
3369 వార్తలు
జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమం కింద ఆలేరు మండలంలోని పటేల్‌గూడెం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా నేల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇదే కార్యక్రమం […] The post నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు appeared first on Navatelangana.

డిప్యూటీ సీఎం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి పాతర్లపాడు లోనే నష్టం సుమారు రూ.2 కోట్లుసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు నవతెలంగాణ – బోనకల్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్నికి రైతుల పంట ఆహుతి అయిందని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించి […] The post ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊహించని బ్లాక్‌బస్టర్… ఎవరూ అంచనా వేయని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాలకు పైగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, అధికారాన్ని కైవసం చేసుకునే అంచున నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యాహ్నం 1 గంట […] The post ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం సాధించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐదు స్థానాల్లో సిపిఐ(ఎం), సిపిఐ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండి, తాలి, శ్రీవిల్లిపుత్తూరు, పద్మనాభపురం, కిల్వె వెలూరు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది. పద్మనాభపురంలో సిపిఐ(ఎం) అభ్యర్థి ఆర్. చెల్లస్వామి 10,344 ఓట్లు సాధించి, 822 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కిల్వె వెళూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి టి. లతా […] The post Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధి రైతు వేదికలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నాగుల్గావ్, పెద్ద ఏడ్గి , పెద్ద గుల్ల, హంగర్గ, ఖండేబల్లూర్, డోన్ గావ్, జుక్కల్ మండలాల రైతులకు ఎంఈవో సతీష్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద, ఉప సర్పంచ్, రైతులు, పెద్దలు జాదవ్ విజయ్ పాటీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […] The post మండలంలోని ఏడు క్లస్టర్లలో రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.

కరీంనగర్: ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈరోజు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన బండి సంజయ్ కుమార్ పిఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు. తదుపరి మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సిఎం స్టాలిన్, తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వార
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులునవతెలంగాణ-తుంగతుర్తిబీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ప్రవేశ పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కళాశాలలు.. నాణ్యమైన విద్యకు చిరునామాగా మారాయన్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ […] The post నాణ్యమైన బోధన.. భవితకు నిచ్చెన appeared first on Navatelangana.


నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యపై నవతెలంగాణలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ కారణంగా వడ్ల లారీలు,రైతుల గడ్డి తగులుతూ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచురితమైన వార్తపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పరిశీలన చేపట్టారు. తక్షణమే చర్యలు తీసుకుని, అదనపు విద్యుత్ పోల్ ఏర్పాటు చేసి లైన్‌ను సురక్షిత […] The post నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు appeared first on Navatelangana.




హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. బెంగాల్ బిజెపి కూటమి (3), టిఎంసి (2) స్థానాలలో విజయకేతనం ఎగరేసింది. తమిళనాడులో టివికె రెండు స్థానాలలో గెలుపొందగా 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తోంది. తమిళనాడులో డిఎంకె(2), టివికె(4) స్థానాలలో గెలుపొందింది. అస్సాంలో బిజెపి (14), ఎఐయుడిఎప్ (1) స్థానాలలో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (93), బిజెపి (192), కాంగ్రెస్(01), వామపక్షాలు(01), ఇతరులు(2) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(103), డిఎంకె కూటమి (64), అన్నాడిఎంకె కూటమి(61), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (31), యుడిఎఫ్(73), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(86), కాంగ్రెస్ కూటమి(23), ఇతరులు(01), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(07), కాంగ్రెస్ కూటమి(04), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 12, కాంగ్రెస్ కూటమి(02),
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే ఆధిక్యం కనబరుస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఏఎస్ చంద్రశేఖర్ స్పందించారు. ‘‘ ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది. విజయ్‌కు అతడిపై ఉన్న విశ్వాసం అద్భుతం. ఆ నమ్మకమే విజయ్‌ని సీఎం అయ్యేలా చేస్తోంది. ఆ యాటిట్యూడ్‌ను అభినందిస్తున్నా ఎవరితోనూ పొత్తుల్లేకుండా ఒంటరిగా తన కాళ్లపై తాను నిలబడి, పార్టీని నిలబెట్టాడు. విజయ్‌కే కాదు, తమిళనాడులోనూ ఇది చారిత్రక విజయం’’ […] The post TVK ఆధిక్యం.. విజయ్ తండ్రి ఏమన్నారంటే? appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా స్వదేశం ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాడు. చేతి వేలి గాయానికి సంబంధించిన స్కానింగ్, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం అతను ఇంగ్లండ్‌కు పయనమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ గాయపడ్డాడు. […] The post రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్.. appeared first on Navatelangana.

తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో యుడిఎఫ్ హవా కొనసాగుతోంది. యుడిఎఫ్ విజయ దుదుంభి మోగిస్తోంది. యుడిఎఫ్ పార్టీ 21 స్థానాలలో విజయం సాధించగా 76 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. ఎల్డిఎఫ్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాలలో గెలవడంతో పాటు 32 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఎన్డిఎ రెండు స్థానాలలో లీడ్ ఉన్నారు.

చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్‌కు యూత్, దళిత్ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు టీవీకేకు మరో 10 సీట్లు మాత్రమే అవసరం. పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీల మద్దతుతో విజయ్ సీఎం పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. మరోవైపు సినీ నటి త్రిష ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా ఈ ఉదయం తిరుమల […] The post విజయ్ నివాసానికి త్రిష.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియంలో నిలువెత్తు నిర్లక్ష్యం దాగి ఉందని, ప్రతి అంశంలో తప్పిదాలు జరిగాయని, కేంద్ర ఎన్నికల సంఘం పట్టింపు లేకుండా వ్యవహరించిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌లో అనేక ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును ఆపారని సోషల్ మీడియా వేదికగా ఆమె వీడియో విడుదల చేశారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఇష్టానుసారం వ్యవహరిస్తోంది, కేంద్ర బలగాలు కూడా వారికి అండగా ఉన్నాయి. పోలీసులు కూడా కేంద్ర బలగాలతో కలిసి పని చేశారని, […] The post ఓట్ల లెక్కింపు.. పార్టీశ్రేణులకు మమతా బెనర్జీ కీలక పిలుపు appeared first on Navatelangana.

