
మన తెలంగాణ/మోత్కూర్: జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్ లు ,కాల్వలు పూర్తి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ, సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31, తేదీలలో భువనగిరి నుండి ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర, 31 న ఇందిరా పార్కులో జరిగే మహాధర్నాలో రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని సిపిఎం మండల నాయకులు బండి రవి పిలుపు నిచ్చారు. శుక్రవారం మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో ధర్నా వాల్ పోస్టర్లను రైతుల, తో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....పాటిమట్ల, పరిసర ప్రాంతాలకు సాగునిరంధించే బృందావన్ కాల్వ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై, చెత్త చేదారంతో నిండి కూరుకపోతున్న పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు .
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందావన్ కాల్వను పరిశీలించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అయిన ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వ వేడెల్పు చేసి సాగునీరు అందించడంలో పాలకులు విఫలమౌతున్నారని, సాగునీటి ప్రాజెక్ట్ లు, మరియు కాల్వల పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని నిరశిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి నుండి హైద్రాబాద్ ఇందిరాపార్క్ వరకు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి 31 న ఇందిరాపార్క్ వద్ద జరిగే మహాధర్నాకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కురిమేటి సోమయ్య, చిరుమర్తి యాదయ్య , ఈశ్వరమ్మ, సోమేశ్, కురిమేటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.











