10839 వార్తలు

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతాపార్టీ (సిజెపి) పై సత్వర దర్యాప్తు పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థలపై వ్యంగ్మాత్మక విమర్శలతో ఏర్పాటు అయిన డిజిటల్ వేదిక పార్టీ సిజెపి ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపుతూ, సునామీకి దారితీసింది. నకిలీ న్యాయవాదులున్నారనే ఆరోపణలపై, సిజెపి సంబంధిత కార్యకలాపాలపై కలిసికట్టుగా తక్షణ దర్యాప్తు జరగాల్సి ఉంది. దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్‌కె గోస్వామి బెంచ్‌కు తెలియచేశారు.ఈ పార్టీ ఏర్పాటు ఇతర విషయాలపై మరీ అంతగా భావోద్వేగానికి గురి కావద్దని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్కా బాగ్చితో కూడిన ధర్మాసనం న్యాయవాదికి హితవు పలికింది. ఓ కేసు విషయంలో సిజెఐ చేసిన వ్యాఖ్యల ప్రాతిపదికనే బొద్దింకల పార్టీ ఏర్పాటు, అతి కొద్ది రోజుల్లోనే ప్రధాన జాతీయ పార్టీలకు దీనితో సంకట స్థితి ఏర్పడిన దశలో సిజెఐ బెంచ్ ముందుకే కేసు వచ్చింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఓ వైపు సిజెఐ వివరణ ఇచ్చారు. సందర్భాన్ని వేరే విధంగా అన్వయించుకోరాదని తెలిపారు. అయినప్పటికీ పార్టీ పేరిట ఓ వర్గం భారీ స్థాయిలో తప్పుడు, విద్వేషకర ప్రచారం సాగిస్తోందని

ఒడిశాలో మాజీ సిఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజెడి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపి పదవికి రాజీననామా చేశారు. సంబంధిత లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడుగా సమంతరాయ్‌కి పేరుంది. సమంతరాయ్ కంటే ముందు జెడియు రాజ్యసభ సభ్యులు సుజీత్ కుమార్, మమతా మహంతలు ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం బిజెపి టిక్కెట్‌పై ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, సమంతరాయ్ బిజెపిలో చేరే అవకాశాలున్నాయని, ఆయన చేరగానే పార్టీ మద్దతుతో తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతారని తెలుస్తోంది.

నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఏకంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు కీలక అధికారులు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. […] The post వర్చువల్ విధానంలో మహిళా సంఘాల భవనాలకు సీఎం ఓపెనింగ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-కాటారం : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే TGPOLYCET–2026 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ తదితర ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొదటి దశ కౌన్సిలింగ్ మే 27 నుంచి జూన్ 9 వరకు, ఫైనల్ ఫేజ్ జూన్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాటారం […] The post పాలిటెక్నిక్ ప్రవేశాలకు TGPOLYCET–2026 నోటిఫికేషన్ విడుదల appeared first on Navatelangana.

రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం అరిగోస పడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం 70 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం వల్ల మిగతా ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం మానేసి, రైతుల ప్రయోజనాల కోసం పోరాడాలని ప్రభుత్వానికి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే ధాన్యం దించుకుంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు 150 కిలోల వరకు నష్టం వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, వెంకటాపూర్, మిట్టపల్లి, ఎన్సాన్ పల్లి తదితర గ్రామాల నుంచి రైతులు ఫోన్లు చేసి తమ సమస్యలు చెప్తున్నారని పేర

పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి పాలకుర్తి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ రూ.50 వేలు కర్ర అశోక్ రెడ్డిని డిమాండ్ చేశాడు. పెద్ద వంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో హన్మకొండలోని భవానీ నగర్లో సోమవారం ఎసిబి అధికారుల దాడులు నిర్వహించారు.

– పాలకుల మాటలు నీటి మూటలేనా…– అధికారుల నిర్లక్ష్యంతో మిన్నoటుతున్న నిరసనలు…నవతెలంగాణ – కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి సొంత మండలం అయిన కాటారంలో రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు, రోజుల తరబడి అక్కడే పడిగాపులు కాస్తూ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన […] The post మంత్రి ఇలాఖాలో అరిగోస పడుతున్న అన్నదాతలు appeared first on Navatelangana.


నవతెలంగాణ–కాటారం : స్థానిక గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల కాటారంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సోమోజి ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రాంతీయ సమన్వయ అధికారి టి. హరిసింగ్ ఆదేశాల మేరకు ఈ ప్రవేశ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని […] The post గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు డీజిల్ ధరల పెంపుదల ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీన చమురు సంస్థలు సోమవారం మరో మారు ఇంధన ధరలు పెంచాయి. పెట్రోలుపై లీటరుకు రూ 2.61 పైసలు, డీజిల్‌పై లీటరుకు రూ 2.71పైసలు చొప్పున పెంచారు. రెండు వారాల కన్నా తక్కువ వ్యవధిలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం ఇది నాలుగోసారి అయింది. గల్ఫ్ నుంచి చమురు సరఫరాలో ఆటంకాల ప్రభావం వీడకుండా వినియోగదారుడిపై పడుతోంది. ఇప్పుడు పెరిగిన రేట్లతో దేశంలో దాదాపుగా అన్ని నగరాలలో పెట్రోలు ధర లీటరకు రూ.100 దాటింది. దీనికి స్థానిక పన్నులు అదనం . ఇక డీజిల్ ధర కూడా నెమ్మదిగా శతకానికి చేరుకొంటోంది. ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా పెట్రోలు డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నారు. ఇంతకాలం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు విపరీత ధరల ప్రభావం ఇక్కడి సగటు మనిషిపై పడకుండా చేశారని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సవరణలకు దిగామని చమురు సంస్థలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం, బిజెపి వర్గాలు ధరల పెంపుదల దశల్లో మనదేశంలోనే రేట్లు తక్కువ అనే విషయాన్ని గణాంకాలతో తెలియచేస్తున్నాయి. ఇప్పటి పెంపుదల తరువాత ఢిల్లీలో పెట్రోలు రేటు లీటరుకు రూ 102.12 పైసలు అయింది. డీజ

లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ గ్రామంలో సోమవారం జరిగిన వీధికుక్కల దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మారే రాములమ్మ (50) రోజువారీ పనుల కోసం పొలానికి వెళ్తుండగా కుక్కల గుంపు ఆమెపై దాడి చేసింది. ఆమెను కుక్కలు పలు చోట్ల తీవ్రంగా కొరకడంతో పాటు తల భాగాన్ని చిధ్రం చేశాయి. ఆమె కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమికొట్టి రాములమ్మను వెంటనే 108 వాహనంలో సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాములమ్మ మృతిచెందింది. గత కొంతకాలంగా గ్రామంలో వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని, అవి గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని వీధికుక్కలను నిర్మూలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

న్యూఢిల్లీ ః నటి ట్విషా శర్మ వివాదాస్పద మృతి కేసులో న్యాయస్థానంపై తప్పుడు ప్రచారం బాధాకరం అని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను తాము రక్షిస్తున్నామనే విధంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇది చాలా తప్పు అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం తెలిపింది. ట్విషా శర్మ మృతి కేసుపై సమగ్ర, నిష్పక్షపాత, స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చేస్తామని సిజెఐ హామీ ఇచ్చారు. ఈ నెల 12న భోపాల్‌లో అత్తవారింట్లో మిసెస్ శర్మ మృతి చెందారు. ఆత్మహత్యగా దీనిని ముందు తేల్చారు. అయితే వరకట్నం వేధింపుల క్రమంలోనే భర్త , అత్త ఇతరుల వత్తిళ్లతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని పుట్టింటి వారు ఫిర్యాదు చేశారు. దీనితో ట్విషా శర్మ మృతదేహానికి ఇటీవలే పోస్టుమార్టం జరిగింది. సోమవారం నిదేదిక రావల్సి ఉంది. భర్త సమర్ధ్ సింగ్ లాయర్, అత్తగారు పూర్వపు జడ్జి కావడంతో నిందితులను కోర్టులు రక్షిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. దయచేసి మీడియా ఇటువంటి విషయాలలో స్వయం నియంత్రణ పాటించాల్సి ఉంది. కేసు విచారణ వివరాలు నిర్థారణ లేకుండా వెలుగులోకి తేరాదు. తెచ్చే క్రమంలో న్యాయస్థానాన్ని కానీ ఇతరులను కూడా వేదనకు గురి చేసే విధంగా

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎపి ప్రభుత్వం హైదరాబాద్‌లో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జనసేన పార్టీ, ఎపి పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కు కవిత మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

– సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బృందం – సామినేని రామారావు సతీమణి సామినేని స్వరాజ్యం – సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండల పరిధిలోనే పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సామినేని రామారావుని హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) రాష్ట్ర బృందం సోమవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ముఖ్యమంత్రి కార్యాలయంలో సోమవారం కలిసి […] The post సిపిఐ(ఎం) నేతను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ -2026 పరీక్ష ప్రాథమిక కీ ని ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే మంగళవారం(మే 26) సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో తెలపవచ్చని తెలిపారు. ఈమెయిల్ లేదా ఏ ఇతర మార్గాల ద్వారా వచ్చే అభిప్రాయాలు స్వీకరించమని స్పష్టం చేసింది. ఈనెల 17న దేశవ్యాప్తంగా రెండు షిఫ్టుల్లో జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో ఈ పరీక్షలు జరిగాయి. పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రం పరీక్ష జరిగిన రోజు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1న తుది కీ, ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.



నవతెలంగాణ-హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ సోమవారం న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సమావేశమై పలు వర్తమాన రాజకీయ అంశాలతో పాటు పశ్చిమాసియా పరిస్థితులపై కీలక చర్చలు చేసింది. ఈ మేరకు పత్రిక ప్రకటన వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఇటీవలి ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న రాజకీయ, సంస్థాగత, సైద్ధాంతిక కారణాలపై కేంద్ర కమిటీ (సీసీ) ప్రాథమికంగా చర్చించింది. కేరళంలో పార్టీ ఓటమికి గల కారణాలపై రాష్ట్ర కమిటీ ఇప్పటికే పార్టీలోని వివిధ […] The post న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) కీలక భేటీ appeared first on Navatelangana.

హైదరాబాద్: ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వాన పడింది. మెదక్, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని ర్యాలమడుగులో ఈదురులాలుల తీవ్రతకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. మంబోజిపల్లిలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచుల్లోనే గెలిచి పాయింట్ల టేబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్థిక్ పాండ్య వల్లే ఇదంతా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి వేరే వాళ్లకి అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వచ్చే సీజన్‌కి ముందు హార్థిక్ ట్రేడ్ అవుతాడనే ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో హార్థిక్ ల్యాప్‌టాప్‌లో ఏదో వీడియో ప్లే అవుతుంది. పక్కనే ఓ నోట్‌బుక్ పెన్ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అతడి మొబైల్ స్క్రీన్‌పై ‘07:07’ అని టైమ్ చూపిస్తోంది. అయితే 07 అనేది ఎంఎస్ ధోనీ జెర్సీ సెంబర్. 07కి సంబంధించి ఏం జరిగినా అది ధోనీ వల్లే అని అతడి ఫ్యాన్స్ ప్రచారం చేస్తుంటారు. మరి హార్థిక్ అలా స్టోరీ పెట్టడం వెనక కారణం వచ్చే సీజన్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ అవుతున్నాడనే సంకేతమా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ స్టోరీలో హార్థిక్.. మహికా శర్మను ట్యాగ్ చేశాడు.

టాలీవుడ్ లో గత వారం పదిరోజులుగా ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం మోగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్ నారాయణ, దిల్‌రాజు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను చిరంజీవికి వివరించినట్లు సమాచారం. అలాగే, పర్సంటేజ్ విధానంలో సినిమాల విడుదలపై చర్చించారు. ఎగ్జిబిటర్ల బృందంతో సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి.. గిల్డ్ నిర్మాతలకు కాల్ చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో గిల్డ్ నిర్మాతలతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్లతో సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. సింగిల్ స్క్రీన్ సమస్యలు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లామని.. మరో రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
