ఇంకా ఆకాశం మిగిలే ఉందిఅరచేతిలో జారిపోయినకాలపు గింజల మధ్యమరచిపోయిన గూటి వాసనలామనసు తడబడుతోంది.నిన్నటి మాటలుగాలికి అప్పగించిన బాణాలైతిరిగి రాని మార్గాల్లోనీ నిశ్శబ్దాన్ని గాయపరిచిన వేళనీ సహనంపొదల మధ్య దాగిన నీటి వనరులానన్ను క్షమిస్తూ ప్రవహించింది.నేను అహంకారపు గాలిలోఅడవి మంటలా ఎగసిన వాడిని,నీ కలల పచ్చదనాన్నికాలి బూడిద చేసిన వాడిని.కానీ నువ్వు వాన రాకపోయినామేఘాల్ని నమ్మే నేలవు,గాయాలపై పూలు నాటేఅనిర్వచనీయ మృదుత్వం.ఇప్పుడు రెక్కలు బలపడిన పిట్టలుగూటిని విడిచిపెట్టిఆకాశాన్ని కొలుస్తున్నాయి;మన కథసంధ్యారాగం వైపు ఒంపుకుంటోంది.మిగిలిందిఒకే కప్పు నీడలోరెండు నిశ్శబ్దాల మధ్యచెలిమి […]

The post రెక్కలార్చుకుంటూ… appeared first on Navatelangana.