
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డిపైక్రమశిక్షణ చర్యలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలు చర్యలు ఉంటాయా? లే క ఈ వివాదానికి తెరదించారా? అనేది ఇంకా స్ప ష్టత రావడం లేదు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఎంత పెద్ద వారైనా సహించేది లేద ని పిసిసి, ఏఐసిసి నేతలు పదే పదే హెచ్చరిస్తున్నా ఈ వివాదం జరిగి పది రోజులు గడిచినా ఇంకా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందా? లేక చర్యలు ఉంటా యా? అన్నది ఎటూతేల్చకపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొన్నది. ఇలా ఉండగా మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ క ట్టారు.
అయితే ఈసారి మాత్రం సీఎంకు బంగారు రాఖీ కట్టడం విశేషం. మంత్రి కొండా సురేఖతో పాటు మరో మంత్రి సీతక్క కూడా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతు లు వారిని సాదరంగా ఆహ్వానించారు. కాగా కొం డా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు, వాటిని సురేఖ ఖండించకపోవడం పట్ల అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. అయితే కొండా సురేఖ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, వరంగల్‌లో వనమహోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఖర్గేతో సురేఖ.. భట్టితో మురళి రాయబారాలు
ఇదిలాఉండగా తన కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించకుండానే మంత్రి సురేఖ బెంగళూరులో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం, ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మంతనాలు జరిపారు. మంత్రి సురేఖ మాదిరిగానే కొండా మురళి కూడా తమ కుమార్తె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా వారం రోజుల క్రితం 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ, సురేఖపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ అంశంలో పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా ఉన్నట్లు కూడా పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో అసలు చర్యలు ఉంటాయా? లేక ఈ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెట్టారా? అన్న మీమాంస లేకపోలేదు. మరోవైపు పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ నెల 18న అత్యవసరంగా సమావేశమై మంత్రి కొండా సురేఖ, జి. చిన్నారెడ్డిపై కఠిన చర్య తీసుకోవాల్సిందేనని తమ నివేదికను అధిష్టానానికి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అందజేశారు.
కెసి వేణుగోపాల్‌తో సమావేశం తర్వాతే నిర్ణయం?
ఈ నెల 31న ఏఐసీసీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ విదేశి పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత రాష్ట్ర ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకున్నాకే ఏ నిర్ణయం అనేది తేలనున్నదని పార్టీ వర్గాల సమాచారం.











