TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

10832 వార్తలు

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన సామ్
తెలంగాణ

‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన సామ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ .. “మా ఇంటి బంగారం సినిమాలో ప్రతీ భావోద్వేగం ఉంటుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ... అన్ని అంశాలుంటాయి” అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాలోని యాక్షన్, కామెడీ, ఎమోషన్... ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు.

Adminమే 25, 2026 - సోమవారం👁 4
అబిడ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంగం..హెల్మెట్ లేదని అడిగినందుకు హోంగార్డుపై దాడి, పీఎస్ లో ఫర్నిచర్ ధ్వంసం
మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు: హరీష్‌రావు
తెలంగాణ

మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు: హరీష్‌రావు

కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పిసిసి హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీసారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. వారంలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే, మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.రవాణా రంగం తీవ్ర సంక

ఎన్ని ఆదేశాలు..ఎన్నిసార్లు మందలింపులు: నీట్‌ పేపర్ లీక్ పై సుప్రీం సీరియస్
తెలంగాణ

ఎన్ని ఆదేశాలు..ఎన్నిసార్లు మందలింపులు: నీట్‌ పేపర్ లీక్ పై సుప్రీం సీరియస్

ఎన్‌టిఎ ఇంకా బుద్ధి రానట్లే ..అదే పాత తంతు కేంద్రం , ఎన్‌టిఎ, సిబిఐలకు సమన్లుగురువారంలోగా వివరణకు గడువు పర్యవేక్షక కమిటీ చెప్పినా మీరు మారరా? న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్ష పత్రాల లీక్ అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. అత్యంత కీలక పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ఎన్‌టిఎ ఇప్పటికీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. చాలా సాదాసీదాగా వ్యవహరిస్తోందని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. లక్షలాది మంది విద్యార్థుల భవితకు ఎన్నిసార్లు పరీక్షలు పెడుతారు? మీ పద్ధతి బాగాలేదని ఎన్‌ఎటిని కడిగిపారేసిన సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రానికి, ఎన్‌టిఎకు సిబిఐకి సమన్లు పంపించింది. ఎన్‌టిఎను రద్దు చేసి, ఈ వ్యవస్థ స్థానంలో సమగ్ర కట్టుదిట్టమైన , స్వయంప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు కావాలి. ఈ సంస్థ ద్వారానే మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్రం, ఎన్‌టిఎ, సిబిఐలు సమాధానం ఇచ్చుకోవాలని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇతరులతో పాటు పిటిషన్ ప్రతులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందించాలని తెలి

మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం..
తెలంగాణ

మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం..

– ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళా వారోత్సవాలునవతెలంగాణ – కాటారంగర్భిణీలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రక్తహీనత (అనీమియా) నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలని సీ డి పీ ఓ రాధిక మహిళాలకు సూచించారు. కాటారం గ్రామపంచాయతి పరిధిలోని ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో 99 డేస్ ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన మహిళా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై […] The post మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం.. appeared first on Navatelangana.

రాష్ట్రంలో దండపాళ్యం బ్యాచ్ పాలన: కెటిఆర్
తెలంగాణ

రాష్ట్రంలో దండపాళ్యం బ్యాచ్ పాలన: కెటిఆర్

రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ పాలన కొనసాగుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేండ్లయినా ఏ ఒక్క సంక్షేమాన్ని అమలుచేయలేదని విమర్శించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఫ్లై ఓవర్లను, టిమ్స్ భవనాలను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించడం తప్పితే ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా చేపట్టారా అని ప్రశ్నించారు. 65 ఏండ్ల దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చెత్తపాలన చూసిన దేశ ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటుంటే తెలంగాణ ప్రజలు దరిద్రాన్ని నెత్తినెత్తుకొని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో రూ.వేల కోట్లు వెచ్చించి ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌లను వేసి నీటి సమస్యను మెరుగుపర్చామని, తిరిగి అధికారంలోకి వస్తే నగరంలో నిరంతర నీటి సరఫరా చేసే బాధ్యత తనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కూకట్‌పల్లి ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎ కెపి వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కె.నవీన

గాంధీలో జూడాల ధర్నా
తెలంగాణ

గాంధీలో జూడాల ధర్నా

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు తనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఐఎంసీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు శివశంకర్‌పై రోగి అటెండర్ మౌనిక మెర్లిన్ దాడికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు చెప్తున్న సమయంలో మౌనిక మెర్లిన్ నిరంతరాయంగా వీడియో కాల్‌లో మాట్లాడుతుండటంతో డాక్టర్ ఆమెను వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ వైద్యుడిని ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యుడు ఆమె ఫోన్‌ను తీసుకుని డ్యూటీ సిస్టర్‌కు అప్పగించగా, మరింత ఆగ్రహించిన మౌనిక మెర్లిన్ డాక్టర్ శివశంకర్‌పై చేతులతో దాడిచేసింది. ఘటనలో వైద్యుడి కళ్లజోడు పగిలిపోగా, నుదుటిపై గాయాలయ్యాయి. దీంతో వార్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పోలీస

చాక్లెట్ ఆశచూపి బాలికపై అఘాయిత్య యత్నం
తెలంగాణ

చాక్లెట్ ఆశచూపి బాలికపై అఘాయిత్య యత్నం

చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నిజామాబాద్ 6 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అసద్ బాబానగర్‌కు చెందిన ఒక వ్యక్తి బాలికను చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. ఆ చిన్నారిని బలవంతంగా పక్కకు లాక్కెళ్లి, ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుమార్తె చెప్పిన మాటలు విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక 6 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
తెలంగాణ

44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

మండలంలోని చంద్రన్‌పల్లి పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి వైపు నుంచి ఇందల్వాయి వైపు వస్తున్న ఒక లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ టైర్ పేలి రోడ్డుపై అకస్మాత్తుగా నిలిచిపోవడంతో, అదే వేగంతో వెనుక నుంచి వస్తున్న ఏడు కార్లు, మరో మూడు లారీలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇందల్వాయి ఎస్‌ఐ సందీప్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాద వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ఘ‌నంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన కెటిఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు
తెలంగాణ

సొంత చెల్లి, బావ ఫోన్లు ట్యాప్ చేసిన కెటిఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు

సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన కెటిఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ వేదికగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుంది కెటిఆర్ అంటూ మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌లో ఉంటే ఏం తెలుస్తుంది? జూన్ 1వ తేదీన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని, హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని మే 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని మంత్రి పొంగులేటి ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మీరు

అంకుశాపూర్‌లో వడదెబ్బతో వ్యక్తి మృతి..
తమిళనాడులో కటౌట్లు పెట్టి సీఎం అయ్యారు..ఇక్కడ  నన్ను15 ఏళ్లు రోడ్డు మీద దేకించారు: ఏపీ డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్
ఎసిబికి చిక్కిన రికార్డ్ అసిస్టెంట్
తెలంగాణ

ఎసిబికి చిక్కిన రికార్డ్ అసిస్టెంట్

మనతెలంగాణ, సిటిబ్యూరోః రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా రికార్డ్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్. శివానంద్ అమీర్‌పేటలోని డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ విరమణ చేసిన మహిళా పింఛన్ బెనిఫిట్స్ ఫైల్ పైఅధికారులకు పంపించేందుకు రూ.20వేలు ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. దీంతో మహళా ఉద్యోగి కుమారుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు రికార్డ్ అసిస్టెంట్‌కు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కొత్త డిజైన్లతో నాలుగు ఇందిరమ్మ చీరలు..
తెలంగాణ

కొత్త డిజైన్లతో నాలుగు ఇందిరమ్మ చీరలు..

గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికి నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సిఎం అన్నారు. ఈ సందర్భంగా చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సిఎం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని సిఎం పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారన్న విమర్శలు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని సిఎం

చిరంజీవి నివాసంలో సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ
తెలంగాణ

చిరంజీవి నివాసంలో సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీనిపై చర్చించేందుకు సోమవారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతోపాటు ఎగ్జిబిటర్స్ చేరుకున్నారు. పర్సంటేజ్ విధానంపై చిరంజీవితో వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సునీల్ నారంగ్, బాలగోవింద్, అనుపమ్ రెడ్డి, […] The post చిరంజీవి నివాసంలో సినీ ప్ర‌ముఖుల కీల‌క భేటీ appeared first on Navatelangana.

అమిత్ షాను కలిసింది అందుకే..దారినపోయే వాళ్లు రాళ్లేస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్
అస్సాం అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
తెలంగాణ

అస్సాం అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అస్సాం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో సోమవారంనాడు ప్రవేశపెట్టింది. బహుభార్యాత్వాన్ని నిషేధించడం, బాల్యవివాహాల కట్టడి, సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిచేయడం, విడాకులు, వారసత్వానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున ‘ది యూనిఫాం సివిల్ కోడ్, అస్సాం2026 బిల్లును’ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, లివ్-ఇన్ రిలేషన్‌కు సంబంధించిన చట్టాలను ఏకీకరించి, సరళీకరించడం ఈ బిల్లు లక్ష్యం. పురుషులకు వివాహ వయస్సు కనిష్టంగా 21 ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు. బహుభార్యాత్వాన్ని నిరోధిస్తుంది’ అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ బిల్లులో వివరించారు. తొలిసారి సహజీవనానికి చట్టబద్ధత కల్పించామని, రిజిస్ట్రేషన్ ద్వారా భాగస్వామల హక్కులకు పరిరక్షణ లభిస్తుందని, వారికి పుట్టే పిల్లలకు గుర్తింపు, రక్షణ ఉంటుందని చెప్పారు. అస్సాంలోని గిరిజనులను బిల్లు నుంచి మినహాయించినట్టు పేర్కొన్నారు.

కక్రోచ్ పార్టీపై దర్యాప్తు పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
తెలంగాణ

కక్రోచ్ పార్టీపై దర్యాప్తు పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతాపార్టీ (సిజెపి) పై సత్వర దర్యాప్తు పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థలపై వ్యంగ్మాత్మక విమర్శలతో ఏర్పాటు అయిన డిజిటల్ వేదిక పార్టీ సిజెపి ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపుతూ, సునామీకి దారితీసింది. నకిలీ న్యాయవాదులున్నారనే ఆరోపణలపై, సిజెపి సంబంధిత కార్యకలాపాలపై కలిసికట్టుగా తక్షణ దర్యాప్తు జరగాల్సి ఉంది. దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్‌కె గోస్వామి బెంచ్‌కు తెలియచేశారు.ఈ పార్టీ ఏర్పాటు ఇతర విషయాలపై మరీ అంతగా భావోద్వేగానికి గురి కావద్దని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్కా బాగ్చితో కూడిన ధర్మాసనం న్యాయవాదికి హితవు పలికింది. ఓ కేసు విషయంలో సిజెఐ చేసిన వ్యాఖ్యల ప్రాతిపదికనే బొద్దింకల పార్టీ ఏర్పాటు, అతి కొద్ది రోజుల్లోనే ప్రధాన జాతీయ పార్టీలకు దీనితో సంకట స్థితి ఏర్పడిన దశలో సిజెఐ బెంచ్ ముందుకే కేసు వచ్చింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఓ వైపు సిజెఐ వివరణ ఇచ్చారు. సందర్భాన్ని వేరే విధంగా అన్వయించుకోరాదని తెలిపారు. అయినప్పటికీ పార్టీ పేరిట ఓ వర్గం భారీ స్థాయిలో తప్పుడు, విద్వేషకర ప్రచారం సాగిస్తోందని

బిజెడికి ఎంపి దేబాశిశ్ రాజీనామా
తెలంగాణ

బిజెడికి ఎంపి దేబాశిశ్ రాజీనామా

ఒడిశాలో మాజీ సిఎం నవీన్ పట్నాయక్ పార్టీ బిజెడి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి దేబాశిష్ సమంతరాయ్ సోమవారంనాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపి పదవికి రాజీననామా చేశారు. సంబంధిత లేఖను నవీన్ పట్నాయక్‌కు పంపారు. పార్టీలో తనకు తగినంత గుర్తింపు లేకపోవడం, తన సేవలు పార్టీకి అంతగా అవసరం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడుగా సమంతరాయ్‌కి పేరుంది. సమంతరాయ్ కంటే ముందు జెడియు రాజ్యసభ సభ్యులు సుజీత్ కుమార్, మమతా మహంతలు ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం బిజెపి టిక్కెట్‌పై ఇద్దరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాగా, సమంతరాయ్ బిజెపిలో చేరే అవకాశాలున్నాయని, ఆయన చేరగానే పార్టీ మద్దతుతో తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతారని తెలుస్తోంది.

వర్చువల్ విధానంలో మహిళా సంఘాల భవనాలకు సీఎం ఓపెనింగ్
తెలంగాణ

వర్చువల్ విధానంలో మహిళా సంఘాల భవనాలకు సీఎం ఓపెనింగ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మహిళా వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఏకంగా 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల (SHG) భవనాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు. ఈ ఉన్నత స్థాయి వర్చువల్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో పాటు కీలక అధికారులు, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. […] The post వర్చువల్ విధానంలో మహిళా సంఘాల భవనాలకు సీఎం ఓపెనింగ్ appeared first on Navatelangana.

పాలిటెక్నిక్ ప్రవేశాలకు TGPOLYCET–2026 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ

పాలిటెక్నిక్ ప్రవేశాలకు TGPOLYCET–2026 నోటిఫికేషన్ విడుదల

నవతెలంగాణ-కాటారం : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే TGPOLYCET–2026 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ తదితర ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొదటి దశ కౌన్సిలింగ్ మే 27 నుంచి జూన్ 9 వరకు, ఫైనల్ ఫేజ్ జూన్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాటారం […] The post పాలిటెక్నిక్ ప్రవేశాలకు TGPOLYCET–2026 నోటిఫికేషన్ విడుదల appeared first on Navatelangana.

వడ్ల కొనుగోళ్లు లేక రైతుల అరిగోస: హరీశ్‌రావు
తెలంగాణ

వడ్ల కొనుగోళ్లు లేక రైతుల అరిగోస: హరీశ్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగం అరిగోస పడుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుండగా, ప్రభుత్వం 70 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం వల్ల మిగతా ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం మానేసి, రైతుల ప్రయోజనాల కోసం పోరాడాలని ప్రభుత్వానికి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు బస్తాకు 43 కిలోలు పెడితేనే ధాన్యం దించుకుంటామని రైతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు 150 కిలోల వరకు నష్టం వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, వెంకటాపూర్, మిట్టపల్లి, ఎన్సాన్ పల్లి తదితర గ్రామాల నుంచి రైతులు ఫోన్లు చేసి తమ సమస్యలు చెప్తున్నారని పేర

ఎసిబి వలలో ఇరిగేషన్ డీఈ