9695 వార్తలు

నవతెలంగాణ – కాటారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో కాటారం చౌరస్తా సందడిగా […] The post ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సినిమాట్రోగాఫర్ కిషోర్ బోయిదాప. తాజాగా ఆయన నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘మేము కాప్’లం’ సిరీస్‌తో మన ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కిం చటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన […] The post అందరి సహకారంతో 17 రోజుల్లో సాధ్యమైంది appeared first on Navatelangana.

నందు, అవికా గోర్ జంటగా నటించిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ రచన, దర్శ కత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మించారు.ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. హీరో నందు మాట్లాడుతూ,’ మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా ఉదయంతో పోలిస్తే విడుదల […] The post ‘అగ్లీ స్టోరీ`కి అనూహ్య స్పందన appeared first on Navatelangana.

గత కొంతకాలంగా తెలుగు సాహిత్యం కొత్త కళను సంతరించుకుంది. కవిత్వ కార్యశాలలు, కథా శిబిరాలు, జూమ్ సమావేశాలు, ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. వివిధ వేదికల్లో కవిత్వం ఎలా రాయాలి?, కథలు ఎలా అల్లాలి? అనే చర్చలు జరుగుతుంటే తెలుగు సాహిత్యానికి కొత్త చైతన్యం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఉత్సాహాన్ని చూసినప్పుడు కొంతమంది సాహితీ పెద్దలకు నేను ఒక విన్నపం చేశాను. ‘కవిత్వం, కథలపై ఇన్ని శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మరి విమర్శపై […] The post పొగడ్తల మధ్య సన్నగిల్లుతున్న తెలుగు సాహిత్య విమర్శ appeared first on Navatelangana.

రాంచీ: అథ్లెటిక్స్‌లో పంజాబ్ స్పింటర్ గురీందర్వీర్ సింగ్ నయా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కఫ్ ఫైనల్లో గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల పరుగు విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇంతకుముందు ఒడిశాకు చెందిన అనిమేశ్ కుజుర్ 10.15 సెకన్లలో రేసును పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా గురీందర్వీర్ సింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టి భారత ఉత్తమ అథ్లెట్‌గా నిలిచాడు.

ఇంకా ఆకాశం మిగిలే ఉందిఅరచేతిలో జారిపోయినకాలపు గింజల మధ్యమరచిపోయిన గూటి వాసనలామనసు తడబడుతోంది.నిన్నటి మాటలుగాలికి అప్పగించిన బాణాలైతిరిగి రాని మార్గాల్లోనీ నిశ్శబ్దాన్ని గాయపరిచిన వేళనీ సహనంపొదల మధ్య దాగిన నీటి వనరులానన్ను క్షమిస్తూ ప్రవహించింది.నేను అహంకారపు గాలిలోఅడవి మంటలా ఎగసిన వాడిని,నీ కలల పచ్చదనాన్నికాలి బూడిద చేసిన వాడిని.కానీ నువ్వు వాన రాకపోయినామేఘాల్ని నమ్మే నేలవు,గాయాలపై పూలు నాటేఅనిర్వచనీయ మృదుత్వం.ఇప్పుడు రెక్కలు బలపడిన పిట్టలుగూటిని విడిచిపెట్టిఆకాశాన్ని కొలుస్తున్నాయి;మన కథసంధ్యారాగం వైపు ఒంపుకుంటోంది.మిగిలిందిఒకే కప్పు నీడలోరెండు నిశ్శబ్దాల మధ్యచెలిమి […] The post రెక్కలార్చుకుంటూ… appeared first on Navatelangana.

చాలా రోజులయ్యింది నిన్ను చూడక గడియారం ముల్లుఎన్ని సుట్లు తిరిగిందోనిన్ను ముద్దాడకనువ్వు వస్తేమండు వేసవిలో మల్లెలు పూచినట్టుఎటు నుండి వస్తావోగడ్డి పరక మీదమంచు బిందువు రాలినట్టుఎండు కొమ్మ మీదవసంతం వాలినట్టురా ప్రియా రానువ్వు వెంటపడినపుడల్లాఅనుభవించినఆ ఉపవాసాలే నాకిష్టంలైలా మజ్నూ కూడా చవి చూడనిఈ విరహం నాకే ఎందుకుసలీం అనార్కలి గుండెలు బాదుకోనిఈ దూరం నాకే ఎందుకుఊపిరాడని పని జంఝాటంలోనువ్వే కదా ప్రాణవాయువునువ్వు రాకపోతేఈ కవితా ప్రపంచంలోదారం తెగిన గాలిపటంలాఎటు పోతానోరెక్కలు విరిగి బొక్కలు తేలినాపెద్ద చేపలు రుచి […] The post కవిత్వమా కాస్తకౌగిలి ఇవ్వు appeared first on Navatelangana.

అంతా అయిపోయిందిఅందరూ చేతులెత్తేశారుఇక ఏమి మిగిలిపోలేదనిగొంతెత్తి చెపుతున్నారుకాలం మారిందియుద్ధ తంత్ర విద్యమిధ్యా మంత్రంగా మారిందితాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లుఒక ఎండమావుల కాలం కొనసాగుతుందినిన్న మొన్న తొడుక్కున్న వస్త్రాలువిడిచి కాలం చాకిరేవుకు అప్పగించిందిపచ్చని లేచిగుళ్ల దుస్తులనుప్రకృతి దర్జీ రహస్యంగా కుట్టిచెట్టుకు బహుమతిగా ఇచ్చిందిఒక జీరో షాడో డే దందా నడుస్తున్నదిఇంతకాలం నిరాకరించిన దాన్నిఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారుఇంతకాలం వ్యతిరేకించిన దాన్నిఇప్పుడు అందరూ ఆమోదిస్తున్నారుఒక బతికివున్న శవయాత్ర సాగుతున్నదిపునాదిలో కదలికఉపరితలంలో ఒక బడలికఅందరూ చిటికె లేస్తూఆవులింతలు తీస్తున్నారుఅందరూ వేడి పకోడీలాసెగలు […] The post ఒకే ఒక ఎండాకాలం appeared first on Navatelangana.

ఒక కవితా సంపుటిని విమర్శించడం అంటే కేవలం దాని భాషా సౌందర్యాన్ని లేదా శిల్పపు నైపుణ్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు. అది ఆ కవి ప్రపంచ దృష్టిని, అతని జ్ఞానశాస్త్రపు పునాదులను, అతని నైతిక భూమికను పరీక్షించడం కూడా. డా. సుంకర గోపాలయ్య రచించిన ‘నీటికుండలాంటి మనిషి’ కవితా సంపుటి 2021 నుండి 2025 మధ్య కాలంలో రాసిన 49 కవితలతో నిర్మితమైన ఈ సంపుటి, తెలుగు వచన కవిత్వ పరంపరలో ఒక ప్రత్యేకమైన తాత్విక […] The post అస్తిత్వపు మట్టిలో తత్వశాస్త్రపు విత్తనం appeared first on Navatelangana.


కరాచీ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఓ రైలులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మంది దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం క్వెట్టా ప్రాంతంలోని చమన్ పాటక్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు అనుబంధంగా మారుమూల ప్రాంతంలో వెళ్లే షటిల్ సర్వీసు రైలులో ఈ పేలుడు జరిగింది. నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ) ఈ పేలుడుకు తమదే బాద్యత అని ప్రకటించింది, షటిల్ రైలు క్వెట్టా కంటోన్మెంట్ నుంచి బయలుదేరిన రైలు దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. కంట్మోనెంట్ నుంచి సైనికులను తీసుకువెళ్లుతున్నందునే తాము దీనిని లక్షంగా చేసుకుని దాడికి దిగినట్లు బిఎల్‌ఎ తెలిపింది. 14 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఇందులో ముగ్గురు ఫ్రాంటియర్ కార్ప్ సిబ్బంది కి చెందిన వారు. అయితే మృతుల సంఖ్య 20కు చేరిందని, పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య అత్యధికంగా ఉందని అక్కడి సోషల్ మీడియా వర్గాలు తెలియచేస్తున్నాయి. సైనికులు, వారి కుటుంబాలతో కలిసి వెళ్లుతున్న ఈ రైలును టార్గెట్ చేసుకుని రైల్వే సిగ్నల్ దాటుతున్న సమయంలోనే పేలుడు పదార్థాల ట్రక్కు ఒకటి వచ్చి రైలును ఢీకొంద



మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల నిర్వహణ, ఫుట్ బాల్ పోటీల నిర్వహణ చేసుకోవడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై సిఎం ఇంతవరకు ఒక్క రివ్యూ చెయ్యలేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చెయ్యండి అని రైతులు వేడుకుంటున్నారని, ఎండ తీవ్రతకు ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం 50 శాతం కల్లాలోనే ఉందని, అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొక్క జొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం వరి ధాన్యం కొనుగోలు అంశం అని, ధాన్యం కొనుగోలు అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చనే లేదని అన్నారు. వరి ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, క్వింటాల్‌కు 250 రూపాయలు రైతు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశార

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఐటీ హబ్ మాదాపూర్‌లో యువకులు మరోసారి బరితెగించారు. అర్ధరాత్రి కార్ రేసింగ్‌తో హల్‌చల్ సృష్టించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టడంతో అతడి చేతికి ఫ్రాక్చర్ అయింది. మాదాపూర్‌లోని నిలోఫర్ కేఫ్ సమీపంలో కొందరు యువకులు కార్ రేసింగ్, స్టంట్లు చేస్తూ గందరగోళం సృష్టించారు. మోడిఫైడ్ సైలెన్సర్‌తో ఓ కారు బీభత్సం సృష్టిస్తుండగా, లాఠీలతో ఉన్న ముగ్గురు పోలీసులు దానిని ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆగకపోవడంతో వెంబడించారు. ఈ […] The post మాదాపూర్‌లో కార్ రేసర్ల వీరంగం..కానిస్టేబుల్‌కు గాయం appeared first on Navatelangana.

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా కక్షపూరిత ధోరణితో ఆయనపై కేసులు నమోదు చేసి వేధించడం ఎంతమాత్రం సరికాదని బిఆర్‌ఎస్ అగ్రనేత హరీష్ రావు ఎక్స్ వేదికగా హితవు పలికారు. ప్రొఫెసర్‌పై పెట్టిన అన్ని కేసులను ఎపి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.

చెన్నై : విజయ్ నేతృత్వంలోని టివికె ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డిఎంకె నాయకుడు, ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఐదుగురు ఎంఎల్‌ఎలు గెలవడానికి డిఎంకె కార్యకర్తలే కారణమని, గెలిచాక పదవుల కోసం తమతో కనీస మర్యాదగా మాట కూడా చెప్పకుండా టివికె మైనారిటీ ప్రభుత్వం చెంతకు చేరారని అన్నారు. కనీస కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు. వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని ఉదయనిధి పేర్కొన్నారు. భారతదేశవ్యాప్తంగా బిజెపి విజయానికి మోడీ, అమిత్ షాలే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో బిజెపి ఎదుగుదలకు కాంగ్రెసే కారణమని తనకు అర్ధమైందన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మా నాయకుడు ఎంకే స్టాలిన్ తన భుజాలపై మోశారు అని ఉదయనిధి పేర్కొన్నారు. అయితే స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. డిఎంకె కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ అన్నారు. ఆదివారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. లౌకిక కూటమికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. డిఎంకె, అన్నాడిఎంకె మధ్య రాజక




న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరచేందుకు వీరు కుట్రపన్నుతున్నారని, హింసను రెచ్చగొడుతున్నారని అన్నారు. పాలకపక్షాన్ని ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎదుర్కోవడంలో విఫలం కావడంతో ఉద్దేశపూర్వకంగా దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఆరోపించారు.దేశాన్ని అస్థిరపరచేందుకు కాంగ్రెస్, విపక్ష పార్టీల టూల్‌కిట్ గ్యాంగ్ కలలు కంటోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకటన ఆషామాషీగా చేసినది కాదని, దేశంలో అరాచకం వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమన్నారు. రాజకీయ నిరాశానిస్పృహలే ఇందుకు కారణమని గోయల్ దుయ్యబట్టారు. డైనమిక్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రజల గుండెల్లోంచి వేరుచేయలేమని, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పోరులో ఓడించలేమని రాహుల్ గాంధీ అండ్ కంపెనీకి బాగా తెలుసన్నారు. దీంతో ఇప్పుడు దేశంలో హింసను రెచ్చగొట్టాలని కోరుకుంటున్నారన్నారని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని కోరుతూ విదేశాలకు వెళ్తున్నారని, కాంగ్రెస్ నిజమైన ఉద్దేశం ఏమిటో రాహుల్ మాటలే

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లకు వ్యాపించే అవకాశం ఉండటంతో.. అపార్ట్ మెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సి – బ్లాక్ లోని సెల్లార్ మంటలు చెలరేగడంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. కాగా.. షార్ట్ […] The post కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం..ఒక్కసారిగా చెలరేగిన మంటలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. వాంఖడే స్ట్రేడియంలో రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. […] The post రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు appeared first on Navatelangana.