24518 వార్తలు






హైదరాబాద్: సీడ్ గణేశుడితో అటు పుణ్యకార్యం.. ఇటు ప్రకృతికి మేలని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. సీడ్ గణేశుడిని పూజించండి..పచ్చదనాన్ని పెంచండని సూచించారు. హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేషా ప్రతిమలను చిరంజీవి ఆవిష్కరించారు. విగ్రహంలో వేప, చింత లాంటి దేశీయ విత్తనాలు ఉండేలా చూడాలని చిరంజీవి కోరారు. పివొపి విగ్రహాలతో జలకాలుష్యం విపరీతంగా పెరుగుతోందని, మట్టి వినాయకులను పూచించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు. వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకు అందరూ సీడ్ గణేశాను పూచించాలని చిరంజీవి పిలుపునిచ్చారు.

కొద్ది రోజుల క్రితం షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక.. తిరిగి గాయం నుంచి కోలుకున్నారు. తిరిగి ఆమె సెట్స్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. ‘తిరిగి షూట్‌కు వెళ్తున్నా.. కానీ, ఈ క్షణాలను మాత్రం కచ్చితంగా మిస్ అవుతాను’ అని వరలక్ష్మి వ్రతం చేస్తోన్న ఫొటోలతో పాటు.. ఇతర ఫొటోలను పంచుకున్నారు. ఎట్టకేలకు రష్మిక తిరిగి సెట్స్‌లోకి వెళ్లడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా తుంటి భాగంలో బలమైన గాయమైంది. దీంతో ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో రష్మిక ఇంట్లోనే ఉంటూ తరచూ తన హెల్త్ అప్‌డేట్‌లతో పాటు, తాను చేస్తున్న పనులను అభిమానులతో పంచుకుంటూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)



మన తెలంగాణ/హైదరాబాద్: ఫిక్కీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వరంగల్‌లో ఎగుమతులపై వర్క్‌షాప్ నిర్వహించారు. హైదరాబాద్ కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ పి.సతీష్ మాట్లాడుతూ, కస్టమ్స్ శాఖ పన్నుల వసూలు సంస్థ నుంచి అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహకంగా మారిందని తెలిపారు. ఇసీలింగ్, ఇవే బిల్ వంటి డిజిటల్ విధానాల వల్ల 90% దిగుమతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా జరుగుతున్నాయని తెలిపారు. ఫిక్కీ ప్రతినిధులు పి.ఎస్.ప్రుథి, ఎస్.విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎటిఎ కార్నెట్ (వస్తువుల పాస్‌పోర్ట్), యుఎన్ టిఐఆర్ వ్యవస్థల ద్వారా ప్రదర్శనలు, తాత్కాలిక సరుకుల రవాణాకు పన్ను మినహాయింపు లభిస్తుందని వివరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బి.రవీందర్ రెడ్డి మిర్చి, మామిడి ఎగుమతుల అవకాశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం. వేద ప్రకాశ్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.



విక్టరీ వెంకటేశ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. అయితే ఇంకా షూట్ పూర్తి కాలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ బ్యాలెన్స్ ఉందని.. అలాగే ఓ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉందట. సెప్టెంబర్ రెండో వారంలో సాంగ్ షూట్ చేస్తారట. అయితే అక్టోబర్ 2 నుంచి సినిమా వాయిదా పడే విష యం, కొత్తగా అక్టోబర్ 9 లేదా 16 తేదీల్లో ఏదో ఒకదాన్ని ఖరారు చేయ డం వంటి అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి దసరా బరిలో భారీ సినిమాల పోటీ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, యువిన, రాజ్ ప్రజ్పల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తు న్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చి త్రంలో వెంకీ సరసన కథానాయికగా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ ఓ ప్రత్యేక




మంచిర్యాల: తల్లికి ఎంత కష్టము వచ్చిందో ఏమోకానీ కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామంలో గొట్ల అంజయ్య, రజిత(26) అనే దంపతులు నివసించేవారు. ఈ దంపతులకు కూతురు అక్షిత(06), కుమారుడు మహేందర్(2) ఉన్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరగడంతో రజిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. అప్పుడప్పుడు అంజయ్య తన పిల్లలు చూసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆదివారం కూడా అంజయ్య అత్తింటికి వచ్చి పిల్లలను యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వెళ్లిపోయాడు. తరువాత కుమారుడిని ఇంట్లో పడుకోబెట్టి కూతురును తీసుకొని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లింది. కూతురును నడుముకు కట్టుకొని బావిలో దూకింది. బావిలో మృతదేహాలు కనిపించడంతో రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రణాళిక వివాదాస్పదమైంది. చంద్ర కుటుంబంతో సం బంధమున్న 5 సంస్థలు 61.78 శాతం ఓటిం గ్ హక్కులను ఉపయోగించి ఈ ప్లాన్‌ను ఆమోదింపజేశాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి అసమ్మతి రుణదాతలు ఆరోపించారు. మొత్తం రూ. 22,006.57 కోట్లకు పైగా బకాయిలు ఉండగా, కేవలం రూ. 6.5 కోట్లు మాత్రమే చెల్లించేందుకు ఈ ప్రణాళిక ప్రతిపాదించింది. పరిష్కార కమిటీ (సిఒసి)లో ఈ ప్లాన్ 80.81 శాతం ఆమోదం పొందింది. ఆ 5 సంస్థలు అసోసియేట్లు లేదా సంబంధిత విభాగాలు అని, అందువల్ల ఓటింగ్‌కు అనర్హులని బ్యాంకులు వాదిస్తున్నాయి. ఎన్‌సిఎల్‌టి బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా, మూడో సభ్యుడు నిలేష్ శర్మ ప్లాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కెనరా బ్యాంక్ (1.60 శాతం ఓటింగ్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (3.2 శాతం) అప్పీలుకు సిద్ధమవుతుండగా, సభ్యురాలు రీనా సిన్హా పూరి విధానపరమైన లోపాలను ప్రశ్నించారు. మరోవైపు, తనపై ఉన్న అసలు క్లెయిమ్ రూ. 3,992 కోట్లు మాత్రమేనని సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.

వావ్రే(బెల్జియం): పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో జర్మనీ విజేతగా నిలిచింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో జర్మనీ 10 గోల్ తేడాతో స్పెయిన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన తుది సమరంలో జర్మనీ అతి కష్టం మీద విజయం సాధించింది. జర్మనీకి ఇది నాలుగో ప్రపంచ కప్ ట్రోఫీ కావడం విశేషం. ఇక అర్జెంటీనా టీమ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం వావ్రే వేదికగా మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా 21 గోల్స్ తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో అర్జెంటీనా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ప్రారంభం నుంచే ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరూ దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. కానీ ప్రథమార్ధంలో రెండు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు. అయితే రెండో హాఫ్ ఆరంభంలోనే అర్జెంటీనా బోణీ కొట్టింది. టొమాస్ డొమెనె 41వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ ఎదురుదాడికి దిగింది. ప్రత్యర్థి జట్టుపై వరుస దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే క్రమంలో 49వ నిమిషంలో ఫ్లోరిస



