
ఢిల్లీ: సర్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశ జనాభా 140 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన కొద్ది గంటలకే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముసాయిదా జాబితా నుంచి 47 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారని, దీంతో రాష్ట్రంలో నమోదైన ప్రతి ముగ్గురు ఓటర్లలో ఒకరి పేరు ముసాయిదా జాబితాలో లేకుండా పోయిందన్నారు. ఇదిలావుండగా ఎస్‌ఐఆర్ కింద ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. 1.5 కోట్ల మంది ఓటర్లలో 47 లక్షల మంది పేర్లు తొలగించడంతో కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.











