గాంధీ హాస్పిటల్ ను తెలంగాణలో ఎబోలా అనుమానిత కేసుల కోసం ప్రధాన రిఫరల్ సెంటర్‌గా గుర్తించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు 20 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలతో ఏర్పాటు చేశారు.

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి మాట్లాడుతూ.. కోవిడ్ తరహా ప్రోటోకాల్స్ ప్రకారం ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎబోలా సమన్వయం కోసం డాక్టర్ వంశీ కృష్ణను నోడల్ అధికారిగా నియమించారు.

ఇక శంషాబాద్‌లోని Rajiv Gandhi International Airport వద్ద నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఉగాండా, సౌత్ సూడాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. అనుమానిత కేసులు గుర్తిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.