తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ కేవలం రెండేళ్లలోనే బలమైన రాజకీయ శక్తిగా అవతరించి, డీఎంకే మరియు అన్నాడీఎంకే కోటలను బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే ఛీప్ ఎంకే స్టానిన్ ఓటమి పాలయ్యారు. కొళత్తూరు నుండి పోటీ చేసిన స్టాలిన్, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇది డిఎంకే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.