చెన్నై: కాబోయే ముఖ్యమంత్రి విజయ్ దళపతికి ఆయన తండ్రి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ పార్టీ టివికె ప్రభంజనం సృష్టిస్తుండటంతో చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. గెలుపుపై విజయ్‌కి ఒక్క శాతం కూడా అనుమానం లేదని, అందుకే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు ఇప్పుడు మంచి తరుణం వచ్చిందని, సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన విజయ్‌కి ఎప్పటినుంచో ఉందని తెలియజేశారు. విజయ్‌ని తమిళనాడు ప్రజలు ఇంట్లో బిడ్డగా చూశారని, మహిళలు, యువత గుండెల్లో పెట్టుకున్నారని ప్రశంసించారు. 


తమిళనాడులో అసెంబ్లీ ఎన్నకల ఫలితాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టివికె(109), డిఎంకె(63), అన్నాడిఎంకె(60) స్థానాలలో ఆధిక్యంలో ఉంది. విజయ్‌కు యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. 2024 ఫిబ్రవరి 2న టివికె పార్టీని విజయ్ స్థాపించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే విజయం దిశగా ముందుకు సాగుతోంది. హిందూ వ్యతిరేక ముద్రతో డిఎంకె చాలా నష్టపోయింది.