24142 articles

Jayaraju and Jyothi from Vepalasingaram village in Huzurnagar Mandal, Suryapet district, have only one daughter, Himabindu. Working in America, Himabindu met Rohit Kumar, who is from NTR district, and their friendship eventually blossomed into love.

చెన్నై: మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.శివజ్ఞానం నేపాల్‌లో ఆగస్టు 26 నుంచి అదృశ్యమైనట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు మద్రాస్ బార్ అసోసియేషన్ (ఎంబిఎ) సోమవారంనాడు తెలియజేసింది. తక్షణం జోక్యం చేసుకువాలని కోరింది. నేపాల్‌లో సంభవించిన భారీ వరదల అనంతరం ఆయన కనిపించకుండా పోయినట్టు సమాచారం ఉందని తెలియజేసింది. విపత్తు సంభవించిన సమయంలో జస్టిస్ శివజ్ఞానం తమిళ యాత్రికుల బృందంతో కలిసి నేపాల్‌లో పర్యటిస్తున్నారని ఎంబిఎ ఆఫీస్‌బేరర్ ఒకరు తెలిపారు.‘ఈ అత్యంత క్లిష్ట సమయంలో జస్టిస్ శివజ్ఞానం కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన ఆచూకీ కనుగొని సురక్షితంగా తిరిగి తీసుకురావడంతో భారత ప్రభుత్వం సమన్వయంతో, వేగంగా, నిరంతరం చేపట్టే చర్యలు ఎంతో కీలకమైన సహాయన్ని అందించగలవు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో కూడా బార్ అసోసోయేషన్ పేర్కొంది. జస్టిస్ శివజ్ఞానం కోసం గాలించి, రక్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలు వినియోగించాలని, ఆ ప్రక్రియలో సాధించిన పురోగతిని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఎంబిఎ కోరింది. జస్టిస్ శివజ్ఞానం న్యాయవ్యవస్


హైదరాబాద్: కెసిఆర్‌కు, నాకు పోలికనా..? నందికి, పందికి ఉన్నంత తేడా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం అంబర్ పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. 1,000 రోజుల ప్రభుత్వ సొమ్ము మెక్కి గంట కూడా పనిచేయని కెసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని అన్ని చోట్ల నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనలు తెలపాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈనెల 6వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, 7వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఎదురుగానే అన్ని విషయాలు చెబుతానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు న్యాయం చేయాలని అనుకుంటే, నమ్మకం ఉంటే అసెంబ్లీకి కెసిఆర్ రావాలని ఆయన సూచించారు. 1,000 రోజుల్లో కోటి ఇరవై నాలుగు లక్షల నలభై వేల జీతం కెసిఆర్ తీసుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగి ఏడాది పాటు విధులకు రాకపోతే డిస్మిస్ చేస్తారని, మరి కెసిఆర్‌ను ఏం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్ భద్రత, వసతుల కోసం 21 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిప్రి పోలీస్ స్టేషన్ ఏరియాలోని మనోరి గ్రామంలో బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్టు జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ పాల్ తెలిపారు. 11 మందిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. మృతులను ప్రియాంజలి (5), ప్రవీణ్ సింగ్ (13), జాహ్నవి (12), ఆదితయ (12), రవి (8), అంజు (32), జ్ఞాన్ సింగ్ (40), విక్రమ్ సరోజ్ (35), అన్ష్ (6), నానా (4)గా గుర్తించారు. మృతులంతా ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలోనే నివసించే వారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదారు ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కాగా, పేలుడు తీవ్రత కారణంగా ఘటనా ప్రాంతం సమీపం నుంచి వెళ్లే ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌పై వెళ్లే రైళ్ల రాకపోకలను సుమారు గంటసేపు నిలిపివేశారు. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌ను మనోరి రైల్వే స్టేషన్‌కు వెనక్కి పంపించారు. ఢిల్ల

నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌత్ జోన్ కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఓవర్‌నైట్ స్కోరు 40/2తో సోమవారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్ చేపట్టిన సౌత్ జోన్‌కు కెప్టెన్ తిలక్ వర్మ అండగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో తిలక్ అలరించాడు. వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సమరన్ రవిచంద్రన్ అండతో తిలక్ స్కోరును ముందుకు నడిపించాడు. ధాటిగా ఆడిన రవిచంద్రన్ 4 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు.అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన హిమతేజ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో తిలక్, శ్రేయస్ గోపాల్ అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు నార్త్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 169 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తిలక్ వర్మతో కలిసి ఆరో వికెట్‌కు 175 పరుగులు జోడించాడు. మరోవైపు కెప


ఆగస్టు 19న చిన్నారి మర్మావయాలపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో ఒక ‘బ్యాడ్ అంకుల్’ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నట్టు తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు బవానా పోలీస్ స్టేషన్, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 24న స్కూలులోని సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫోటోగ్రాఫ్‌లు చూపించడంతో ఆ నిందితుడిని చిన్నారి గుర్తించింది. అతనిని 8 నెలలుగా ఇదే పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న వికాస్‌గా గుర్తించారు. ఫిర్యాదు అందిన రోజునే నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు ఛాకెట్లు ఇస్తున్నట్టు అతని ఫోన్‌లో ఉన్న వీడియాల్లో గుర్తించామని, పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చేశారు.

నేపాల్‌లో వరదల అనంతరం మృతదేహాల గుర్తింపు అధికారులకు, బాధిత కుటుంబాలకు పెను సవాల్‌గా మారింది. పోఖరాలోని ఓ ఆసుపత్రిలో ఒకే మృతదేహాన్ని మూడు కుటుంబాలు తమ బంధువుదేనని ప్రకటించుకున్నారు. ఈ ఒక్క సంఘటన అక్కడ మృతదేహాల గుర్తింపులో ఎదురవుతున్న ఎన్నో సవాళ్లకు అద్దం పడుతోంది. పోఖరా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లోని మృతదేహం నంబర్ 1003ను బర్దియాకు చెందిన హైడ్రోపవర్ ప్రాజెక్టు కార్మికుడు గోపాల్ దహిత్, రూపందేహికి చెందిన టూరిస్ట్ గైడ్ దామోదర్ బస్యాల్ కుటుంబాలు తమ బంధువుదేనని పేర్కొన్నాయి. మరో కుటుంబం కూడా తొలుత అదే మృతదేహంపై హక్కు వ్యక్తం చేసినట్లు నేపాల్ న్యూస్ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం దహిత్, బస్యాల్ కుటుంబాల మధ్య మృతదేహం గుర్తింపుపై వివాదం కొనసాగుతుండగా, తుది నిర్ధారణ కోసం డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకునేందుకు రెండు కుటుంబాలు అంగీకరించాయి. వరదల్లో కొట్టుకుపోయిన మృతదేహాలు దిగువ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు చేరడంతో వాటిని గుర్తించడం మరింత క్లిష్టంగా మారింది. మృతుల గుర్తింపులో ఫొటోలు, శారీరక లక్షణాలు, పళ్లు, చెవులు, పెదాలు, ముఖం, చేతులు, ఛాతీ, శరీర నిర్మాణం, వ్యక్తిగత వస్తువులు వంటి ఆధారాలను అధికారులు, కు


గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బల్యాన్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన మోహిత్ (22), సుమిత్ (24) అనే ఇద్దరు నిందితులు షామ్లీ పట్టణంలోని కైరానా రోడ్డులో ఉన్న ఇండియన్ గ్యాస్ గోదాం సమీపంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల ఎదురుకాల్పుల్లో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం వారు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు కొన్ని గంటల ముందు ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ..అంకిత్ బల్యాన్ హత్య ముందస్తు కుట్రలో భాగమని వెల్లడించారు. గోగి గ్యాంగ్‌తో సంబంధాలున్న నెట్‌వర్క్ ఈ హత్య వెనుక ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై అంకిత్ తండ్రి సత్వీర్ సింగ్ స్పందించారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూనే తమకు సగం న్యాయం జరిగిందన్నారు. మిగిలిన సగం న్యాయం కూడా త్వరలో జరగాలని కోరారు. అంకిత్ సోదరి రీనా మాత్రం కుటుంబానికి ‘పూర్తి న్యాయం’ కావాలని స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరగడం తమకు ఇష్టం లేదని, మిగిలిన నిందితుల విషయంలోనూ ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.


యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో పెను సంచలనం నమోదైంది. సెర్బియా యోధుడు, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జకోవిచ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. కెరీర్‌లో 25వ టైటిల్ సాధించాలని తహతహలాడుతున్న జకోవిచ్‌కు మరోసారి నిరాశే మిగిలింది. యూఎస్ ఓపెన్ మొదటి రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోనెతో జరిగిన పోరులో జకోవిచ్ అనూహ్యంగా ఓటమి పాలయ్యాడు. దాదాపు నలుగున్నర గంటలకు పైగా సాగిన మారథాన్ సమరంలో నవోనె 76, 57, 46, 62, 61తో నాలుగో సీడ్ జకోవిచ్‌పై సంచలన విజయం సాధించాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. టైబ్రేకర్ వరకు వెళ్లిన తొలి సెట్‌లో నవోనె జయకేతనం ఎగుర వేశాడు. అయితే తర్వాత పుంజుకున్న జకోవిచ్ వరుసగా రెండు సెట్లు గెలిచి పైచేయి సాధించాడు. కానీ తర్వాతి సెట్‌లలో నవోనె అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగాడు. ఇదే క్రమంలో అలవోకగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో జకోవిచ్ మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు. మరో మ్యాచ్‌లో కజకిస్థాన్‌కు చెందిన 15వ సీడ్ అలెగ్జాండర్ బబ్లిక్ విజయం సాధించాడు. అమెరికా ఆటగా

బతుకమ్మ కుంటను చెరపట్టింది ఎవరు..? ఏ నాయకుడు వస్తే హెలికాప్టర్లో పూలు చల్లి బతుకమ్మ కుంటను చెరపట్టారో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని సోమవారం సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, ఎండాకాలంలో కూడా నీళ్లు ఊరాయని, బతుకమ్మ కుంటకు వచ్చి విమలక్క పాటలు పాడితే, ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే ఆయన బతుకమ్మ కుంటను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆలోచించాలన్నారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మీకే అప్పగించామని, హైడ్రాను తెచ్చానని తనపై ఆరోపణలు చేసి నిందిస్తున్నారని సిఎం అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 1,000 రోజులు పూర్తి చేసుకున్నామని, 1,000 రోజుల ప్రజా పాలనపై తాము కార్యాచరణ తీసుకున్నామని చెప్పారు. నిరసన తెలుపుతామని కొందరు

ఢిల్లీ: సర్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ జనాభా 140 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముసాయిదా జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని, దీంతో రాష్ట్రంలో నమోదైన ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి పేరు ముసాయిదా జాబితాలో లేకుండా పోయిందన్నారు. ఇదిలావుండగా ఎస్‌ఐఆర్ కింద ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. 1.5 కోట్ల మంది ఓటర్లలో 47 లక్షల మంది పేర్లు తొలగించడంతో కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.


వాషింగ్టన్ : అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతాన్ని భారీ ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 19మంది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పార్కులో పర్యాటకులు, స్థానిక ప్రజలకు నీటిని సరఫరా చేసే ఏకైక పైప్‌లైన్ ధ్వంసమైంది. సోమవారం ఇదే ప్రాంతంలో మరిన్ని వర్షాలు, ఉరుములతో కూడిన పిడుగుపాట్లు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు వరద హెచ్చరికను జారీ చేశారు.నీటి కొరత నేపథ్యంలో సోమవారం నుంచి అత్యవసర నీటి పరిమితులు అమల్లోకి వచ్చాయి. పార్కులోని లాడ్జీలు, హోటళ్లలో పర్యాటకులు రాత్రి బస చేయడానికి అనుమతి లేకుండా చేశారు. ఏడాది పొడవునా అక్కడే నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.


న్యూఢిల్లీ: ఔటర్ నార్త్ ఢిల్లీ బవానా ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూలులో నర్సరీ చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన పాఠశాల బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఆగస్టు 19న చిన్నారి మర్మావయాలపై గాయాలు ఉండటాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలులో ఒక ‘బ్యాడ్ అంకుల్’ తనకు రోజూ చాక్లెట్లు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నట్టు తల్లిదండ్రులకు బాలిక చెప్పడంతో వారు బవానా పోలీస్ స్టేషన్, స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 24న స్కూలులోని సీసీటీవీ వీడియో దృశ్యాలు, ఫోటోగ్రాఫ్‌లు చూపించడంతో ఆ నిందితుడిని చిన్నారి గుర్తించింది. అతనిని 8 నెలలుగా ఇదే పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న వికాస్‌గా గుర్తించారు. ఫిర్యాదు అందిన రోజునే నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పిల్లలకు ఛాకెట్లు ఇస్తున్నట్టు అతని ఫోన్‌లో ఉన్న వీడియాల్లో గుర్తించామని, పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ‘సిట్’ను ఏర్పాటు చ



నీటి కేటాయింపులు లేకున్నా.. వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఎపి ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తుండటం తెలంగాణకు తీరని ద్రోహం అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఎపి ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని పేర్కొన్నారు. ఒకవైపు కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఎపి నిబంధనలు ఉల్లంఘిస్తూ, యదేఛ్చగా నీటిని తరలిస్తోందని విమర్శించారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాటా నీటిని ఎపి తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు..? అని ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది
