
అహ్మదాబాద్: ఐపిఎల్ చరిత్రలోనే భారీ లక్షాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించింది గుజరాత్ టైటాన్స్. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిర గుజరాత్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. 164 పరుగుల లక్ష ఛేదనకు దిగిన గుజరాత్ సాయి సుదర్శన్(57), వాషిగ్టన్ సుందర్(40), జోస్ బట్లర్(26) రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి లక్షాన్ని అందుకుంది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ గుజరాత్ బౌలర్ల ధాటికి ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి భారీ షాకివ్వగా.. జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ నడ్డీ విరిచాడు. ఇక, 47 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయిన పంజాబ్‌ను సూర్యాన్ష్ షెడ్‌గే(57), మార్కస్ స్టోయినిస్(40)లు ఆదుకున్నారు. వీరిరువురూ గుజరాత్ బౌలింగ్‌ను ఎదుర్కొని స్కోర్ 120 దాటించారు. ఆచితూచి ఆడుతున్న ఈ జోడీని హోల్డర్ విడదీయడంతో 163 పరుగులకే పరిమితమైంది పంజాబ్.














