
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ .. “మా ఇంటి బంగారం సినిమాలో ప్రతీ భావోద్వేగం ఉంటుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ... అన్ని అంశాలుంటాయి” అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ.. “సినిమాలోని యాక్షన్, కామెడీ, ఎమోషన్... ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు. కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి పాల్గొన్నారు.












