
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మే 9న బిజెపి ప్రభుత్వం కొలువుదీరనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు స మీక్ భట్టాచార్య తెలియజేశారు. నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ ర్జోన నూతన సిఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఒక కొత్త ఆ రంభానికి నాందిపలకడానికే ఈ తేదీని నిర్ణయించినట్లు తెలియజేశారు. ప్రభు త్వ ఏర్పాటు కావలసిన పనులు చేస్తున్నారు. కాగా బెంగాల్ ముఖ్యమంత్రి గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే విషయంపై స్పష్టత రావలసి ఉంది. ప శ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చే బలం సంతరించుకున్న బిజెపి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపిక కు రంగం సిద్ధం చేసుకుంది. బెంగాల్ లో లేజిస్లేచర్ పార్టీ నాయకుడి ఎంపిక ప్రక్రియకు అమిత్ షాను కేంద్ర పరిశీలకుడుగా బిజెపి నాయకత్వం మంగళవారం ప్రకటించింది.
అమిత్ షాను కేం ద్ర మంత్రి, బిజెపి మాజీ అధ్యక్షులు జె పి నడ్డాను కూడా పరిశీలకులుగా బిజె పి నియమించింది. ఇక అసోం బిజెపి పరిశీలకుడుగా హర్యానా ముఖ్యమం త్రి నాయబ్ సింగ్ సైనీని నియమిస్తున్న ట్లు పార్టీ వర్గాలు ఓ నోటిఫికేషన్ వెలువరించాయి. ఒడిషా ముఖ్యమంత్రి మో హన్ చరన్ మాఝీని బెంగాల్ సిఎం ఎంపిక సహ పరిశీలకుడుగా నియమించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమబెంగాల్‌లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఇక అసోంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్‌ఎన్ రవికి కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ సౌమిత్రా మోహన్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. పశ్చిమ బెంగాల్ కేడర్ 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన సౌమిత్ర ఇప్పుడు బెంగాల్ రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు దశలో గవర్నర్ తీసుకునే కీలక నిర్ణయాల నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శి బాధ్యత ఎక్కువగా ఉంటుంది.
బెంగాల్ బిజెపి బలం 207
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బిజెపి సంఖ్యా బలం ఇప్పుడు 207కు చేరుకుంది. తిరిగి ఓట్ల లెక్కింపు జరిగిన రాజర్హట్ న్యూ టౌన్‌లో కూడా బిజెపి గెలిచింది. దీనితో రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీ పొందిన బిజెపి మరింత బలోపేతం అయింది. అక్కడ జరిగిన ఎన్నికలలో బిజెపికి చెందిన పియూష్ కనోడిచా సమీప టిఎంసి అభ్యర్థి, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన తపష్ చౌదరిపై కేవలం 309 స్వల్ప మెజార్టీతో ఓడించినట్లు ప్రకటించారు. దీనితో సోమవారం బిజెపికి ఉన్న సంఖ్యాబలం 206 ఇప్పుడు 207 అయింది













