
సకాలంలో ధాన్యం తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని, సరైన లారీలను పంపకపోవడంతో జిల్లాలోని రైతు లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ సోమవారం నాడు పలు చోట్ల ధర్నాలు, నిరసనలు తెలిపారు. దాదాపు నెల నుంచి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో సరైన వాహనాలు రాక రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న దుస్థితి జిల్లాలో నెలకొంది. క్లస్టర్ల నిర్ల క్ష్యం మిల్లర్ల అలసత్వంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. మరో పక్క జిల్లా కలెక్టర్ తోపా టు సివిల్ సప్లై అధికారులు ప్రతిరోజు సుడిగాలి పర్యటన చేస్తూ ధాన్యం తరలించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నప్పటికీ సకాలంలో లారీలు లేకపోవడంతో వా రు కూడా మిల్లర్లపై త్వరితగతిన ధాన్యం లోడ్‌లు దింపుకోవాలని ఒత్తిడి తేస్తున్నారు.
అధికారులు ఎంత చెప్పినప్పటికీ మిల్లర్లకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు మొద్దు నిద్రలోనే ఉన్న దుస్థితి జిల్లాలో నెలకొంది. కలెక్టర్ నేరుగా కొనుగోలు కేంద్రాలు, మిల్లులు సందర్శించి పదిరోజుల్లో సీజన్ పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. రైతు లు ఎవరూ ఆందోళన చెందవద్దని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం చివరి గింజవరకు మిల్లుకు తరలించే బా ధ్యత తమదని రైతులకు హామీ ఇస్తున్నారు. అయినా నిరసనలు, ధర్నాలు అంటూ రైతులు ఆవేదనతో రోడ్డెక్కిన పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం పలు ప్రాం తాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పది కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిందని మరో పదిరోజుల్లో అన్ని కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.











