నవతెలంగాణ – హైదరాబాద్ : ఆమ్‌స్టర్‌డామ్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు ఓ ఆగంతుకుడు మెయిల్ చేసి బెదిరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా బాంబు పేలవచ్చని హెచ్చరించాడు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై విమానంలోని ప్రయాణికులను కిందకి దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధరించారు.
The post శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు appeared first on Navatelangana.













