9962 వార్తలు



మనతెలంగాణ/హైదరాబాద్ : బండి భగీరథ్ అంశంలో కెటిఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కెటిఆర్‌కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలి తప్ప ఒక మైనర్ బాలికను అ డ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించాలనుకోవడం శాడిజం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం లో ఉన్నామని భావిస్తున్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశా రు. కెసిఆర్ దిగిపోయి చాలా రోజులయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ జడ్జీలుగా మా రి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని, కానీ, వారు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని రాజకీ యం చేస్తున్నారని, బిఆర్‌ఎస్ నేతల మాదిరిగా రోడ్డుమీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉం టుందని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీకి చెందిన వారికి బిఆర్‌ఎస్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు...? కార్మికుల కనీస వేతనాల పెంపుపై సచివాలయంలో గు రువారం సిఎం రేవంత్‌రెడ్డి విలేక

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలను భారీగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పెంచిన ఈ కొత్త వే తనాలు వచ్చే జూన్ 1నుంచి అమల్లోకి రానున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. వేతనాల సవరణ కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2 కింద మున్సిపాలిటీలు, జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలను చేర్చినట్లు సిఎం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వచ్చేనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సిఎం ప్రకటించారు. కార్మికుల కనీస వేతనాలపై గతంలో మం త్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, ప్రస్తుతం కా ర్మికులను నాలుగు విభాగాలుగా చేసి కనీస వేతనా లు నిర్ణయించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. కా ర్మికుల కనీస వేతనాల పెంపుపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామితో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీస వేతనాల పెంపుతో దాదా పు 1,11,56,204 కోట్ల మంది కార్మికులు లాభం చే కూరుతుందని ఆయన తెలిపారు. గత పదేళ్ల కెసిఆర్ హయాంలో కార్మికుల కనీస వేతనాలను నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహించా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ తీవ్రతతో పాటు వడ గాల్పులు కూడా తోడవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఏకం గా 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మా ర్కును దాటడం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గు రిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెద్దపల్లి జి ల్లా ముత్తారంలో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో 46.4, హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో 46.4, జిగిత్యాల జి ల్లా ధర్మపురి(నేరెళ్ల)లో 46.4, జయ శంకర్ భూ పాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్(కాళేశ్వరం)లో 46.4, కరీంనగర్ జిల్లా గంగాధర్‌లో 46.4. ఖ మ్మం జిల్లా కల్లూరులో 46.4, ఆసిఫాబాద్ కొము రంబీమ్ జిల్లాలో ఆసిఫాబాద్‌లో 46.4, మంచిర్యాల జిల్లా మందమర్రి (యెల్లందుక్లబ్)లో 46. 4, ములుగు జిల్లా వెంకటాపూర్ (వెల్టర్ల పల్లి )లో 46.4, నల్గొండ జిల్లా కట్టంగూర్ (ఎదులూరు)లో 46.4, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ (మల్లారం)లో 46.4, మహబూబా బాద్ జిల్లా కురవిలో 46.3, నిర

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్ధతి ప్ర కారం దర్యాప్తు చేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని సిఎం రే వంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనిఖీల్లో బం డి భగీరథ్ దొరికారని పోలీసులు చెప్పారని తాను పోలీసుల మాటలనే నమ్ముతానని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. బం డి భగీరథ్‌ను అప్పా జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బండి సం జయ్ స్వయంగా ఆయన కుమారుడిని అప్పగించారని వచ్చిన వార్తలపై సిఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ బండి సంజయ్ ఇంట్లో ఆయన కుమారుడిని పోలీసుల కు అప్పగిస్తే అప్పగింత అవుతుందని, నడిరోడ్డుపై పోలీసులు భగీరథ్‌ను అరెస్టు చేస్తే ఎలా అప్పగించినట్టు అవుతుందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఐదురోజులు పోలీసులు సోదా చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారని, ఒకవేళ బండి భగీరథ్‌ను సరెండర్ చేస్తే పోలీసులను పిలిచి అప్పచెబుతారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున ప డ్డాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆం దోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ తీవ్రస్థాయి లో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటు న్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డి కి లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద కన్నుమూసిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కెటిఆర్ డిమాం డ్ చేశారు.లేకపోతే సిఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో ఎ ప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బిఆర్‌ఎస్ హయాంలో కొం డంత ధైర్యంతో బతికిన రైతులు కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కన్నీటి సేద్యంగా మార్చేసిందని ఆరోపించారు. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనే దిక్కులేక రెండ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రైతుల సమస్యలు, పం టల కొనుగోలు, ఉద్యాన పథకాల నిధులపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సమగ్ర వినతిపత్రాలు సమర్పించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పరిస్థితులు, రై తుల ఆర్థిక ఇబ్బందులు, మార్కెట్ పరిస్థితులపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. యాసంగి 2025-26లో 20.29 లక్షల ఎకరాల్లో సాగుతో 47.23 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొ న్న, జొన్న దిగుబడి అయ్యే అవకాశం ఉందని, భారీ దిగుబడులతో ధరలు క్వింటాల్‌కు రూ.1,800కి పడిపోయాయని మం త్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్‌పి రూ.2,400 ఉండగా రైతులు నష్టపోతున్నారని, 336 కేంద్రాల ద్వారా 11.45 లక్ష ల మెట్రిక్ టన్నులు కొన్నా సరిపోవడం లేదన్నారు. మొక్క జొ న్న, జొన్నను ప్రైస్ సపోర్ట్ స్కీం (పిఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకువచ్చి 14.90 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2.01 లక్ష ల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోలుకు అనుమతించాలని కో రారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు పెరిగినా కేంద్రం కేవ లం 3,690 మెట్రిక్ టన్నులకే అనుమతి ఇచ్చిందని, ఎం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్లాట్లు, భూముల వేలానికి హెచ్‌ఎండిఏ సిద్ధమైంది. ఈ సారి రూ.2,500కోట్ల ఆదాయమే లక్ష్యంగా హె చ్‌ఎండిఏ వేలానికి సిద్ధమైంది. మొత్తం 168 ప్లాట్లు, 8.24ఎకరాల భూముల వేలం వేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. దీనికి సం బంధించిన నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది. కోకాపేట్‌లోని నియోపొలీస్ లేఔట్‌లోని ప్లాట్ల వేలంతో రూ.3,800 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకున్న హెచ్‌ఎండిఏ ఈసారి కూడా భారీగా ఆదాయాన్ని రాబట్టాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. మోకిల లే ఔట్‌లోని 100 ప్లాట్లకు వేలం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిల లే ఔట్ లోని 100 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. ఈ లే ఔట్‌లో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 300 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 500 చదరపు గజాలు గా ఉంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మేడిపల్లి లే ఔట్ లో 68 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో ప్లాట్ కనిష్ట విస్తీర్ణం 231 చదరపు గజాలు, గరిష్ట విస్తీర్ణం 643 చదరపు గజాల్లో ఉన్నాయి. దీంతోపాటు హైదరాబాద్ జిల్లా షేక్ పేట్ మండలంలోని హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి సైతం వేలం వేయనున్నారు. లే ఔట్‌లోని ప్లాట్లతోపాటు ఆ యా ప్రాంతాల్లోని ల్యాండ్ పార్శిళ్లక

ఐదు సమస్యల పరిష్కారంసీఎంతో భేటీ తర్వాత తొలిసారిమళ్లీ సమావేశం కావాలని నిర్ణయంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై గురువారం ముందడుగు పడింది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత తొలిసారిగా హైదరాబాద్ బస్‌భవన్‌లో 13 కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు(ఈడీ)లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అన్నీ సంఘాలు అంగీకరించిన కామన్ డిమాండ్లను తొలుత చర్చించారు. ఈ సమస్యలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో ఉన్నవి కావడంతో ఇరుపక్షాలు చర్చించాయి. కాగా మరోసారి సమావేశం కావాలని సంఘాల నేతలు, ఈడీలు […] The post కామన్ డిమాండ్లపై 13 కార్మిక సంఘాలతో ఆర్టీసీ ఈడీల చర్చలు appeared first on Navatelangana.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్హైదరాబాద్లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించు కునేందుకు హైకోర్టు అను మతి ఇచ్చి, ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. అనంతరం పరారీలో ఉన్న భగీరథ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ […] The post భగీరథ్ ముందస్తు బెయిల్‌పిటిషన్ తిరస్కరణ appeared first on Navatelangana.

తరుగు పేరుతో రైతులను మోసం చేయడం తగదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ • మార్కెట్ సందర్శన నవతెలంగాణ- తాడూర్నిల్వ ఉన్న మక్కలు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, తరుగు పేరుతో రైతులను మోసం చేయడం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ను గురువారం స్థానిక నాయకులతో కలిసి సాగర్ సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్ని […] The post నిల్వ ఉన్న మక్కలు కొనుగోలు చేయాలి appeared first on Navatelangana.

సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడునివాళ్లర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య నవతెలంగాణ-నిజాంపేట్సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడు.. కార్మిక నాయకులు ఉద్ధరాజు బాపిరాజు(80) బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బాచుపల్లిలో అనారోగ్యంతో మరణించారు. బాపిరాజు భౌతిక కాయానికి గురువారం ఉదయం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నాయ కులు డిజి.నరసింహారావు, మేడ్చల్ జిల్లా […] The post కార్మిక నాయకుడుఉద్ధరాజు బాపిరాజు కన్నుమూత appeared first on Navatelangana.

బట్టల దుకాణం దగ్ధం..కోట్లలో ఆస్తి నష్టం• మూడు గంటలపాటుమంటలను ఆర్పేసినఅగ్నిమాపక సిబ్బంది నవతెలంగాణ-హైదరాబాద్వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని మదీనా ఫత్తర్‌ఘట్టి ప్రాంతంలో ఉన్న ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న ‘యూనిస్ కిడ్స్ వేర్’ బట్టల దుకాణంలో ఉదయం సుమారు 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు […] The post పాతబస్తీ మదీనాలో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

రిజర్వు చేసుకునే అవకాశం : ఎండీ వై.నాగిరెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ఆ సంస్థ వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. గురువారం (మే 21వ తేదీ నుంచి) జూన్ ఒకటో తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేం దుకు కాళేశ్వరానికి వెళ్లే […] The post పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు appeared first on Navatelangana.

చర్మ, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధుల విజృంభణప్రాణం అరచేతిలో పెట్టుకుని జీవనంరాంకీ వ్యవహారశైలిపై ఆగ్రహం..అఖిలపక్ష సమావేశంలో నేతలుడంప్ యార్డు తొలగించాలని డిమాండ్‌నేడు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకి నిర్ణయం నవతెలంగాణ-సిటీబ్యూరో/ఎల్బీనగర్/నాగోల్‌మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ప్రాతంలో ఉన్న డంపింగ్ యార్డు ప్రజల ప్రాణాలను హరించే ప్రమాదకర స్థితికి చేరిందని స్థానికులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే డంపింగ్ యార్డును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. […] The post జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తేయాల్సిందే appeared first on Navatelangana.

తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడనే కోటి సుబ్బారెడ్డి• పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు నివాళులు• నవతెలంగాణ అకౌంటెంట్ శివారెడ్డికి సిబ్బంది ఓదార్పునవతెలంగాణ- ఎర్రుపాలెంతుది శ్వాస వరకు ఎర్రజెండా నీడనే నిలిచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేసిన కృషీవలుడు కోటి సుబ్బారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యుడిగా పని చేసిన కోటి సుబ్బారెడ్డి […] The post వడదెబ్బతో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి appeared first on Navatelangana.

అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా విభజనకోటి 11 లక్షల మందికి మేలుజూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమలు : విలేకర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్ కార్మికుల కనీస వేతనాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కార్మికులను అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా […] The post కేటగిరీలుగా కార్మికులు appeared first on Navatelangana.

పెరిగిన ధరలకు అనుగుణంగా పెంపు లేదు: సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 14 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ విషయమేనని తెలిపారు. వచ్చే నెల 2 […] The post వేతనాల పెంపులో పారదర్శకత ఏది? appeared first on Navatelangana.

ఎండదెబ్బకు అట్టుడుకుతున్న తెలంగాణ20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుఈనెల 25 వరకు వడగాలులు వీస్తాయన్న వాతావరణశాఖమధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని ప్రజలకు సూచన హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. భానుడి సెగతో అట్టుడుకుతోంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక వేడిగాలులకు బయటకు రాలేక నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు […] The post నిప్పులకొలిమి appeared first on Navatelangana.

రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఇంధన కొరతసగానికి పడిపోయిన దిగుమతులుప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా ఆలస్యం న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల అనంతరం ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో భారతదేశంలో రోజుకు దాదాపు 4 లక్షల బ్యారెళ్ల ఎల్పీజీ కొరత ఏర్పడింది. ప్రముఖ విశ్లేషణాత్మక సంస్థ కెప్లర్ గణాంకాల […] The post భారత్‌కు ఎల్పీజీ కటకట appeared first on Navatelangana.

ఐదు రోజుల్లో 15.6 మిలియన్ల ఫాలోవర్లు…బీజేపీ, కాంగ్రెస్ లను దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీసీజేపీకి పోటీగా ఎన్‌పీఎఫ్..సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపివేత.. ఇండియాలో జెన్-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా? నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో/ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిభారతదేశ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న డిజిటల్ విప్లవం నడుస్తోంది. కేవలం ఒక కామెంట్ తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనే రాజకీయ ఉద్యమం, కేవలం ఐదు రోజుల్లోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి దేశంలోని అతిపెద్ద […] The post సీజేపీ వినూత్న డిజిటల్ విప్లవం appeared first on Navatelangana.

38 నెలల్లో చోంగ్‌కింగ్ రైల్వే స్టేషన్ ను నిర్మించిన చైనాప్రపంచదేశాల్లోనే అగ్రభాగాన నిలిచేందుకు చైనా నిరంతరం శ్రమిస్తోందనటానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ. ఆయుధాలు అమ్ముకోవటానికి యుద్ధోన్మాద చర్యలకు అమెరికా దిగుతుంటే… చైనా మాత్రం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ మాత్రం ఇప్పటికీ ఆంగ్లేయులు నిర్మించిన రైల్వేస్టేషన్లు, వంతెనలపైనే ఆధారపడుతోంది. బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం చైనాను సందర్శించినప్పుడు, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే […] The post రోబో సైన్యంతో రైల్వే స్టేషన్ నిర్మాణం appeared first on Navatelangana.