ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ రసవత్తర పోరులో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుని ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కోల్ కతాకు కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే.. కోల్ కతాకు ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక, ఢిల్లీ జట్లు ఇప్పటికే టోర్నమెంట్ ను నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(సి), మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, తేజస్వి దహియా(w), అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, సౌరభ్ దూబే, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): అభిషేక్ పోరెల్, KL రాహుల్(w), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి నిగిడి