Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ఈ జట్టు, ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏకంగా 7 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లేఆఫ్స్ ఆశలు గాలిలో దీపంలా మారిన వేళ, ముంబై మేనేజ్‌మెంట్ గతంలో తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ జట్టును దెబ్బతీస్తున్నాయి.