9722 వార్తలు

నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామ పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 585 మార్కులు సాధించిన రామ్ చరణ్ తేజను శాలువా పూలమాలతో సన్మానించినారు. ఈ సందర్భంగా విద్యార్థులందరు ఇలాంటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించి అంకాపూర్‌కు పేరు ప్రఖ్యాతలు తేవాలని పూర్వ విద్యార్థులు(1998-99) కోరారు. The post ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం appeared first on Navatelangana.

నవతెలంగాణ-వనపర్తివికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డి) వనపర్తి జిల్లా నూతన కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్‌పీఆర్‌డి వనపర్తి జిల్లా సదస్సు నిర్వహించుకోగా.. ఈ సదస్సుకు 10 మండలాల నుండి ఎన్పిఆర్డి సభ్యులు హాజరయ్యారు. వనపర్తి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా బి బంగారయ్య నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడం లక్ష్మి కార్యదర్శి మల్లెపు నరసింహ ఉపాధ్యక్షులు ఆంజనేయులు కోశాధికారి చెన్నయ్య మహిళా విభాగం కన్వీనర్ భాగ్యలక్ష్మి పార్వతమ్మ భాగ్యమ్మ నాగమ్మ నారాయణ చంద్రాయుడు […] The post NPRD వనపర్తి జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.బంగారయ్య appeared first on Navatelangana.

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్లరాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వివిధ మండలాలకు సంబంధించిన గ్రామాల ఉపసర్పంచుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులుగా గంభీరావుపేట ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తంగళ్ళపల్లి మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీర్నపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్ […] The post ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం appeared first on Navatelangana.

నవతెలంగాణ–ఆలేరు రూరల్: మాదిగల ఆరాధ్య దైవంగా భావించే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గ్రామస్థాయిలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు.గ్రామ కమిటీలలో సభ్యులుగా ఎంపికయ్యే వారు విద్యావంతులై ఉండటంతో […] The post గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: మండల కేంద్రంలోతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు “శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్ జనరల్ సెక్రెటరీ గన్నా లక్ష్మణ్ మైనార్టీ మండల అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్ సీనియర్ నాయకులు జైడి మల్లేష్ మాజీ వైస్ ఎంపీపీ […] The post జక్రాన్‌పల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆర్మూర్తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జంబి హనుమాన్ ఆలయం నందు ఆదివారం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి నారు. ఇ సందర్భంగా బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి […] The post జంబి హనుమాన్ ఆలయంలో టిపిసిసి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్బస్వపూర్ రిజర్వాయర్ లో తాము పుట్టిపెరిగిన ఊరు బిఎన్ తిమ్మాపురం గ్రామం ముంపునకు గురికావడం జీర్ణించుకోలేక తమ గ్రామ ప్రజల బాగు కోసం ఎంత దూరమైన వెళ్లి తన గ్రామ ప్రజల కొరకు న్యాయం చేయాలని ఆరాట పడుతూ, పరితపిస్తున్న భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, వారి కుమారుడు బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి లు చేస్తున్న పోరాటం చాలా అభినందనీయమని బిఎన్ తిమ్మాపురం నిర్వాసితులు అన్నారు.గతంలో ఎడ్ల […] The post గ్రామ ప్రజల కోసం తండ్రి తనయుల కృషి అభినందనీయం appeared first on Navatelangana.

నవతెలంగాణ-దర్పల్లి: మండలవ్యాప్తంగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను అపార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆదేశాలతో మండల పార్టీ ముఖ్యనేతలు, అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చేర్మెన్లు, డైరెక్టర్లు, సీనియర్ పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చి మండలకేంద్రములోని గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. […] The post ఘనంగా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామం శివార్లలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును, అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని […] The post అంకాపూర్ శివారు వద్ద రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.

నవతెలంగాణ-కొండాపూర్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో గోటిలగుట్ట తండాకు చెందిన విక్రమ్ (27), మల్కాపూర్ గాయత్రి నగర్‌కు చెందిన అనిల్ (30) ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. బైక్‌ను అనిల్ నడుపుతున్నట్లు సమాచారం.కొండాపూర్ మ్యూజియం సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పి వేగంగా వెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనపై విక్రమ్ […] The post కొండాపూర్‌లో విషాదకర రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.

”మనం చాలా ఒత్తిడితో కూడిన కాలంలో జీవిస్తున్నాం. మనందరి పైన బర్న్‌అవుట్ (burnout) ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంది” అంటున్న మనస్తత్వవేత్త డా. ఆడమ్ బోర్లాండ్ నాకు ఈ మధ్య పదేపదే గుర్తుకొస్తున్నాడు. గుర్తుకురావడమే కాదు, విద్యార్థులు యువత ప్రతి ఒక్కరూ ఏదో ఒకమేర అలసట, అశాంతి, విసుగు, ఒత్తిడి, పనిభారంలో మగ్గిపోతున్న నేపథ్యంలో బర్న్‌అవుట్ ముప్పును విప్పిచెప్పమని ఓహియో లోని తన క్లివ్ లాండ్ క్లినిక్ నుండి సందేశం పంపిస్తున్నాడు. ప్రస్తుతం ఎనబై శాతానికి పైగా యువత […] The post యువత భవిష్యత్తుపై బర్న్‌అవుట్ క్రీనీడలు appeared first on Navatelangana.

గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వివాదాలు, విద్వేష దూషణలూ పరాకాష్టకు చేరాయి. అధికారంలో వున్న, కోల్పోయిన పాలక పార్టీల కీలక నేతలు, మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రులే గాక కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ మంత్రులు కూడా ఈ వివాదాలకు ప్రత్యక్ష, పరోక్ష కారకులు కావడం విశేషం. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌లో సభకు హాజరై ఏపీ ముఖ్యమంత్రినీ, ఉప ముఖ్య మంత్రినీ కలిసి వెళ్లిన వెనువెంటనే ఈ పరిస్థితి రావడం యాదృచ్చికం కాదు. ఈ వివాదాలలో […] The post తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌లో ఘోర దుర్ఘటన జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. పేలుడు దాటికి 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న రైలునే లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. The post పాకిస్థాన్‌లో పేలుడు..24 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. ఏపీలో 2026-27 విద్యాసంవత్సరానికి 232 పని దినాలు, తెలంగాణలో 224 పని దినాలు ఉండనున్నాయి. మరోవైపు స్కూల్ విద్యార్థులకు మాత్రం జూన్ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. జూన్ 12 […] The post విద్యార్ధులకు అలర్ట్.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనకు సంబంధించి నిందితుల ఫోటోలను విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్కార్పియో కారులో నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా రెక్కీ నిర్వహించిన తర్వాతే దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదమే […] The post న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు.. నిందితుల ఫోటోలు విడుదల appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : నటి ట్విషా శర్మ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించగా, సోమవారం విచారణ జరగనుంది. గత ఏడాది డిసెంబర్లో న్యాయవాది సమర్థ్ సింగ్‌ను వివాహం చేసుకున్న ట్విషా, మే 12న భోపాల్‌లో అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వరకట్న వేధింపులు, మానసిక హింస కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి […] The post నటి ట్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, బ్రెజ్జా కారు ఢీకొన్నాయి. హైదరాబాద్ నుంచి చేవెళ్లకు వెళ్తున్న మెహదీపట్నం డిపో బస్సు యూటర్న్ వద్ద కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు వెంటనే ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరోవైపు బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు. ఈ […] The post ఆర్టీసీ బస్సు, బ్రెజ్జా కారు ఢీ.. 25 మంది ప్రయాణికులు సేఫ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తరఫున అర్జున్ నిన్న తన తొలి మ్యాచ్ ఆడాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికీ, అర్జున్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ తన కుమారుడిని ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ […] The post వెల్‌డన్ అర్జున్..కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే విదేశాలకు ప్రయాణించవద్దని తెలిపింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ దేశాలకు వెళ్లాలనుకునేవారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. The post ఎబోలా కలవరం.. భారత్ కీలక అడ్వైజరీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ అభ్యుదయ రచయిత, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన ఏటుకూరి ప్రసాద్(90) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వయో సంబంధిత సమస్యలతో ఆయన మరణించారు. 1970 నుంచి అభ్యుదయ రచయితల సంఘం(అరసం) పునర్నిర్మాణంలో ఆయన కీలకపాత్ర పోషించారు. చివరి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలం అరసం జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఎర్రజెండా, ఎర్రబాట, శివాలయ్య లాంటి పేరొందిన రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. తాపీ […] The post ఏటుకూరి ప్రసాద్ కన్నుమూత appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణగిరిపల్లె గ్రామం వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నలేంద్ర లక్ష్మి(40), కుమార్తె దీపిక(19), కుమారుడు సాయికిరణ్‌తో కలిసి బైక్‌పై గణపురం వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ, దీపిక మృతి చెందారు. సాయికిరణ్ తీవ్రంగా […] The post బైక్‌ను ఢీకొట్టిన కారు.. తల్లీకూతురు మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆమ్‌స్టర్‌డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతుకుడు మెయిల్ చేసి బెదిరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చని హెచ్చరించాడు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై విమానంలోని ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధరించారు. The post శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా భోపాల్‌లో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఫుట్‌బాల్ ఆటగాడిగా పేర్కొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ పొరపాటుపై తీవ్ర విమర్శలు రావడంతో, రామ్ చరణ్ వెంటనే తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బుమ్రాకు క్షమాపణలు తెలిపారు. తనకి బుమ్రా ఆట అంటే ఎంతో అభిమానమని, ఆయన సాధించిన విజయాలు గర్వకారణమని పేర్కొన్నారు. The post బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్ appeared first on Navatelangana.