అమరావతి: టిడిపి ఎంఎల్‌ఎ కాగిత కృష్ణప్రసాద్ పెను ప్రమాదం తప్పింది. పెడిన నియోజకవర్గం ఎంఎల్‌ఎ కాగిత కృష్ణ ప్రసాద్ విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఎంఎల్‌ఎ కారును ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. కారు ముందు ధ్వంసమైంది. ఎంఎల్‌ఎతో పాటు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఆర్‌టిసి బస్సు ఉయ్యూరు డిపోకు చెందినదిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.