TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

10846 వార్తలు

న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) కీల‌క భేటీ
తెలంగాణ

న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) కీల‌క భేటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ సోమ‌వారం న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సమావేశమై ప‌లు వ‌ర్త‌మాన రాజ‌కీయ అంశాల‌తో పాటు ప‌శ్చిమాసియా పరిస్థితుల‌పై కీల‌క చ‌ర్చ‌లు చేసింది. ఈ మేర‌కు ప‌త్రిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఇటీవలి ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న రాజకీయ, సంస్థాగత, సైద్ధాంతిక కారణాలపై కేంద్ర కమిటీ (సీసీ) ప్రాథమికంగా చర్చించింది. కేరళంలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై రాష్ట్ర కమిటీ ఇప్పటికే పార్టీలోని వివిధ […] The post న్యూఢిల్లీలోని హెచ్‌కెఎస్ సుర్జీత్ భవన్‌లో సీపీఐ(ఎం) కీల‌క భేటీ appeared first on Navatelangana.

వేడి నుంచి ఉపశమనం.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం
తెలంగాణ

వేడి నుంచి ఉపశమనం.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వాన పడింది. మెదక్, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని ర్యాలమడుగులో ఈదురులాలుల తీవ్రతకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. మంబోజిపల్లిలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం..నేలకొరిగిన చెట్లు,విద్యుత్ స్తంభాలు
హర్థిక్ పాండ్యా ఇన్‌స్టా స్టోరీ.. దానికి అర్థం అదేనా..?
తెలంగాణ

హర్థిక్ పాండ్యా ఇన్‌స్టా స్టోరీ.. దానికి అర్థం అదేనా..?

ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 4 మ్యాచుల్లోనే గెలిచి పాయింట్ల టేబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్‌ హార్థిక్ పాండ్య వల్లే ఇదంతా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి వేరే వాళ్లకి అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వచ్చే సీజన్‌కి ముందు హార్థిక్ ట్రేడ్ అవుతాడనే ప్రచారం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యా పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ చిత్రంలో హార్థిక్ ల్యాప్‌టాప్‌లో ఏదో వీడియో ప్లే అవుతుంది. పక్కనే ఓ నోట్‌బుక్ పెన్ ఉన్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అతడి మొబైల్ స్క్రీన్‌పై ‘07:07’ అని టైమ్ చూపిస్తోంది. అయితే 07 అనేది ఎంఎస్ ధోనీ జెర్సీ సెంబర్. 07కి సంబంధించి ఏం జరిగినా అది ధోనీ వల్లే అని అతడి ఫ్యాన్స్ ప్రచారం చేస్తుంటారు. మరి హార్థిక్ అలా స్టోరీ పెట్టడం వెనక కారణం వచ్చే సీజన్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ అవుతున్నాడనే సంకేతమా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ స్టోరీలో హార్థిక్.. మహికా శర్మను ట్యాగ్ చేశాడు.

టాలీవుడ్ లో పర్సంటేజ్ వివాదం.. చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశం
తెలంగాణ

టాలీవుడ్ లో పర్సంటేజ్ వివాదం.. చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశం

టాలీవుడ్ లో గత వారం పదిరోజులుగా ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతల పర్సంటేజ్ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం మోగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్‌ నారాయణ, దిల్‌రాజు, ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్‌ విధానంలో నష్టాలను చిరంజీవికి వివరించినట్లు సమాచారం. అలాగే, పర్సంటేజ్‌ విధానంలో సినిమాల విడుదలపై చర్చించారు. ఎగ్జిబిటర్ల బృందంతో సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి.. గిల్డ్‌ నిర్మాతలకు కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో గిల్డ్‌ నిర్మాతలతో చిరంజీవి సమావేశం కానున్నారు. ఎగ్జిబిటర్లతో సమావేశం అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. సింగిల్‌ స్క్రీన్‌ సమస్యలు చిరంజీవి దృష్టికి తీసుకెళ్లామని.. మరో రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తల్లి ప్రేమ.. ప్రాణాలు పణంగా పెట్టి.. బిడ్డ కోసం సముద్రంలో దూకేసింది
కాక్రోచ్ జ‌న‌త పార్టీ..మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు
తెలంగాణ

కాక్రోచ్ జ‌న‌త పార్టీ..మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాక్రోచ్ జ‌న‌త పార్టీ అధినేత అభిజిత్‌కు, కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజుకు ఆన్‌లైన్ వేదిక‌గా మాట‌ల యుద్ధం కొన‌సాగిన విష‌యం తెలిసిందే. కాక్రోచ్ మ‌ద్ద‌తుదారులంతా పాక్ చెందిన వార‌ని కేంద్ర‌మంత్రి ఎద్దేవా చేశారు. దానికి అభిజిత్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇండియాకు చెందిన వారే 94శాతం త‌మ‌కు అండ‌గా ఉన్నార‌ని స‌మాధానం ఇచ్చారు. తాజాగా మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియాలో ట్రేండ్ అవుతున్న ప్ర‌తి అంశంపై స్పందిచాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప్ర‌స్తుతం ముఖ్య […] The post కాక్రోచ్ జ‌న‌త పార్టీ..మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు appeared first on Navatelangana.

30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కి గుండెపోటు..
తెలంగాణ

30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కి గుండెపోటు..

స్పెయిన్‌లో ఓ విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పంచుకుంది. 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తుండగా.. ఒక్కసారిగా పైలట్‌కు గుండొపోటు వచ్చింది. ఇది గమనించిన కో-పైలట్ వెంటనే ఫ్రాన్సిస్కో ర సా కార్నీరో ఎయిపోర్టుకు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. వెంటనే పైలట్‌‌కు తగిన వైద్య సాయం అందించారు. అసలేం జరిగిందటే.. శుక్రవారం తెల్లవారుజామున జెట్2 విమానం స్పెయిన్‌లోని టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది. 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్‌కు గుండెపోటు వచ్చినట్లు కో పైలల్ గుర్తించాడు. వెంటనే దగ్గర్లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. విమానం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయానికి అధికారులు అత్యవసర వైద్య ఏర్పాట్లు చేశారు. వెంటనే పైలట్‌కు వైద్యసాయం అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం 220 మంది ప్రయాణికులు ఉన్నారు.

కొత్త రంగుల్లో ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125
తెలంగాణ

కొత్త రంగుల్లో ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125

కొత్త స్కూటీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! టీవీఎస్ తన జనాదరణ పొందిన జూపిటర్ 125ను మరింత స్టైలిష్‌గా మార్చేందుకు రెండు కొత్త అందమైన రంగులలో విడుదల చేసింది. భారత మార్కెట్లోనే హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే ఈ రెండవ మోడల్ జూపిటర్..హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 వంటి స్కూటర్లతో నేరుగా పోటీపడుతుంది. కొనుగోలుదారుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా టీవీఎస్ జూపిటర్ 125 అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో డ్రమ్-అల్లాయ్, డిస్క్, డీటీ ఎస్‌ఎక్స్‌సీ, టాప్-స్పెక్ స్మార్ట్‌కనెక్ట్ ఉన్నాయి. కంపెనీ 'ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్', 'ఐవరీ ఎలైట్ గ్రీన్' అనే రెండు కొత్త రంగులను విడుదల చేసింది. ముఖ్యంగా, ఈ రెండు కొత్త షేడ్స్ కేవలం జూపిటర్ 'డీటీ ఎస్‌ఎక్స్‌సీ' వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ జూపిటర్ 125 కొత్త 'డీటీ ఎస్ఎక్స్సీ' వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.86,750. నివేదికల ప్రకారం, ఈ వేరియంట్‌లోని అన్ని రంగులు ఈ ధరకే లభిస్తాయి. అత్యంత చౌకైన జూపిటర్ 125 మోడల్ 'డ్రమ్-అలాయ్'. ఇది ఇండిబ్లూ, వైట్, టైటానియం గ్రే అనే మూడు రంగులలో వస్తుంది. టాప్-స్పెక్ '

నా కూతురి వేధింపులు భరించలేకపోతున్న..నన్ను చావనివ్వండి సార్..ప్రజావాణిలో వృద్ధురాలి ఆవేదన
Chiranjeevi: చిరంజీవితో ముగిసిన నిర్మాతల, ఎగ్జిబిటర్ల భేటీ.. చర్చలు ఎలా జరిగాయంటే?
చికెన్ 65 అని ఎందుకు అంటారు తెలుసా ? చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో  హిట్ అయ్యింది..
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..తమిళనాడు అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదం
తెలంగాణ

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..తమిళనాడు అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. మదురాంతకం ఎమ్మెల్యే మరకతం కుమారవేల్, ధారపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందరై ఎమ్మెల్యే జయకుమార్ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జెసిడి. ప్రభాకరన్‌కు తమ రాజీనామా లేఖలు అంద‌జేశారు. తాజాగా స‌దురు ఎమ్మెల్యేల రాజీనామాల‌ను ఆమోదించారు. అసెంబ్లీ రూల్స్ ప్ర‌కారం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు. The post ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..తమిళనాడు అసెంబ్లీ స్పీక‌ర్ ఆమోదం appeared first on Navatelangana.

సంక్షోభం అంచున భారత ఆర్థిక వ్యవస్థ.. ఎరువులపై సబ్సిడీ విధానం మార్చాల్సిందే: అగ్రి ఎకానమిస్ట్
ప్రజాసమస్యల పరిష్కారంకై సీఎంతో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భేటీ
తెలంగాణ

ప్రజాసమస్యల పరిష్కారంకై సీఎంతో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భేటీ

నవతెలంగాణ-హైదరాబాద్ : పంటల కొనుగోలు చేయాలని, కార్మికులకు కనీస వేతనాల సవరణ, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సీఎం రేవంత్ రెడ్డికి మెమోరాండం ఇచ్చారు. పంటల కొనుగోలుతెలంగాణలో యాసంగి పంటల కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 140 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ యిచ్చింది. 8,576 […] The post ప్రజాసమస్యల పరిష్కారంకై సీఎంతో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు భేటీ appeared first on Navatelangana.

ఫ్యాటీ లివర్‌ సమస్యను దూరం చేసే అలవాట్లు..
తెలంగాణ

ఫ్యాటీ లివర్‌ సమస్యను దూరం చేసే అలవాట్లు..

ఈరోజుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం సర్వసాధారణమైపోయింది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. మరి ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా అని చాలామంది చర్చించుకుంటున్నారు. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించవచ్చు లేదా తొలగించవచ్చు. అయితే, ఈ పరిస్థితి ఫైబ్రోసిస్‌కు దారితీయకపోతే, లివర్ సిర్రోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనివల్ల కాలేయ మార్పిడి చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్య ఉంటె ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. కాలేయ ఆరోగ్యంలో మెరుగుదల స్థాయిని సూచించే SGPT పరీక్షను నెలవారీగా చేయించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో కాలేయం నుండి కొవ్వును గణనీయంగా తగ్గించడానికి లేదా తొలగించడానికి ఉపయోగపడే చిట్కాలు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం. 5,000 నుండి 7,000 అడుగులు వారానికి ఒక వ్యాయామ ప్రణాళికను రూపొందించుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇందులో ఐదు రోజులు వేగంగా నడవడం, రెండు రోజులు బలవర్ధక వ్యాయామాలు చేయడం మంచిది. అలాగే భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నడవడం వంటి దినచర్యను క

వేసవి అంటే విశ్రాంతి కాదు… వికాసం
‘రాజీ’పడలేకే రాజీనామా!?
రాజస్థాన్‌లో నీటి కొర‌త‌..కాంగ్రెస్ ఆందోళ‌న‌లు
తెలంగాణ

రాజస్థాన్‌లో నీటి కొర‌త‌..కాంగ్రెస్ ఆందోళ‌న‌లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌‌లో తీవ్రస్థాయిలో నీటి కొరత నెలకొనడంతో రాజస్థాన్‌ ‌ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. వేసవిలో గొంతెండుతున్నా.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తాగడానికి మంచినీరందించడం లేదు. నీటి కొరతపై నిరసనగా రాజస్థాన్‌‌లోని కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం రాజధాని జైపూర్‌‌లోని జల్‌ ‌భవన్‌ ‌వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కాంగ్రెస్‌‌ మాజీ మంత్రి ప్రతాప్‌ ‌సింగ్‌ ‌కచారియావాస్‌ ‌నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా కచారియావాస్‌ ‌మీడియాతో మాట్లాడుతూ.. ‘తాగునీటిని అందించలేని […] The post రాజస్థాన్‌లో నీటి కొర‌త‌..కాంగ్రెస్ ఆందోళ‌న‌లు appeared first on Navatelangana.

హైదరాబాద్ సిటీలో ఓ వైపు ఎండ.. మరో వైపు భారీ వర్షం
భూ వివాదంలో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కల్పించమని కలెక్టర్కు రిక్వెస్ట్
గుడ్ న్యూస్ : మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, సూపర్ బజార్లు : సీఎం రేవంత్ రెడ్డి
మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది: రేవంత్
తెలంగాణ

మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది: రేవంత్

హైదరాబాద్: మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామీణ మహిళలకు ఆర్థిక, సామాజిక, పరిపాలనా కేంద్రాలుగా మహిళా భవనాలు నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్త్రీశక్తి, అంగన్ వాడి భవనాలు, సోలార్ ఆర్టిసి బస్సులను ఈ వారంలో ప్రారంభించుకున్నామని అన్నారు. 8 వేల ఇందిరా స్ర్తీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు. రెండున్నరేళ్లలోనే ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం జరిగిందని, రూ. 5లక్షల నుంచి రూ.10 లక్షలకు వడ్డీ లేని రుణాలు పెంచి మహిళా సంఘాలకు అందిస్తున్నామని అన్నారు. మహిళలను అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని రేవంత్ పేర్కొన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కొందరు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడాలని జిల్లా