ఏమిటనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

T20 World Cup fixing investigation: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని ఫిక్సింగ్ భూతం మరోసారి వణికిస్తోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించడం క్రీడా వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

Railway Smart Tracks: భారత రైల్వే ఇక సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను ముందే నివారించవచ్చు. అంతేకాకుండా, ట్రాక్ సమస్యల వల్ల రైళ్లు ఆలస్యంగా నడిచే పరిస్థితి తగ్గి, ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది.