మేడ్చల్: ఉగ్రవాద గ్రూపుల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని యుపిలోని గాజియాబాద్‌కు చెందిన జయీద్‌ఖాన్‌గా గుర్తించారు. మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో పని చేస్తున్న అతడు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉగ్రవాద సంస్థలను ఫాలో అవుతున్నాడు. కొన్నాళ్లుగా ఉగ్ర ముఠాలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు. పాక్‌ ఐఎస్ఐలోనూ చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జయీద్‌ఖాన్ సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టి పట్టుకున్నారు. అతడి నుంచి నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.