అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలునవతెలంగాణ-కాటారం కాటారం పట్టణంలో కల్తీ బీర్ల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ ధర గల బీర్లపై ప్రీమియం బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా “కింగ్ ఫిషర్ లైట్” పేరుతో నకిలీ స్టిక్కర్లు ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, నియంత్రణ బాధ్యత కలిగిన ఎక్సైజ్ శాఖ నుంచి తగిన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. […]
The post కాటారంలో కల్తీ బీర్ల దందా appeared first on Navatelangana.












