9698 వార్తలు

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్రమంగా అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లకు వ్యాపించే అవకాశం ఉండటంతో.. అపార్ట్ మెంట్ వాసులు భయంతో బయటికి పరుగులు తీశారు. సి – బ్లాక్ లోని సెల్లార్ మంటలు చెలరేగడంతో.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా.. ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటల్ని ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. కాగా.. షార్ట్ […] The post కోకాపేటలో భారీ అగ్నిప్రమాదం..ఒక్కసారిగా చెలరేగిన మంటలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. వాంఖడే స్ట్రేడియంలో రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. […] The post రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు appeared first on Navatelangana.

ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్ కు దూసుకెళ్లింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ జట్లతో పాటు ప్లేఆఫ్ రేసులోకి రాజస్థాన్ అడుగుపెట్టింది. ఈ క్రమంలో పంజాబ్, కోల్ కతా జట్ల ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులకే పరిమితమైంది.

– స్కూటీని డీకొట్టి ఇద్దరిని గాయపరిచిన వైనంనవతెలంగాణ-పరకాల: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సం సృష్టించారు. పరకాల పట్టణానికి చెందిన ఆర్ఎస్ఐ గోవింద అవినాష్ మద్యం మత్తులో కారు నడిపి, ఒక స్కూటీని బలంగా డీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన తిక్క పద్మ, సంజీవ వరకు పని నిమిత్తం వచ్చి […] The post మద్యం మత్తులో ఆర్ఎస్ఐ కారు బీభత్సం.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్ : వీధి కుక్కల బాధలు రోజురోజుకు పెరుగుతున్నాయి వీధి కుక్కల నివారణ చర్యల కోసం సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలు కుక్కలను చంపకుండా వాటిని ప్రతి జిల్లా కేంద్రంలో కుక్కల జంతుశాలని ఏర్పాటు చేసి వాటిలోకి తరలించాలని తీర్పు వెలువరించగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేది ఎప్పుడు అనే చర్చలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి వీధి కుక్కలతో ఏ గ్రామంలో చూసిన ఏ వాడలో చూసిన ప్రజలకు ఇబ్బందికరంగా మారింది పిచ్చి […] The post వీధి కుక్కల నివారణ చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేది ఎప్పుడు appeared first on Navatelangana.

నవతెలంగాణ-వనపర్తిఅంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా క్యూబా పై దృష్టి సారించామని ప్రకటించిన బెదిరింపులకు సమాధానంగా క్యూబా ఒంటరి కాదని..అమెరికా క్యూబా నుండి వైదొలగాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్ అన్నారు. సిపిఐ(ఎం) వనపర్తి పట్టణ రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర చారి ఆదివారం స్థానిక లిటిల్ బర్డ్స్ పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా పరమేశ్వర చారి వ్యవహరించారు. మొదట “జాతీయ […] The post క్యూబా ఒంటరి కాదు: సిపిఐ(ఎం) appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు బస్సుల్లో అత్యాధునిక సిసి కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ‘బస్సులో భరోసా‘ పేరిట రూపొందించిన ఈ సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్ సమీపం, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్‌బోర్డుతో పాటు బస్సు లోపల చివరి సీటు వరకు ప్రతి అంగుళం స్పష్టంగా కవర్ అయ్యేలా ఈ కెమెరాలను ప్రత్యేక సాంకేతికతతో అమర్చడం విశేషం. బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయ


నవతెలంగాణ-ఆర్మూర్మండలంలోని చేపూర్ గ్రామంలో జూదం,పేకాట స్థావరాలపై ఆదివారం చితా ఫోర్స్ సిసిఎస్ ఏసీపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిఘా తీవ్రం చేసిన పోలీసులు, మండలంలోని ఒక పెద్ద పేకాట స్థావరాన్ని బట్టబయలు చేశారు. గ్రామ శివార్లలో గల సాయన్న ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున పేకాట […] The post చేపూర్‌లో చితా ఫోర్స్ మెరుపు దాడి appeared first on Navatelangana.


నవతెలంగాణ-వర్ధన్నపేట:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59 జన్మదినం సందర్భంగా.. ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, సొసైటీ చైర్మన్ కౌడగాని రాజేష్ ఖన్నా పలువురు కాంగ్రెస్ మండల నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యం ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిపెట్టారు […] The post ఇల్లందలో ఘనంగా టిపిసిసి రాష్ట్ర అధ్యక్షునిజన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ–అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆదివారం దాడి నిర్వహించారు. ఎస్‌ఐ టీ.యయాతీ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.1,800 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంఘటన స్థలం నుంచి మరికొందరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు […] The post పేకాట స్థావరంపై పోలీసుల దాడి appeared first on Navatelangana.

నవతెలంగాణ-అశ్వారావుపేట:ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మీడియా కో-ఆర్డినేటర్ మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కాసానీ పద్మశేఖర్ గార్డెన్‌లో ఆదివారం మండల అధ్యక్షులు ఉస్మాన్ బాబా, కార్యదర్శి ఫంబి ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బండి కొమరయ్య హాజరై గ్రామీణ వైద్య మిత్రులు ప్రాథమిక వైద్య సేవలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు.అధికంగా యాంటీబయాటిక్స్ వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ… పరిమిత స్థాయిలోనే […] The post ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో appeared first on Navatelangana.


ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ రసవత్తర పోరులో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోల్ కతాకు కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే.. కోల్ కతాకు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక, ఢిల్లీ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ ను నిష్క్రమించిన సంగతి తెలిసిందే.జట్ల వివరాలు:కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(సి), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(w), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, KL రాహుల్(w), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి


నవతెలంగాణ-అచ్చంపేట: నాగర్ కర్నూల జిల్లా బల్మూర్ మండల పరిధిలోని కొండనాగుల ఈస్ట్ బీట్ పవన కుంట ప్రాంతంలో ఆదివారం ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసింది. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ భర్త నిమ్మల రాములు మేకల కాపలాకు అడవికి వెళ్లారు. పిల్లలతో సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ […] The post మహిళపై ఎలుగుబంటి దాడి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని తత్తెహక్కలు నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. జాలర్ల సాయంతో 8మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 7మంది మహిళలు, ఒకరు పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో నదిలో ఆల్చిప్పలు విరివిగా దొరుకుతాయి. దీంతో భత్కళ […] The post వేటకు నదిలో దిగి..ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి appeared first on Navatelangana.

మేడ్చల్: ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని యుపిలోని గాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్‌గా గుర్తించారు. మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పని చేస్తున్న అతడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉగ్రవాద సంస్థలను ఫాలో అవుతున్నాడు. కొన్నాళ్లుగా ఉగ్ర ముఠాలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పాక్ ఐఎస్ఐలోనూ చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జయీద్‌ఖాన్ సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. అతడి నుంచి నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నవతెలంగాణ–ఆలేరు రూరల్: అమెరికా,ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం భారతదేశంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,వారి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తోందని సీపీఐ (ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆలేరులో నూతనంగా ఎన్నికైన సీపీఐ (ఎం) నాయకులు,మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు ఎంఏ ఇంతియాజ్ ఇర్ఫాన్ అభినందన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన “అంతర్జాతీయ యుద్ధాలు – దేశీయ నిత్యావసరాల ధరలపై ప్రభావం” […] The post అమెరికా-ఇరాన్ యుద్ధంతో సామాన్యుడిపై మోయలేని భారం appeared first on Navatelangana.

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన ఉదరి కిష్టయ్య, చౌటుప్పల్ పట్టణానికి చెందిన కేశవాచారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఈ సాయం అందించామని,రాజీవ్ ట్రస్ట్ […] The post రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బి.మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ […] The post ఘనంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా.. వర్ధన్ హాస్పిటల్‌లో డా.సృజిల్ బాబు తేడ్డు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజ సేవకు అంకితభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆరోగ్యవంతమైన […] The post వర్ధన్ హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం appeared first on Navatelangana.