
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. బెంగాల్ బిజెపి కూటమి (3), టిఎంసి (2) స్థానాలలో విజయకేతనం ఎగరేసింది. తమిళనాడులో టివికె రెండు స్థానాలలో గెలుపొందగా 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తోంది. తమిళనాడులో డిఎంకె(2), టివికె(4) స్థానాలలో గెలుపొందింది. అస్సాంలో బిజెపి (14), ఎఐయుడిఎప్ (1) స్థానాలలో విజయం సాధించింది.
పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (93), బిజెపి (192), కాంగ్రెస్(01), వామపక్షాలు(01), ఇతరులు(2) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(103), డిఎంకె కూటమి (64), అన్నాడిఎంకె కూటమి(61), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (31), యుడిఎఫ్(73), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(86), కాంగ్రెస్ కూటమి(23), ఇతరులు(01), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(07), కాంగ్రెస్ కూటమి(04), ఇతరులు(02) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి 12, కాంగ్రెస్ కూటమి(02), ఇతరులు(3) స్థానాలలో విజయం సాధించారు.









