10816 వార్తలు

సకాలంలో ధాన్యం తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, సరైన లారీలను పంపకపోవడంతో జిల్లాలోని రైతు లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సోమవారం నాడు పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలిపారు. దాదాపు నెల నుంచి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో సరైన వాహనాలు రాక రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. క్లస్టర్ల నిర్ల క్ష్యం మిల్లర్ల అలసత్వంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మరో పక్క జిల్లా కలెక్టర్ తోపా టు సివిల్ సప్లై అధికారులు ప్రతిరోజు సుడిగాలి పర్యటన చేస్తూ ధాన్యం తరలించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నప్పటికీ సకాలంలో లారీలు లేకపోవడంతో వా రు కూడా మిల్లర్లపై త్వరితగతిన ధాన్యం లోడ్‌లు దింపుకోవాలని ఒత్తిడి తేస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినప్పటికీ మిల్లర్లకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు మొద్దు నిద్రలోనే ఉన్న దుస్థితి జిల్లాలో నెలకొంది. కలెక్టర్ నేరుగా కొనుగోలు కేంద్రాలు, మిల్లులు సందర్శించి పదిరోజుల్లో సీజన్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. రైతు లు ఎవరూ ఆందోళన చెందవద్దని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం చివరి గింజవరకు మిల్లుకు తరలించే బా

శ్మీర్‌లో సోమవారం 300 మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుపడి గంటల తరబడి భూమ్యాకాశాల మధ్య కొట్టుమిట్టాడారు. దాదాపు ఏడుగంటల పాటు త్రిశంకు స్వర్గంగా గడిపిన వీరిని బహుళ స్థాయి సహాయక బృందం అతి కష్టం మీద సురక్షితంగా కిందికి చేర్చింది. గుల్మార్గ్‌లోని గొండోలాలో విహారయాత్రకు వచ్చే వారు కేబుల్ కార్లలో వెళ్లుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో 65 క్యాబిన్ల కేబుల్ కారు ముందుకు కదలక మధ్యలోనే మొరాయించింది. పర్యాటకుల హాహాకారాలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఏడు గంటల పాటు దిక్కుతోచని స్థితిలో పడ్డ వీరి గురించి సమాచారం తెలియగానే పలు సహాయక నిపుణుల బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు, ఆర్మీ వెంటరాగా అక్కడి తక్షణ రెస్కూ టీంలు తరలివచ్చి ఏడుగంటలు శ్రమించి కేబుల్ కారు ముప్పు నుంచి పర్యాటకులను రక్షించారు. భూ మట్టానికి 500 అడుగుల ఎత్తున యాత్రికులు చిక్కుపడ్డారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఎన్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్రానికి చెందిన ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసు, సైన్యానికి చెందిన చినార్ దళాలు రంగంలోకి దిగి సంయుక్తంగా జరిపిన చర్యలతోనే వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. సుశిక్షితులు రంగంలోకి దిగి




నవ తెలంగాణ-మల్హర్‌రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని తాడిచర్ల కాపురం గ్రామాల జెన్కో భూనిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు కేసరపు రవి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మానేరులో జేసీబీలతో భారీ స్థాయిలో ఇసుక తవ్వి, ట్రాక్టర్లు,లారీల ద్వారా ఖాసింపల్లి,జంగెడు,భూపాలపల్లి, హనుమకొండ,హైదరాబాద్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెప్పారు. అక్రమ తవ్వకాల కారణంగా మానేరు ప్రాంతం భారీ గుంతలమయంగా మారుతోందని,పర్యావరణ […] The post తాడిచెర్ల మానేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు appeared first on Navatelangana.

నవతెలంగాణ-మల్హర్‌రావు: జాతీయ మహిళ దినోత్సవంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య అధ్యక్షతన అంగన్ వాడి సూపర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహళలు,కిశోర బాలికల,పిల్లల పోషక స్థితిని మెరుగు పరచడం,పోషకాహర లోపం,రక్తహీనత,ఎదుగుదల లోపం,తక్కువ బరువుతో పుట్టె శిశువుల సమస్యలపై అవగాహన నిర్వహించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా వారోత్సవ కార్యాచరణ,మహిళల భద్రతకు,ఆహార పధార్థాలతో ఆరోగ్యకరమైన పోషణ విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని […] The post మల్లారంలో ఘనంగా మహిళ వారోత్సవాలు appeared first on Navatelangana.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ .. “మా ఇంటి బంగారం సినిమాలో ప్రతీ భావోద్వేగం ఉంటుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ... అన్ని అంశాలుంటాయి” అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాలోని యాక్షన్, కామెడీ, ఎమోషన్... ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు.


కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి, ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్‌పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పిసిసి హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని నిలదీసారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు. వారంలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే, మరోవైపు రేవంత్ రెడ్డి రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.రవాణా రంగం తీవ్ర సంక

ఎన్‌టిఎ ఇంకా బుద్ధి రానట్లే ..అదే పాత తంతు కేంద్రం , ఎన్‌టిఎ, సిబిఐలకు సమన్లుగురువారంలోగా వివరణకు గడువు పర్యవేక్షక కమిటీ చెప్పినా మీరు మారరా? న్యూఢిల్లీ : నీట్ యుజి పరీక్ష పత్రాల లీక్ అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. అత్యంత కీలక పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న ఎన్‌టిఎ ఇప్పటికీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. చాలా సాదాసీదాగా వ్యవహరిస్తోందని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. లక్షలాది మంది విద్యార్థుల భవితకు ఎన్నిసార్లు పరీక్షలు పెడుతారు? మీ పద్ధతి బాగాలేదని ఎన్‌ఎటిని కడిగిపారేసిన సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రానికి, ఎన్‌టిఎకు సిబిఐకి సమన్లు పంపించింది. ఎన్‌టిఎను రద్దు చేసి, ఈ వ్యవస్థ స్థానంలో సమగ్ర కట్టుదిట్టమైన , స్వయంప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు కావాలి. ఈ సంస్థ ద్వారానే మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్రం, ఎన్‌టిఎ, సిబిఐలు సమాధానం ఇచ్చుకోవాలని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇతరులతో పాటు పిటిషన్ ప్రతులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందించాలని తెలి

– ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళా వారోత్సవాలునవతెలంగాణ – కాటారంగర్భిణీలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రక్తహీనత (అనీమియా) నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవాలని సీ డి పీ ఓ రాధిక మహిళాలకు సూచించారు. కాటారం గ్రామపంచాయతి పరిధిలోని ఎర్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో 99 డేస్ ప్రణాళికలో భాగంగా సోమవారం నిర్వహించిన మహిళా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై […] The post మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం.. appeared first on Navatelangana.

రాష్ట్రంలో దండుపాళ్యం బ్యాచ్ పాలన కొనసాగుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేండ్లయినా ఏ ఒక్క సంక్షేమాన్ని అమలుచేయలేదని విమర్శించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ఫ్లై ఓవర్లను, టిమ్స్ భవనాలను, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించడం తప్పితే ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నైనా చేపట్టారా అని ప్రశ్నించారు. 65 ఏండ్ల దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చెత్తపాలన చూసిన దేశ ప్రజలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటుంటే తెలంగాణ ప్రజలు దరిద్రాన్ని నెత్తినెత్తుకొని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. గత పదేళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో రూ.వేల కోట్లు వెచ్చించి ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్‌లను వేసి నీటి సమస్యను మెరుగుపర్చామని, తిరిగి అధికారంలోకి వస్తే నగరంలో నిరంతర నీటి సరఫరా చేసే బాధ్యత తనే తీసుకుంటానని హామీ ఇచ్చారు. కూకట్‌పల్లి ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎంఎల్ఎ కెపి వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు కె.నవీన

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు తనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై రోగి సహాయకురాలు దాడిచేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ ఐఎంసీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యుడు శివశంకర్‌పై రోగి అటెండర్ మౌనిక మెర్లిన్ దాడికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. రోగి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు చెప్తున్న సమయంలో మౌనిక మెర్లిన్ నిరంతరాయంగా వీడియో కాల్‌లో మాట్లాడుతుండటంతో డాక్టర్ ఆమెను వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తూ వైద్యుడిని ఫోన్‌లో చిత్రీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యుడు ఆమె ఫోన్‌ను తీసుకుని డ్యూటీ సిస్టర్‌కు అప్పగించగా, మరింత ఆగ్రహించిన మౌనిక మెర్లిన్ డాక్టర్ శివశంకర్‌పై చేతులతో దాడిచేసింది. ఘటనలో వైద్యుడి కళ్లజోడు పగిలిపోగా, నుదుటిపై గాయాలయ్యాయి. దీంతో వార్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పోలీస

చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.నిజామాబాద్ 6 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘాతుకం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలిక ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అసద్ బాబానగర్‌కు చెందిన ఒక వ్యక్తి బాలికను చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. ఆ చిన్నారిని బలవంతంగా పక్కకు లాక్కెళ్లి, ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడి బారి నుంచి తప్పించుకున్న బాలిక.. ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుమార్తె చెప్పిన మాటలు విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు వెంటనే స్థానిక 6 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మండలంలోని చంద్రన్‌పల్లి పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి వైపు నుంచి ఇందల్వాయి వైపు వస్తున్న ఒక లారీ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ టైర్ పేలి రోడ్డుపై అకస్మాత్తుగా నిలిచిపోవడంతో, అదే వేగంతో వెనుక నుంచి వస్తున్న ఏడు కార్లు, మరో మూడు లారీలు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఇందల్వాయి ఎస్‌ఐ సందీప్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాద వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ అవార్డుల (Padma awards-2026) ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము () సోమవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం మొత్తం 131 మందికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలి విడతలో నేడు 66మందికి అందజేయగా.. మిగతా వారికి రెండో విడతలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. ఈ […] The post ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం appeared first on Navatelangana.

సొంత చెల్లి, బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసిన కెటిఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ వేదికగా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుంది కెటిఆర్ అంటూ మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. ఫాంహౌస్‌లో ఉంటే ఏం తెలుస్తుంది? జూన్ 1వ తేదీన మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని, హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నామని మే 23వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని మంత్రి పొంగులేటి ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న డ్రామారావు అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టి, లోక్‌సభ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో కూడా మిమ్మల్ని ఓడగొట్టిన ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మీరు

నవతెలంగాణ-కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ సైద్ ఖాన్ (42) వడదెబ్బకు గురై మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తీవ్ర ఎండల కారణంగా అస్వస్థతకు గురైన సైద్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ సైద్ ఖాన్‌కు భార్యతో పాటు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ […] The post అంకుశాపూర్‌లో వడదెబ్బతో వ్యక్తి మృతి.. appeared first on Navatelangana.


మనతెలంగాణ, సిటిబ్యూరోః రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా రికార్డ్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్. శివానంద్ అమీర్‌పేటలోని డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ విరమణ చేసిన మహిళా పింఛన్ బెనిఫిట్స్ ఫైల్ పైఅధికారులకు పంపించేందుకు రూ.20వేలు ఇవ్వాలని రికార్డ్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. దీంతో మహళా ఉద్యోగి కుమారుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు రికార్డ్ అసిస్టెంట్‌కు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికి నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సిఎం అన్నారు. ఈ సందర్భంగా చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సిఎం ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని సిఎం పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారన్న విమర్శలు వచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని సిఎం

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. దీనిపై చర్చించేందుకు సోమవారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణతోపాటు ఎగ్జిబిటర్స్ చేరుకున్నారు. పర్సంటేజ్ విధానంపై చిరంజీవితో వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సునీల్ నారంగ్, బాలగోవింద్, అనుపమ్ రెడ్డి, […] The post చిరంజీవి నివాసంలో సినీ ప్రముఖుల కీలక భేటీ appeared first on Navatelangana.