9639 వార్తలు

శాంతి ఒప్పందంపై విస్తృత చర్చలు : ట్రంప్ అణు కార్యక్రమంపై చర్యలకు అంగీకరించం : ఇరాన్వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలలో ‘గణనీయ పురోగతి’ కన్పిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా చేయాలన్న అమెరికా లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇరాన్ వద్ద ఇకపై అణ్వాయుధం అనేదే ఉండకూడదు. ఈ విషయంలో మా అధ్యక్షుడు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు’ అని అన్నారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణి […] The post చర్చలలో గణనీయ పురోగతి : అమెరికా appeared first on Navatelangana.

ప్రమాదంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ప్రధాని స్పందించరేం : రాహుల్ గాంధీ ఫైర్ న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. వరుసగా జరుగుతున్న నీట్ పేపర్ లీక్‌లకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమని పేర్కొన్నారు. అందుకే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో నేషనల్ […] The post నీట్ లీకేజీపై మోడీ మౌనం appeared first on Navatelangana.

ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వంపౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీకాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప వెళ్లొద్దని సూచన కాంగో : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు […] The post ఎబోలా అలర్ట్ appeared first on Navatelangana.

గాజాకు వెళ్తున్న మానవతా సహమీద కాన్వాయ్ మీద దుశ్చర్యపై ఆగ్రహంపారిస్ : గాజాకు వెళ్తున్న మానవతా సహాయ కాన్వాయ్ లో ఇజ్రాయిల్ దళాలచే పట్టు బడి, నిర్బంధంలో ఉన్న కార్య కర్తలను ఎగతాళి చేసినందుకు, ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్‌పై ఫ్రాన్స్ శనివారం అధికారిక ప్రవేశ నిషేధాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ దళాలు అడ్డగించిన విదేశీ కార్యకర్తల కఠినమైన నిర్బంధ పరిస్థితులను ఆ ఫుటేజ్ స్పష్టం చేసింది. ఆ రికార్డింగ్‌లో, డజన్ల కొద్దీ […] The post ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం appeared first on Navatelangana.

ఆల్చిప్పల కోసం వెళ్లి నదిలో మునిగి..ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరంఒక్కసారిగా నీటి మట్టం పెరగడమే కారణం సిరాలి : కర్నా టకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలోని తత్తెహక్కలు నదిలో నత్తగుల్లల సేకరణ కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంత య్యారు. సమాచారం అందుకున్న పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులంద రినీ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి […] The post ఒకే కుటుంబంలోని 8 మంది మృతి appeared first on Navatelangana.


బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తుంటాయి. బరువు తగ్గడం లేదా పెరగడం, మూడ్‌స్వింగ్స్ వంటివి చాలామందిలో కనిపించడం సహజం. అయితే, కొంతమంది వీటి మాదిరిగానే కొన్ని ఇతర లక్షణాలు, సమస్యల్ని సర్వసాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే బాలింతల్లో ఈ సమస్యలు, లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ […] The post ప్రసవానంతరం appeared first on Navatelangana.

పుచ్చకాయను ఎప్పుడూ ముక్కలుగా కోసుకుని తినడమో, లేదా జ్యూస్ చేసుకుని తాగడమో చేస్తుంటాం. అయితే పుచ్చకాయతో కమ్మనైన బర్ఫీ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యం పరంగానూ ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో మీ ఇంటికి వచ్చే అతిథులకు ఈ రసభరితమైన స్వీట్ వడ్డించి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అయిపోతారు. సాంప్రదాయ స్వీట్లతో పోలిస్తే ఇది కడుపుకు ఎంతో తేలికగా అనిపించడంతో పాటు, వేసవికి తగిన చల్లదనాన్ని ఇస్తుంది. కావాల్సిన పదార్థాలుపుచ్చకాయ […] The post పుచ్చకాయ బర్ఫీ appeared first on Navatelangana.

త్వరలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం : మార్కో రూబియో న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో వేగం తగ్గలేదని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారువుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న రూబియో ఆదివారం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు దేశాలు ఎదురుచూస్తున్నాయని రూబియో తెలిపారు. […] The post ఊపు తగ్గని భారత్-అమెరికా సంబంధాలు appeared first on Navatelangana.

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోకాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. సీజేపీ ఇన్‌స్టా పేజ్ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు చేరారు. అయితే, సీజేపీ ఫాలోవర్లను ఉద్దేశించి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వారిని పాకిస్తాన్, జార్జ్ సోరోస్‌కు చెందిన వర్గాలుగా పేర్కొన్నారు. దీనిపై అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని […] The post అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్యసోషల్ మీడియా వార్ appeared first on Navatelangana.

త్వరలోనే పార్లమెంటులో బిల్లువ్యవసాయ రంగాన్ని కేంద్రం నియంత్రిస్తుందంటున్న నిపుణులు న్యూఢిల్లీ : హరిత విప్లవ సమయంలో తీసుకొచ్చిన 1966 నాటి విత్తన చట్టం స్థానంలో నూతన బిల్లును రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెడతామని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. భారత రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ బిల్లు విత్తన పరిశ్రమను, తద్వారా దేశంలో వ్యవసాయ రంగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి విశేష […] The post విత్తన పరిశ్రమపై పెత్తనం appeared first on Navatelangana.




లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమాతో త్వరలోనే మన ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందుతున్న సినిమా ఇది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, ‘హలో బాసు’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో […] The post ‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు appeared first on Navatelangana.

నవతెలంగాణ – కాటారంకాటారం మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అంకుసాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీ కర్కా ఉమశంకర్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉప సర్పంచుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర […] The post మండల కాంగ్రెస్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కర్కా ఉమశంకర్ ఎన్నిక appeared first on Navatelangana.

నవతెలంగాణ – కాటారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఆదివారం కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో కాటారం చౌరస్తా సందడిగా […] The post ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వర్క్ చేసి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు సినిమాట్రోగాఫర్ కిషోర్ బోయిదాప. తాజాగా ఆయన నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన ‘మేము కాప్’లం’ సిరీస్‌తో మన ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కిం చటంలో కీలక పాత్రను పోషించిన కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన […] The post అందరి సహకారంతో 17 రోజుల్లో సాధ్యమైంది appeared first on Navatelangana.

నందు, అవికా గోర్ జంటగా నటించిన సినిమా ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ రచన, దర్శ కత్వంలో రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మించారు.ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీం మీడియాతో కలిసి థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. హీరో నందు మాట్లాడుతూ,’ మా సినిమాకు మంచి విజయం ఇచ్చినందుకు ముందుగా మీడియా వారికి, ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా ఉదయంతో పోలిస్తే విడుదల […] The post ‘అగ్లీ స్టోరీ`కి అనూహ్య స్పందన appeared first on Navatelangana.

గత కొంతకాలంగా తెలుగు సాహిత్యం కొత్త కళను సంతరించుకుంది. కవిత్వ కార్యశాలలు, కథా శిబిరాలు, జూమ్ సమావేశాలు, ఫేస్‌బుక్ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. వివిధ వేదికల్లో కవిత్వం ఎలా రాయాలి?, కథలు ఎలా అల్లాలి? అనే చర్చలు జరుగుతుంటే తెలుగు సాహిత్యానికి కొత్త చైతన్యం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఉత్సాహాన్ని చూసినప్పుడు కొంతమంది సాహితీ పెద్దలకు నేను ఒక విన్నపం చేశాను. ‘కవిత్వం, కథలపై ఇన్ని శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా, మరి విమర్శపై […] The post పొగడ్తల మధ్య సన్నగిల్లుతున్న తెలుగు సాహిత్య విమర్శ appeared first on Navatelangana.

రాంచీ: అథ్లెటిక్స్‌లో పంజాబ్ స్పింటర్ గురీందర్వీర్ సింగ్ నయా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఫెడరేషన్ కఫ్ ఫైనల్లో గురీందర్వీర్ సింగ్ 100 మీటర్ల పరుగును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 100 మీటర్ల పరుగు విభాగంలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇంతకుముందు ఒడిశాకు చెందిన అనిమేశ్ కుజుర్ 10.15 సెకన్లలో రేసును పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తాజాగా గురీందర్వీర్ సింగ్ ఈ రికార్డును బద్దలు కొట్టి భారత ఉత్తమ అథ్లెట్‌గా నిలిచాడు.

ఇంకా ఆకాశం మిగిలే ఉందిఅరచేతిలో జారిపోయినకాలపు గింజల మధ్యమరచిపోయిన గూటి వాసనలామనసు తడబడుతోంది.నిన్నటి మాటలుగాలికి అప్పగించిన బాణాలైతిరిగి రాని మార్గాల్లోనీ నిశ్శబ్దాన్ని గాయపరిచిన వేళనీ సహనంపొదల మధ్య దాగిన నీటి వనరులానన్ను క్షమిస్తూ ప్రవహించింది.నేను అహంకారపు గాలిలోఅడవి మంటలా ఎగసిన వాడిని,నీ కలల పచ్చదనాన్నికాలి బూడిద చేసిన వాడిని.కానీ నువ్వు వాన రాకపోయినామేఘాల్ని నమ్మే నేలవు,గాయాలపై పూలు నాటేఅనిర్వచనీయ మృదుత్వం.ఇప్పుడు రెక్కలు బలపడిన పిట్టలుగూటిని విడిచిపెట్టిఆకాశాన్ని కొలుస్తున్నాయి;మన కథసంధ్యారాగం వైపు ఒంపుకుంటోంది.మిగిలిందిఒకే కప్పు నీడలోరెండు నిశ్శబ్దాల మధ్యచెలిమి […] The post రెక్కలార్చుకుంటూ… appeared first on Navatelangana.

చాలా రోజులయ్యింది నిన్ను చూడక గడియారం ముల్లుఎన్ని సుట్లు తిరిగిందోనిన్ను ముద్దాడకనువ్వు వస్తేమండు వేసవిలో మల్లెలు పూచినట్టుఎటు నుండి వస్తావోగడ్డి పరక మీదమంచు బిందువు రాలినట్టుఎండు కొమ్మ మీదవసంతం వాలినట్టురా ప్రియా రానువ్వు వెంటపడినపుడల్లాఅనుభవించినఆ ఉపవాసాలే నాకిష్టంలైలా మజ్నూ కూడా చవి చూడనిఈ విరహం నాకే ఎందుకుసలీం అనార్కలి గుండెలు బాదుకోనిఈ దూరం నాకే ఎందుకుఊపిరాడని పని జంఝాటంలోనువ్వే కదా ప్రాణవాయువునువ్వు రాకపోతేఈ కవితా ప్రపంచంలోదారం తెగిన గాలిపటంలాఎటు పోతానోరెక్కలు విరిగి బొక్కలు తేలినాపెద్ద చేపలు రుచి […] The post కవిత్వమా కాస్తకౌగిలి ఇవ్వు appeared first on Navatelangana.