TTTTటుడేతెలుగుUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
Advertisement
Sponsored by MATA – Mana American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

9967 వార్తలు

నిప్పులకొలిమి
తెలంగాణ

నిప్పులకొలిమి

ఎండదెబ్బకు అట్టుడుకుతున్న తెలంగాణ20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుఈనెల 25 వరకు వడగాలులు వీస్తాయన్న వాతావరణశాఖమధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని ప్రజలకు సూచన హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. భానుడి సెగతో అట్టుడుకుతోంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక వేడిగాలులకు బయటకు రాలేక నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు […] The post నిప్పులకొలిమి appeared first on Navatelangana.

భారత్‌కు ఎల్పీజీ కటకట
తెలంగాణ

భారత్‌కు ఎల్పీజీ కటకట

రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఇంధన కొరతసగానికి పడిపోయిన దిగుమతులుప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా ఆలస్యం న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ జరిపిన దాడుల అనంతరం ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో భారతదేశంలో రోజుకు దాదాపు 4 లక్షల బ్యారెళ్ల ఎల్పీజీ కొరత ఏర్పడింది. ప్రముఖ విశ్లేషణాత్మక సంస్థ కెప్లర్ గణాంకాల […] The post భారత్‌కు ఎల్పీజీ కటకట appeared first on Navatelangana.

సీజేపీ వినూత్న డిజిటల్ విప్లవం
తెలంగాణ

సీజేపీ వినూత్న డిజిటల్ విప్లవం

ఐదు రోజుల్లో 15.6 మిలియన్ల ఫాలోవర్లు…బీజేపీ, కాంగ్రెస్ లను దాటేసిన కాక్రోచ్ జనతా పార్టీసీజేపీకి పోటీగా ఎన్‌పీఎఫ్‌..సీజేపీ ఎక్స్ ఖాతా నిలిపివేత.. ​ఇండియాలో జెన్‌‌-జీ ఉద్యమం ప్రారంభమైనట్టేనా? నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో/ఖమ్మం ​ప్రాంతీయ ప్రతినిధిభారతదేశ సోషల్ మీడియా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్న డిజిటల్ విప్లవం నడుస్తోంది. కేవలం ఒక కామెంట్ తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనే రాజకీయ ఉద్యమం, కేవలం ఐదు రోజుల్లోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి దేశంలోని అతిపెద్ద […] The post సీజేపీ వినూత్న డిజిటల్ విప్లవం appeared first on Navatelangana.

రోబో సైన్యంతో రైల్వే స్టేషన్‌ నిర్మాణం
తెలంగాణ

రోబో సైన్యంతో రైల్వే స్టేషన్‌ నిర్మాణం

38 నెలల్లో చోంగ్‌కింగ్ రైల్వే స్టేషన్‌ ను నిర్మించిన చైనాప్రపంచదేశాల్లోనే అగ్రభాగాన నిలిచేందుకు చైనా నిరంతరం శ్రమిస్తోందనటానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ. ఆయుధాలు అమ్ముకోవటానికి యుద్ధోన్మాద చర్యలకు అమెరికా దిగుతుంటే… చైనా మాత్రం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ మాత్రం ఇప్పటికీ ఆంగ్లేయులు నిర్మించిన రైల్వేస్టేషన్లు, వంతెనలపైనే ఆధారపడుతోంది. బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత వారం చైనాను సందర్శించినప్పుడు, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే […] The post రోబో సైన్యంతో రైల్వే స్టేషన్‌ నిర్మాణం appeared first on Navatelangana.

శుక్రవారం రాశిఫలాలు ( 22-05- 2026)
తెలంగాణ

శుక్రవారం రాశిఫలాలు ( 22-05- 2026)

మేషంసంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృషభం వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. మిధునం ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. కర్కాటకం ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన

ఎబోలా పై కేంద్రం హై అలర్ట్
చా‌య్‌ తాగేలోపే సమస్య పరిష్కారం
తెలంగాణ

చా‌య్‌ తాగేలోపే సమస్య పరిష్కారం

ముఖ్యమంత్రి మాటను గుర్తు చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులుఐదు శాతం వేతన పెంపు ప్రతిపాదనలపై సర్వత్రా నిరసనగతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ నవతెలంగాణ – వేలేరు‘చాయ్‌ తాగేలోపు’ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న సీఎం మాటలు నీటి మూటలుగా మిగిలాయని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగమే ఉండబోదననీ, అందరినీ క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లపాటు కాలయాపన […] The post చా‌య్‌ తాగేలోపే సమస్య పరిష్కారం appeared first on Navatelangana.

యుద్ధంపై విభేదాలు
ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం
తెలంగాణ

ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం

మదురో, ఖమేనీ, రౌల్ క్యాస్ట్రోఫొటోలతో వైట్‌హౌస్ పోస్టర్రౌల్ క్యాస్ట్రో ఫొటోపై‘నేరారోపణల నమోదు’ స్టాంప్దీనిపై వివరణ ఇచ్చేందుకువైట్ హౌస్ నిరాకరణవాషింగ్టన్ : ‘ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం’ అనే శీర్షికతో ఒక గ్రాఫిక్ పోస్టర్‌‌ను వైట్ హౌస్ విడుదల చేసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ నేరారోపణలను నమోదు చేసిన నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వెనిజులా మాజీ పాలకుడు నికోలస్ మదురో, ఇరాన్ […] The post ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం appeared first on Navatelangana.

హార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్
తెలంగాణ

హార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్

ఒప్పందాలు, తనిఖీలు, రుసుములతో జలసంధిని దాటుతున్న నౌకలుటెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో ఇంధన నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు సరఫరాలు సజావుగా జరిగేందుకు వీలుగా ఇరాన్ బహుళ అంచెల వ్యవస్థను అమలు చేస్తోంది. చమురు నౌకల సిబ్బంది ఇరాన్ నిర్దేశించిన దారిలో చెక్‌పోస్టుల మీదుగా హార్ముజ్ జలసంధిలో తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఇరాన్ నుంచి ముడి చమురును తీసుకొని వియత్నాం వెళుతున్న ఓ నౌక ఏప్రిల్ చివరి నుంచి దుబాయి తీరంలో […] The post హార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్ appeared first on Navatelangana.

చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం
తెలంగాణ

చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం

ఐపిఎల్ సీజన్ 2026 ప్లేఆఫ్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) నిష్క్రమించింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన గిల్ 37 బంతుల్లోనే 64, సుదర్శన్ 53 బంతుల్లోనే 84 పరుగులు చేశారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్, రబడా మూడేసి వికెట్లను పడగొట్టారు. సిఎస్‌కె టీమ్‌లో శివమ్ దూబె 17 బంతుల్లోనే 47 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంపాటి కార్తీక (8) అనే చిన్నారి నారాయణపురం గ్రామంలోని యాదవుల బజారులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఆటలు ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లను తాకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్తీక కుటుంబం స్వస్థలం వైరా మండలం పుణ్యపురం గ్రామం. కొంతకాలం క్రితం చిన్నారి తండ్రి మృతి చెందడంతో, కుటుంబ పోషణ కోసం తల్లి తల్లాడ మండలం నారాయణపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తోంది. కుమారుడు, కుమార్తె ఇద్దరినీ చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

చెన్నైకి గుజరాత్ షాక్.. 89 రన్స్ తేడాతో టైటాన్స్ విక్టరీ.. ఐపీఎల్ నుంచి CSK ఔట్!
ఇద్దరిలో అబద్ధం చెప్పిందెవరు?
తెలంగాణ

ఇద్దరిలో అబద్ధం చెప్పిందెవరు?

పోక్సో కేసు నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ రచ్చకు దారితీసిందని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమా ర్ అన్నారు. ఈ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అసలు జరిగింది పోలీసు అరెస్ట్ కాదా? లాయర్ల సమక్షంలో జరిగిన సరెండరా? ఏది నిజం? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సిఎం రేవంత్‌రెడ్డి అబద్ధం చెబుతున్నారా.. లేక కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్ధం చెబుతున్నారా? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్డు మధ్యలో నాకాబందీ నిర్వహించి మరీ బండి భగీరథ్‌ను పోలీసు లు అరెస్ట్ చేశారని, ఇందులో రాజకీయం లేదు, పోలీసుల మాట న మ్మాలని సిఎం స్పష్టం చేశారని అన్నారు. దీనికి భిన్నంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారని చెప్పారు. తాను ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకుడిగా తన కొడుకును తానే లాయర్ల ద్వారా పోలీసులకు సరెండర్ చేశానని అని చాలా స్పష్టంగా ప్ర కటించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని నమ్మాలా.. లేక దేశ హోంశాఖ సహాయ మంత్రిని నమ్మాలా.. అర్థం

మూగ జీవుల వేసవి రోదన.. బస్సును ఆపి మరీ నీళ్లు తాగిన కొండముచ్చులు.. వీడియో వైరల్
సరస్వతి పుష్కరాలకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు
తెలంగాణ

సరస్వతి పుష్కరాలకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం టిజిఎస్ ఆర్‌టిసి మే 21గురువారం నుండి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ స్పెషల్ బస్సు సర్వీసులు జూన్ 1 వరకు నడుపుతున్నట్లు సంస్థ ఎండి వై. నాగిరెడ్డి తెలిపారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. హైదరాబాద్, నర్సంపేట, తొర్రూరు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుంచి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సుల వేళలు, ఇతర వివరాల కోసం సంబంధిత డిపోలను సంప్రదించవచ్చని తెలిపారు. నర్సంపేట: 9959226293, తొర్రూరు: 9959226053, భూపాలపల్లి: 9959226707, మణుగూరు: 9959225963, కరీంనగర్: 9959225920, మంథని: 9959225923, హన్మకొండ: 9959226049, మహబూబాబా

రూ.17 కోట్ల GST ఫ్రాడ్.. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గ్రానైట్ రవాణా.. ఎట్టకేలకు దొరికిపోయారు
63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ప్లేఆఫ్స్ కి చేరేనా!
‘చిరు158’ సినిమా షురూ
తెలంగాణ

‘చిరు158’ సినిమా షురూ

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ’వాల్తేర్ వీరయ్య’ సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్ ‘చిరుబాబీ2’, ‘చిరు158’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం గురువారం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్

హైదరాబాద్‌లో వాలెట్ పార్కింగ్ సమస్యలపై హైకోర్టు ఆందోళన
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.840 కోట్లు
తెలంగాణ

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.840 కోట్లు

కరీంనగర్ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసిఎఫ్) కింద రూ.840 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ అభివృద్ధికి రూ.630 కోట్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్రం గురువారం ప్రకటించింది. డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నీటి నివారణ చర్యలకు రూ.130 కోట్లు ఆమోదం తెలిపింది. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.80 కోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా ఆమోద లేఖ పంపారు.

రెండు నెలలకు ఒక వెకేషన్.. మీ జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో తెలుసా!
నో రిస్ట్రిక్షన్స్.. మీ ఇష్టం.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై పరిమితి లేదు: కేంద్రం