
1560 వార్తలు

మనీ ప్లాంట్ ఇంటికి అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది మానసిక ప్రశాంతతను అందించి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. అయితే, సరైన దిశలో ఉంచకపోతే నష్టాలు కలుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనీ ప్లాంట్ ఏ దిక్కున ఉండాలి.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

గతేడాది ఫిబ్రవరిలో టీవీకే పార్టీని స్థాపించారు హీరో విజయ్ దళపతి. సినిమాల్లో స్టార్ హీరోగా లగ్జరీ లైఫ్ చూసిన ఆయనకు రాజకీయాల్లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా అన్నిటినీ అధిగమించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా దూసుకెళుతున్నారు.

మాస్ మహారాజ రవితేజ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరిస్తున్నారు . తాజాగా తన కూతురు మోక్షదతో కలిసి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు రవితేజ.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ టీవీకే జెండా పాతింది. అధికార డీఎంకే ఘోర పరాజయం పాలైంది. కరూర్ తొక్కిసలాట, సీబీఐ కేసు, వైవాహిక వివాదాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, విజయ్ తన స్టార్డమ్, వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్నారు. యువతలో ఆయనకున్న ఇమేజ్, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, "విజిల్" గుర్తు టీవీకే విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

టాలీవుడ్లో థియేటర్ల వివాదం మళ్లీ రాజుకుంది. మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ల కేటాయింపు, సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లేఖ విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరితో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 16 మంది నిర్మాతలు కలిసి ఈ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.

IPL Ticket Scam : ఐపీఎల్ టికెట్ల కోసం పీఎంఓ, గవర్నర్ పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో కందుకూరుకు చెందిన అశోక్ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం త్వరలో ప్రాపర్టీ కార్డును జారీ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రతీ ఆస్తికి ఒక కార్డు ఇవ్వనున్నారు. దీని వల్ల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆస్తికి సంబంధించిన వివరాలు అన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ రుణాలకు ఇది సహాయపడుతుంది.

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన జట్టును వెనకేసుకొచ్చారు.

Semiya payasam recipe in telugu: పాయసం చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది వేడి వేడి లేదా చల్లగా ఇలా రెండు రకాలుగా తినొచ్చు. వేసవిలో తీసుకుంటే శరీరానికి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాదు, ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇది తిన్న వెంటనే ఈజీగా జీర్ణమవుతుంది ఎనర్జీ కూడా ఇస్తుంది.

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న వేళ అధికారిక ట్రెండ్స్‌లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. అస్సాంలో బీజేపీ ముందంజలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ లీడ్‌లో ఉండగా, పుదుచ్చేరిలో ఏఐఎన్ఆర్సీ ముందంజలో ఉంది. తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

నటుడు రవిబాబు విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే దర్శకుడిగానూ మెప్పించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినిమాలు, ఆహారం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తన ఆరోగ్య రహస్యమని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలోనూ కఠిన నియమాలు పాటించే రవిబాబు, ఆరోగ్యం, కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

బ్యాంకుల సెలవుల గురించి కస్టమర్లు అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్రాన్ని బట్టి సెలవులు అనేవి మారుతూ ఉంటాయి. ఈ వారంలో రెండు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. మే 4 నుంచి మే 10వ తేదీ వరకు బ్యాంక్ సెలవుల గురించి చూద్దాం.

ప్రపంచంలో రకరకాల వింత అలవాట్లు ఉన్న మనుషులు ఉంటారు. ప్రతి ఒక్కరికీ వారి వారి ఆసక్తులు, అభిరుచులు ఉంటాయి. కొందరికి సంగీతం, కొందరికి క్రీడలు, మరికొందరికి ప్రయాణాలు ఇష్టం. కానీ, కొందరి అభిరుచులు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే, అవి చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కానీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక మహిళకు గుర్రంలా జీవించాలనే వింత కోరిక ఉందని తెలిస్తే షాక్ అవుతారు. దాంతో ఆమె గుర్రంలా సకిలించడం, గడ్డి తినడం, గెంతడం వంటి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

IPL 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరేన్ తన బౌలింగ్‌తో మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద జాతీయ రైల్వే వ్యవస్థ. దేశంలో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా దేశంలో సుదూర ప్రయాణాలకు రైళ్లపై ఆధారపడపడుతుంటారు. ఇతర మార్గాలతో పోల్చుకుంటే.. రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయవచ్చు. అయితే, 12 రాష్ట్రాలను కలిపే ఒక ప్రత్యేకమైన రైలు ఉందని మీకు తెలుసా? దేశంలోని ఉత్తర అంచున ఉన్న జమ్మూ-కశ్మీర్‌ను, దక్షిణ అంచున ఉన్న తమిళనాడును కలిపే ఈ రైలు ప్రయాణీకులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఆ రైలు ప్రత్యేకతేలంటో ఇక్కడ చూద్దాం..

దేశంలో యూపీఐ పేమెంట్స్ రోజురోజుకు పెరుగతున్నాయి. రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. అయితే యూపీఐ లావాదేవీల వల్ల సెకన్లలోనే పేమెంట్స్ చేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. చిన్న మొత్తాలు నెల చివరకు పెద్దగా అనిపిస్తాయి.

వేసవిలో పెరుగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కార్ల సన్‌రూఫ్ గ్లాస్లు అకస్మాత్తుగా పగిలిపోవడం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువసేపు ఎండలో పార్క్ చేయడం, గ్లాస్లో చిన్నపాటి లోపాలు, థర్మల్ షాక్ వంటి కారణాలు ఈ ప్రమాదానికి దారితీస్తాయి. కాబట్టి కారును నీడలో ఉంచడం, ఏసీని నెమ్మదిగా ఆన్ చేయడం, గ్లాస్‌ను తరచూ తనిఖీ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

Healthy Indian summer drinks: ఇది ఒక గ్లాస్ తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో.. ఇంకా ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది. ఇమ్యూనిటీని కూడా వెంటనే పెంచుతుంది. అలసట, నీరసం కూడా దెబ్బకు పారిపోతోంది. ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్. సమ్మర్లో బెల్లం వాడితే ఇంకా చాలా మంచిది.

IPL 2026 Sixes : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సీజన్ 46వ మ్యాచ్ ముగిసే సమయానికి, హైదరాబాద్ టీమ్ అత్యధికంగా 118 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచింది. లక్నో పరిస్థితి దారుణంగా ఉంది.

ఒపెక్+ చమురు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించినా, అమెరికా-ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ప్రస్తుతానికి ప్రభావం పరిమితం. సరఫరా అంతరాయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు $125 దాటి, ద్రవ్యోల్బణం ఆందోళనలను పెంచాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.

Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. 2026 సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ఈ జట్టు, ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు గాలిలో దీపంలా మారిన వేళ, ముంబై మేనేజ్మెంట్ గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టును దెబ్బతీస్తున్నాయి.

జ్యోతిష్యులు శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఒక వ్యక్తి జీవితంలో నవ గ్రహాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ గ్రహాల గమనాన్ని మహా దశ అంటారు. ఇక వీటిలో శని మహా దశ చాలా పవర్ఫుల్, ఇది 19 ఏళ్ల పాటు సాగుతుంది. దీని వలన రెండు రాశుల వారికి పండుగే పండుగ. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రానున్న మూడ్రోజుల పాటు వర్షసూచన జారీ చేసింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు.