9630 వార్తలు

నివాసాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి ప్రైవేటీకరణ దిశగా పన్నాగాలుభవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు ఉచిత విద్యుత్ రద్దు కోసమే ఈ ఎత్తుగడలు ప్రజలు ఇప్పటి నుంచే తిరగబడి కాంగ్రెస్ ఫ్యూజులు పీకెయ్యాలి మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కెసిఆర్ అప్పుడు తలొగ్గలేదుకార్యకర్తల సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదాని వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే సిఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ప్రభుత

నవతెలంగాణ – హైదరాబాద్ : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కొండపై ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈదురుగాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న నగరపాలక కమిషనర్, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కొండను ఆనుకుని ఉన్న ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాదంపై గుంటూరు కలెక్టర్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించి, మంటలు పూర్తిగా ఆరిపోయేంతవరకు […] The post ఉండవల్లి కొండపై భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

యుద్ధ విరమణ దిశగా అమెరికా, ఇరాన్ యురేనియం నిల్వలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకారం? 60 రోజుల వ్యవధిలో కార్యాచరణ హర్మూజ్‌ను తెరిచి ఉంచేందుకు సానుకూలత ఇంధన సంక్షోభ నివారణ దిశగా అడుగులుఅతి త్వరలో శుభవార్త వింటారని భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యకైరో ః పశ్చిమాసియా యుద్ధ విరమణ దశకు అత్యంత చేరువలో ఉన్నామని అమెరికా దౌత్యవర్గాలు, అధికారులు ఆదివారం ప్రకటించారు. హర్మూజ్ జలసంధి మార్గం పున ః ప్రారంభం, అత్యంత ఉన్నత స్థాయి శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులకునేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇక ఇరు పక్షాల మధ్య ఒప్పందంపై సంతకాలు ఎప్పుడు? ఎక్కడ అనేదే మిగిలిన ప్రక్రియ అని తేల్చిచెప్పారు. భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కూడా ఆదివారమే డీల్ కుదిరిందని ప్రకటించారు. కొద్ది గంటల్లోనే ఒప్పందం కుదురుతుందని తెలిపారు. ఇరాన్ తన యురేనియం నిల్వలు త్యజించడం కీలక డిమాండ్ అని ట్రంప్ ప్రకటిస్తూ వచ్చారు. అయితే యురేనియం వదులుకునే విషయంలో సిద్ధంగా ఉన్నదీ లేనిదీ ఇరాన్ బహిరంగంగా ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొత్తం మీద ఒప్పందానికి సిద్ధపడిందని

నవతెలంగాణ – హైదరాబాద్ : వాహనదారులకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. భారత దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 2.84, అటు డీజిల్ పై రూ. 2.86 చొప్పున ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. పెరిగిన ధరలు నేటి ఉదయం నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే నాలుగు సార్లు చమురు […] The post మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు appeared first on Navatelangana.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వడగాలుల హెచ్చరికచాలా జిల్లాల్లో 46 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలుకొమ్రంభీమ్ అసిఫాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో రోహిణి కార్తె ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బయటకెళ్లితే మాడ పగిలేలా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలంగాణ ఆల్ టైమ్ రికార్డులకు దాదాపు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో […] The post మండుతున్న ఎండలు..వీస్తున్న వడగాలులు appeared first on Navatelangana.

ప్రయాణికుల రక్షణకు ఎండీ నాగిరెడ్డి వినూత్న శ్రీకారం‘బస్సులో భరోసా’ పేరిట ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంనవతెలంగాణ – ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధిప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది… ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగిరెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు […] The post ప్రయాణికుల భద్రతకు హైటెక్ రక్షణ టీజీఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు! appeared first on Navatelangana.

నవతెలంగాణ-సిటీబ్యూరోరాష్ట్ర రవాణా శాఖలో కీలక పదోన్నతి లభించింది. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ)గా విధులు నిర్వహిస్తున్న సి. రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు రవాణా కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. 2025-26 ప్యానెల్ సంవత్సరానికి గానూ ఈ ప్రమోషన్‌ని ఖరారు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో రవాణా వ్యవస్థను చక్కదిద్దడంలో, కార్యాలయాల పనితీరును మెరుగుపరచడంలో ఆయన చూపిన చొరవకు ఈ ప్రమోషన్ […] The post రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్ appeared first on Navatelangana.

సుడా, జిల్లా గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనిబద్ధత, నిజాయితీతో పని చేస్తే గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అభివృద్ధికి ముగ్గురు మంత్రుల కృషి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి నవతెలంగాణ-ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం స్తంభాద్రి […] The post కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు appeared first on Navatelangana.

ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మన్నెగూడలో ఆయన అధ్యక్షతన నిర్వహించిన సంఘ రాష్ట్ర తృతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించాలని కోరారు. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేసేందుకు […] The post జూన్ 2న పీఆర్సీ ప్రకటించాలి appeared first on Navatelangana.

18 నెలల బకాయిలపై అధికారుల మొండిచేయిఒక్కొక్కరి వేతనాల నుంచి రూ.4 వేలు కట్!140 మంది కార్మికులకు 72వేల చొప్పున నష్టంకోర్టు కేసుల సాకుతో బకాయిల ఎగవేతన్యాయం చేయాలని ప్రభావాణిలో వినతి.. స్పందన కరువు? నవతెలంగాణ-సిటీబ్యూర్లోనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, పర్యాటక ప్రాంతాలను కాపాడుతున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ) కాంట్రాక్టు కార్మికుల పొట్ట కొడుతున్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి పట్ల అత్యంత దారుణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల […] The post కార్మికుల వేతనాలకు ‘బీపీపీ’ కత్తెర.. appeared first on Navatelangana.

గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందిఎమ్మెల్యే శంకర్ కృషితోనే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు నిధులు : రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ -షాద్ నగర్పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పోయిందని ఆరోపించారు. […] The post పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తాం appeared first on Navatelangana.

లారీల కొరతే అసలు సమస్యనవతెలంగాణ – వీర్నపల్లి/ రామారెడ్డి/కొల్చారం / నంగునూరురాష్ట్రంలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేపట్టాలని, తరుగు తీయడం ఆపేయాలని కోరుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి ఐకేపీ కేంద్రంలో రెండు నెలలుగా ధాన్యాన్ని కొనడం లేదని ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే కొన్నారని వాపోయారు. లారీలు రాకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని […] The post ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన appeared first on Navatelangana.

లేబర్ కోడ్‌లు రాష్ర్టంలో అమలు చేయకుండా తీర్మానం చేయాలి : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములునవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతిఁధికేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ మెదక్ జిల్లా సమావేశం సంగారెడ్డిలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు బాలమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లు కార్మికుల పాలిట ఉరి […] The post పెంచిన కనీస వేతనాల్లో శాస్త్రీయత ఎక్కడ? appeared first on Navatelangana.

కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయం : మంత్రి తుమ్మల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎన్నిసార్లు లేఖలు రాసినా…కేంద్ర మంత్రులకు విన్నవించినా మక్కల కొనుగోళ్లపై కేంద్రం స్పందించడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ.4 వేల కోట్లకు అదనంగా మరో రూ.1800 కోట్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. యాసంగి 2025-26 సీజన్‌లో […] The post మక్కలు కొనేందుకు మరో రూ.1800 కోట్లకు ఆమోదం appeared first on Navatelangana.

విద్యుత్ సంస్థలను ప్రయివేట్ పరం చేసే కుట్రబషీర్‌బాగ్ తరహ మరో ఉద్యమం రావాలిటీఆర్‌ఈఈఎఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‘తెలంగాణ రైతు డిస్కం అనుమతులను విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) తిరస్కరించాలి. ముందస్తు అంచనాలు, ప్రణాళిక లేకుండా, పౌరసమాజంతో ఎలాంటి చర్చలు జరపకుండా రాష్ర్టప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంది. రైతు డిస్కం ఏర్పాటు వెనక భారీ కుట్రకోణం దాగుంది. తెలంగాణ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్ వ్యక్తులకు ధారదత్తం చేయాలని సర్కార్ ప్రయత్నిస్తోంది. టీడీపీ హయాంలో […] The post రైతు డిస్కంను ఈఆర్సీ తిరస్కరించాలి appeared first on Navatelangana.

శాంతి ఒప్పందంపై విస్తృత చర్చలు : ట్రంప్ అణు కార్యక్రమంపై చర్యలకు అంగీకరించం : ఇరాన్వాషింగ్టన్/టెహ్రాన్ : ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలలో ‘గణనీయ పురోగతి’ కన్పిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అయితే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా చేయాలన్న అమెరికా లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘ఇరాన్ వద్ద ఇకపై అణ్వాయుధం అనేదే ఉండకూడదు. ఈ విషయంలో మా అధ్యక్షుడు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు’ అని అన్నారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణి […] The post చర్చలలో గణనీయ పురోగతి : అమెరికా appeared first on Navatelangana.

ప్రమాదంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ప్రధాని స్పందించరేం : రాహుల్ గాంధీ ఫైర్ న్యూఢిల్లీ : నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదంపై ప్రధాని మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. వరుసగా జరుగుతున్న నీట్ పేపర్ లీక్‌లకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమని పేర్కొన్నారు. అందుకే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో నేషనల్ […] The post నీట్ లీకేజీపై మోడీ మౌనం appeared first on Navatelangana.

ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖవైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వంపౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీకాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప వెళ్లొద్దని సూచన కాంగో : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు […] The post ఎబోలా అలర్ట్ appeared first on Navatelangana.

గాజాకు వెళ్తున్న మానవతా సహమీద కాన్వాయ్ మీద దుశ్చర్యపై ఆగ్రహంపారిస్ : గాజాకు వెళ్తున్న మానవతా సహాయ కాన్వాయ్ లో ఇజ్రాయిల్ దళాలచే పట్టు బడి, నిర్బంధంలో ఉన్న కార్య కర్తలను ఎగతాళి చేసినందుకు, ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్‌పై ఫ్రాన్స్ శనివారం అధికారిక ప్రవేశ నిషేధాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ దళాలు అడ్డగించిన విదేశీ కార్యకర్తల కఠినమైన నిర్బంధ పరిస్థితులను ఆ ఫుటేజ్ స్పష్టం చేసింది. ఆ రికార్డింగ్‌లో, డజన్ల కొద్దీ […] The post ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం appeared first on Navatelangana.

ఆల్చిప్పల కోసం వెళ్లి నదిలో మునిగి..ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరంఒక్కసారిగా నీటి మట్టం పెరగడమే కారణం సిరాలి : కర్నా టకలోని ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలోని తత్తెహక్కలు నదిలో నత్తగుల్లల సేకరణ కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంత య్యారు. సమాచారం అందుకున్న పోలీ సులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 8 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతులంద రినీ భట్కల తాలూకా సిరాలి గ్రామానికి […] The post ఒకే కుటుంబంలోని 8 మంది మృతి appeared first on Navatelangana.


బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో రకాల మార్పులు కనిపిస్తుంటాయి. బరువు తగ్గడం లేదా పెరగడం, మూడ్‌స్వింగ్స్ వంటివి చాలామందిలో కనిపించడం సహజం. అయితే, కొంతమంది వీటి మాదిరిగానే కొన్ని ఇతర లక్షణాలు, సమస్యల్ని సర్వసాధారణమే అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే బాలింతల్లో ఈ సమస్యలు, లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయవద్దని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ […] The post ప్రసవానంతరం appeared first on Navatelangana.

పుచ్చకాయను ఎప్పుడూ ముక్కలుగా కోసుకుని తినడమో, లేదా జ్యూస్ చేసుకుని తాగడమో చేస్తుంటాం. అయితే పుచ్చకాయతో కమ్మనైన బర్ఫీ తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యం పరంగానూ ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో మీ ఇంటికి వచ్చే అతిథులకు ఈ రసభరితమైన స్వీట్ వడ్డించి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు ఫిదా అయిపోతారు. సాంప్రదాయ స్వీట్లతో పోలిస్తే ఇది కడుపుకు ఎంతో తేలికగా అనిపించడంతో పాటు, వేసవికి తగిన చల్లదనాన్ని ఇస్తుంది. కావాల్సిన పదార్థాలుపుచ్చకాయ […] The post పుచ్చకాయ బర్ఫీ appeared first on Navatelangana.