25124 articles

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన అర్జున్ శర్మను ఆగ్రాలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌కి చెందిన నిఖిత గొడిశాల(27) ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అమెరికాలోని పోలీసులకు కంప్లైంట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. జనవరి 3న అతని […] The post అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య..తెలంగాణలో నిందితుడు అరెస్ట్ appeared first on Navatelangana.

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. కంపెనీ 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేసి రూ.37,700 కోట్లు సమీకరించనుంది. ఇది భారీ మొత్తం కావడంతో ఈ ఐపిఒ దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించనుంది. దీపావళి సమయంలో ఐపిఒ రావచ్చని అంచనా వేస్తున్నారు. 49వ సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, జియో లిస్టింగ్ ద్వారా భారత్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని భావిస్తున్నారు. జియో వినియోగదారులు 52.4 కోట్లకు చేరారని, 1.3 కోట్ల గృహాలకు ఎయిర్‌ఫైబర్ కనెక్ట్ అయిందని, శాటిలైట్ ఇంటర్నెట్, జియో టెలిఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌లను తెస్తున్నామని ఆకాష్ అంబానీ వెల్లడించారు. జియోమార్ట్‌లో 3100 కి పైగా స్టోర్లు ఉన్నాయని, నమోదిత కస్టమర్లు 38.7 లక్షలకు చేరారని ఇషా అంబానీ వెల్లడించారు.
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఐదు నెలల గర్భవతి అని తేలడంతో స్థానికంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాలికకు పాఠాలు చెప్పే ప్రయివేటు ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మయూర్‌భంజ్ జిల్లాలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ వారం ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో […] The post 9వ తరగతి విద్యార్థినిపై లైంగికదాడి..ట్యూటర్ అరెస్ట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. త్రిశూలీ నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నిలిపివేయబడ్డాయి. గండకీ బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. సహాయక చర్యల్లో 15 వేలకుపైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 4,400 మందిని రెస్క్యూ టీమ్ సురక్షితంగా తరలించింది. The post నేపాల్‌లో వరదలు..త్రిశూలీ నదిలో పెరిగిన నీటి మట్టం appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. The post పేలిన కారు టైరు..నలుగురు విద్యార్థులు మృతి appeared first on Navatelangana.

‘ఇరుముడి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ‘సరిపోదా శనివారం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ వివేక్ ఆత్రేయతో రవితేజ జతకట్టనున్నారు. ‘ఇరుముడి’ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక వేడుకలో దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని.. రవితేజను కలిసి బ్లాక్‌బస్టర్ విజయానికి అభినందనలు తెలిపారు. రవితేజ, వివేక్ ఆత్రేయ, లక్ష్మణ్, శ్రీని, బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. వివేక్ ఆత్రేయ తనదైన ట్రీట్‌మెంట్‌తో రూపొందించే ప్రపంచంలోకి రవితేజ అడుగుపెట్టడం ద్వారా సరికొత్త సినీ అనుభూతి అందించనున్నారు. దర్శకుడు హసిత్ గోలి తో రవితేజ చేయనున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

నవతెలంగాణ-హైదరాబాద్ : రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు, సాగు ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రాక్టర్లు, యంత్రాలకు ఇచ్చే రాయితీ నిధులను ఈసారి నేరుగా అన్నదాతల అకౌంట్లోనే జమ చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ స్కీమ్ కోసం దాదాపు 5.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేవని, యూరియా 2.79L టన్నులు, డీఏపీ 22K టన్నుల స్టాక్ ఉందన్నారు. The post నేరుగా రైతుల అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.

దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ నుంచి రెండో సింగిల్ ‘లూజర్’ విడుదలైంది. జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటను మలయాళంలో దుల్కర్ సల్మాన్ స్వయంగా ఆలపించారు. సుహైల్ కోయా సాహిత్యం అందించారు. మలయాళ వర్షన్‌లో కె. బాలసరంగన్, జేక్స్ బిజోయ్ కూడా గాత్రం అందించారు. ఈ పాటను మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తమిళ, తెలుగు వర్షన్లను బెన్నీ దయాల్ ఆలపించగా, విఘ్నేష్ రామకృష్ణ(తమిళ్), సనారే(తెలుగు) సాహిత్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. స్టైలిష్, ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ స్టైల్‌లో రూపొందిన ‘లూజర్’ సాంగ్ యువతను ఆకట్టుకునేలా ఉంది. ‘ఐయామ్ గేమ్’ ఆడియో లాంచ్, ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 29న సాయంత్రం 6 గంటల నుంచి కక్కనాడలోని కిన్‌ఫ్రా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. సరికొత్త స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్ అనుభూతిని ఈ సినిమా అందించబోతుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు, -దర్శకుడు మిస్కిన్, కాయదు లోహర్, కతిర్











మన తెలంగాణ/క్రీడా విభాగం: శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో, చివరి టెస్టును టీమిండియా డ్రాగా ముగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఫాలోఆన్ ఆడుతూ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన శ్రీలంక చిరస్మరణీయ ప్రదర్శనతో మ్యాచ్‌ను డ్రా చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు భారత బౌలర్లు పూర్తిగా నిరాశ పరిచారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న లంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించడంలో టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూర్యాభండారను ఔట్ చేయడంలో బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్న ఫలితం లేకుండా పోయింది. పేలవమైన బౌలింగ్‌కు చెత్త ఫీల్డింగ్ తోడు కావడంతో పసిందు, కమిందు మెండిస్ భారత బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నారు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వీరు సాగించిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే. పసిందు మరోసారి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెండిస్ కూడా అద్భుత పోరాట పటిమను కనబరిచాడు. దీంతో నాలుగో రోజు భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఇక చివరి రోజు సోనల దినుష అసాధారణ ప్రదర్శనతో టెస్టు చరిత్రలోనే చిరకాలం



