25124 articles







మన తెలంగాణ/మోత్కూర్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్ లు ,కాల్వలు పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ, సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31, తేదీలలో భువనగిరి నుండి ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర, 31 న ఇందిరా పార్కులో జరిగే మహాధర్నాలో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఎం మండల నాయకులు బండి రవి పిలుపు నిచ్చారు. శుక్రవారం మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో ధర్నా వాల్ పోస్టర్లను రైతుల, తో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....పాటిమట్ల, పరిసర ప్రాంతాలకు సాగునిరంధించే బృందావన్ కాల్వ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై, చెత్త చేదారంతో నిండి కూరుకపోతున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు . సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందావన్ కాల్వను పరిశీలించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అయిన ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వ వేడెల్పు చేసి సాగునీరు అందించడంలో పాలకులు విఫలమౌతున్నారని, సాగునీటి ప్రాజెక్ట్ లు, మరియు కాల్వల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరశిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 71,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

అమరావతి: తన భర్తను సాయికిరణ్ అనే వ్యక్తి మరో ముగ్గురుతో కలిసి హత్య చేశాడని, కానీ హత్య వెనుక కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుడు జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి(30) భార్య జయశ్రీ ఆరోపణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో బుధవారం తెల్లవారుజామును సతీష్ రెడ్డి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జయశ్రీ మీడియాతో మాట్లాడారు. కటౌట్ శ్రీను భార్యతో సతీష్ రెడ్డి స్నేహం ఉందని, దీంతో కటౌట్ శ్రీను, అతడి భార్య విడిపోయారని, ఆమెతో సాయి కిరణ్ అసభ్యంగా ప్రవర్తించడంతో తన భర్త అతడిని మందలించాడన్నారు. సాయి కిరణ్ తన భర్తపై పగ పెంచుకోవడంతో విడాకులకు సతీష్ రెడ్డి కారణమని తన భర్తను చంపుతానని కటౌట్ శ్రీను తన ఇంటికి వచ్చి హెచ్చరించాడన్నారు. శ్రీను ప్లాన్‌లో భాగంగా సాయి కిరణ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్తను నడి రోడ్డుపై చెక్క ముక్కలను గొంతులో కుచ్చి చంపేశారని ఆరోపణలు చేశారు. వాహనాదారులు చూస్తు ఉండిపోయారని, ఒక్కరు కూడా ఆపలేదన్నారు. పోస్టు మార్టమ్ దగ్గరికి వెళ్లినప్పుడు పోలీసులు తనని ప్రశ్నించినప్పుడు కటౌట్ శ్రీను పేరు చెప్పానని, తనని పోలీసులు చెప్పొదంటూ ఆపారని ఆరోపణలు చేసింది. ఒక ఎంఎల్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా అంతర్రాష్ట్ర జల వివాదాలపై గట్టిగా వాదించాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. సెప్టెంబర్ 01వ తేదీన తుమ్మిడిహట్టిపై ఢిల్లీలో జరగనున్న అధికారుల భేటీ, సెప్టెంబరుర్ 7వ తేదీన సీడబ్ల్యూసీ హైలెవెల్ కమిటీ సమావేశం ఎజెండాల గురించి అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్లుగా సమాచారం. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో నీటిపారుదల శాఖపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహంచారు. ఈసమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్ర, ఏపితో ఉన్న జల వివాదాలపై అధికారులు, న్యాయవాదులు తెలంగాణ వైఖరిని స్పష్టంగా వినిపించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా అధికారుల కు సూచించినట్లుగా సమాచారం. దీంతోపాటు సుప్రీంకోర్టు, కేంద్ర జలవనరుల సంఘం, కృష్ణా, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డుల్లో ఉన్న వివిధ కేసుల గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినట్టుగా తెలిసింది. ఆ కేసులు ఏ దశలో ఉన్నాయి, ఇతర రాష్ట్రాల వాదనలు ఎలా ఉన్నాయి, తెలంగాణ ప్రయోజనాలపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై సిఎం ఆరా తీసినట్లు

సోషల్ మీడియా విడిచిపెట్టరాని వ్యసనంగా మారడంపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా సంస్థలు తమ వల్ల కలిగే దుష్ఫలితాలపై జవాబుదారీ వహించడం లేదు. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో మెటా ప్లాట్‌ఫారమ్‌లపై దాఖలైన కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పిల్లలు మొదలు యువత వరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను వ్యసనపరంగా మార్చేలా మెటా కంపెనీ ఉద్దేశపూర్వకంగా వాటిని రూపొందించిందా? వీటిని అత్యధికంగా వినియోగిస్తే వినియోగదారులకు హాని తప్పదని తెలిసినా నిర్లక్షం వహించిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఈ కేసుల పరిశీలనలో ఎదురవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న నలుగురు అమెరికన్ టీనేజర్ల కుటుంబాలు మెటా, టిక్‌టాక్, స్నాప్‌చాట్, యూట్యూబ్‌పై కేసులు వేశారు. వీటి వినియోగం తమ పిల్లల చావుకు దారితీసిందని ఆరోపించారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఇప్పుడు సోషల్ మీడియావల్ల అనర్థాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి సోషల్ మీడియావల్ల ఎంతవరకు దుష్ఫలితాలు సంభవించాయో తెలుసుకోవడానికి 2026 ఏప్రిల్‌లో యాక్సిస్ ఇంటెలిజెన్స్ 32 దేశాల్లోని మ

మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డిపైక్రమశిక్షణ చర్యలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు చర్యలు ఉంటాయా? లే క ఈ వివాదానికి తెరదించారా? అనేది ఇంకా స్ప ష్టత రావడం లేదు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఎంత పెద్ద వారైనా సహించేది లేద ని పిసిసి, ఏఐసిసి నేతలు పదే పదే హెచ్చరిస్తున్నా ఈ వివాదం జరిగి పది రోజులు గడిచినా ఇంకా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందా? లేక చర్యలు ఉంటా యా? అన్నది ఎటూతేల్చకపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొన్నది. ఇలా ఉండగా మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ క ట్టారు. అయితే ఈసారి మాత్రం సీఎంకు బంగారు రాఖీ కట్టడం విశేషం. మంత్రి కొండా సురేఖతో పాటు మరో మంత్రి సీతక్క కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతు లు వారిని సాదరంగా ఆహ్వానించారు. కాగా కొం డా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, వాటిని సురేఖ ఖండించకపోవడం పట్ల అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. అయితే కొండా స

మన విదేశాంగ విధానం అద్భుతంగా సాగుతున్నదని బిజెపి ప్రభుత్వం, ఆ పార్టీ ఎంతైనా ప్రచారాలు చేసుకోవచ్చు గాక. కాని అది పాక్షిక సత్యం మాత్రమేనని వాస్తవాలను గమనించినప్పుడు స్పష్టమవుతుంది. పాక్షికం అనటం ఎందువల్ల? గత సుమారు ఆరు మాసాల కాలంలో పలు దేశాలు, ప్రాంతీయ సంస్థలు మనతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. కాని రాజకీయంగా చూసినప్పుడు విజయం అనదగ్గది ఏదీ కన్పించదు. వాస్తవానికి ఈ రెండింటిలో రాజకీయ రంగమే విదేశాంగ విధానానికి గీటురాయి అవుతుంది. ఆర్థికమన్నది పరస్పర ప్రయోజనాలకు సంబంధించింది. అందులో దౌత్యనీతి అంటూ ఏమీ ఉండదు ప్రత్యేకంగా. ముందుగా రాజకీయాలు, దౌత్యనీతిని చూసి ఆర్థికానికి తర్వాత వెళదాము. ఆ విషయంలో భారతదేశానికి పొరుగుదేశాలు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, పశ్చిమాసియా, వేర్వేరు అగ్రరాజ్యాలు, మన భాగస్వాములుగా గల వివిధ సంస్థలన్నవి ప్రధానమైన కార్యరంగాలు. వీటిలో దేనికి సంబంధించిన పరిస్థితి కూడా సంతృప్తికరంగా కనిపించదు. దాదాపు అన్నిటా వెనుకబడి ఉన్నామనే అభిప్రాయమే కలుగుతుంది. ఇపుడు ఒక్కొక్కటిగా చూద్దాము. నరేంద్ర మోడీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తమ విదేశాంగ విధానంలో మొదటి ప్రాధాన్యత పొరుగు

విద్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు.. ఒక కుటుంబం భవిష్యత్తును, సమాజం అభివృద్ధిని మార్చగల శక్తి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తే వారి జీవితాల్లో పెనుమార్పు వస్తుంది. ఈ ఆలోచనతోనే తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రయత్నాలకు సాంకేతికతను జోడిస్తూ టి-శాట్ చేస్తున్న కృషి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. విద్యార్థి విద్యా పునాదులు పాఠశాల స్థాయి నుండే బలోపేతం కావాలనే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంటే అదే బాటలో పయనిస్తూ ఇటీవల టి-శాట్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్‌తో ప్రసారాలపై ఎంఒయు కుదుర్చుకోవడం శుభపరిణామం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలో చదివే విద్యార్థితో సమానమైన నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ విద్యా వ్యవస్థ లక్ష్యం కావాలి. అయితే తరగతి గదిలో మంచి బోధనతో పాటు పో

నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాకు పరిమితమైన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎటువంటి హడావుడి లేకుండా ప్రారంభించిన నిరసనలు ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ప్రభుత్వ విద్యారంగం వైపు మళ్లిస్తున్నాయి. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై ఆందోళనలకు దారితీస్తుంది. ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం ఢిల్లీలో జన్ జెడ్ నిరసనగా ప్రారంభమైన ఈ ఆందోళనలు నేడు జన్ ఆల్ఫా ఉద్యమంగా మారుతున్నాయి. గత మూడు వారాలుగా, పాఠశాల విద్యార్థులు తమ తరగతి గదుల నుండి బయటకు వచ్చి, ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రదర్శనలు నిర్వహించి, పాఠశాల గేట్లకు తాళాలు వేసి, రోడ్లపై కూర్చొని అధికారుల నుండి సమాధానాలు కోరుతున్నారు. వారి డిమాండ్లు చాలా ప్రాథమికమైనవి. వారికి ఉపాధ్యాయులు, తరగతి గదులలో ఫ్యాన్లు, లైట్లు, డెస్కులు వంటి ప్రాథమిక సౌకర్యాలు, తినదగిన ఆహారం, శుభ్రమైన తాగునీరు, పనిచేసే మరుగుదొడ్లు కావాలి. కొన్ని సందర్భాల్లో పాఠశాలకు సరైన రహదారిని కూడా వారు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నిరసనలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజ

న్యూఢిల్లీ: భారత సైనిక పోరాట సామర్థ్యా న్ని మరింత పెంచేందుకు మరో కీలక అస్త్రం రాబోతోంది. అధునాతన జావెలిన్ యాంటీ-ట్యాంక్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చే సేందుకు అమెరికాతో భారత్‌కు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ శుక్రవారంనాడు వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత లోతుగా, సమర్ధవంతంగా, కీలకమైనదిగా మారుతోందనడానికి నిదర్శనమని అన్నా రు. అయితే భారత్ ఎన్ని జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వ్యవస్థలను కొనుగు లు చేయనుంది, కొనుగోలు మొత్తం విలువ ఎంతనే వివరాలు వెంటనే తెలియలేదు. జావెలిన్ ప్రత్యేకతలివే.. జావెలిన్ ట్యాంక్ విధ్వంసకర క్షిపణిని భుజంపై ఉంచుకుని శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ట్యాంకును ధ్వంసం చేసేలా ఇందులో రెండు దశల్లో పేలుడు పదార్ధాలు ఉంటాయి. తొలి దశలో రక్షణ కవచాలను ఛేదిస్తుంది. ఆ తర్వాత దశలో వారెహెడ్ ట్యాంక్‌ను ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణరంగ దిగ్గజాలు రేథియాన్, లాక్‌హీడ్ మార్టీన్ సంస్థలు అభివృద్ధి చ

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) తాజాగా ని ర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన ల భించింది. రాయదుర్గ్‌లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ -పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధ రకు వేలం వేయగా మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం లభించింది. ఇదే క్రమంలో గత వారం నిర్వహించిన ప్లాట్- పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో వేలం విలువలో 25శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుం ది. తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 వేలం ఫలితాన్ని కలిపి చూస్తే కే వలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ 2 వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కో ట్ల ధర లభించడం విశేషంగా ప్రభుత్వం పేర్కొం ది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. శశాంక మాట్లాడుతూ హైదరాబాద్‌లో పెట్టుబడిదారుల విశ్వాసానికి తాజా వేలం బలమైన నిదర్శనమని అన్నారు. రాయదుర్గ్ ప్రాంతం

మన తెలంగాణ/హైదరాబాద్/నాంపల్లి: హైదరాబాద్‌లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇం దిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హ తే ప్రామాణికంగా, కులమతాలు, రాజకీయాల కు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంద ని ఆయన స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని తెలిపారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సా మాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని ఆయన తెలిపారు. శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్ ని ర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగ

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బి ఆర్‌ఎస్ చేపట్టనున్న వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను వి జయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు.వెయ్యి రోజుల వైఫల్యాలపై వారం రోజుల పోరాటంఈ మేరకు శుక్రవారం పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారికి సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప

న్యూఢిల్లీ: నీట్ -యూజీ ప్రశ్నపత్రం లీక్ సహా పలు వివాదాలతో విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని కీలక నియామకాలు చేపట్టింది. శుక్రవారంనాడు ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్‌ను నియమించింది. ఐపిఎస్ అధికారి రవి కుమార్ సింగ్, ఐఎఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్ విలను ఎన్‌టిఏ డైరెక్టర్లుగా నియమించారు. 2016 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అమిత్ సమ్దారియాను జాయింట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వీరిలో ప్రసన్న వెంకటేశ్ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొత్తగా నియమితులైన ముగ్గురు అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మూడు వారాల్లోగా తమ కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా బాధ్యతలు చేపట్టకపోతే సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ నుంచి డీబార్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల ఎన్‌టీఏలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా నాలుగు అంచెల ప్రశ్నపత్రాల తనిఖీ విధానం, సుమారు 600 మంది నిపుణులను తొలగించడం, కొత్తగా సబ్జ

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ను వి శ్వనగరం చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్‌రావు మండిపడ్డారు. తార్నాక డివిజన్‌కు చెందిన మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు విద్యావంతులు, స్థానికులు రాంచందర్‌రావు సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాం చందర్‌రావు ప్రసంగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తేనే కేంద్ర పథకాలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అందుతున్న సుపరిపాల న, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సమాజంలోని విద్యావంతులు, మేధావులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున బిజెపి వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో సరైన మౌలిక వసతులు లేక, అధ్వానపు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, సమస్యలతో నగర ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మేషంసమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమిస్తారు. వృషభం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం. ఆకస్మిక ధనవ్యయ సూచనలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారమున కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేరు. మిధునం ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలిగిన అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగమున ఆలో

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ యాంత్రీకరణ పథకంల కింద రైతులకు అందించే సబ్సిడీ నిధులను ఈ సారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై మంత్రి సమీక్షించారు. ఈ పథకం కింద రైతులకు అందించాల్సిన వ్యవసాయ పనిముట్లను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్ల ఎంపిక చేసి, వాటి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, మధ్యవర్తిత్వానికి అవకాశం లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. యాంత్రీకరణ పథకంలో పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను హాకా అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు. నాణ్యత, ధర, రైతులకు అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంప్యానెల్ లిస్టును త్వరగా